Premante Movie Review: ప్రేమంటే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, యాంకర్ సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, అభయ్ బేతిగంటి, కీరిటీ తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు
సహ నిర్మాత: ఆదిత్య మెరుగు
సమర్పణ: సొనాలి నారంగ్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి
ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్
ఆర్ట్: అరవింద్ ములే
క్యాస్టూమ్ డిజైనర్ం గౌరీ నాయుడు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, స్పిరిట్ మీడియా
రిలీజ్ డేట్: 2025-11-21

సెక్యూరిటీ సిస్టమ్ బిజినెస్ చేసే మది అలియాస్ మధుసూదన్ (ప్రియదర్శి)ని పెళ్లి విషయంలో ఓ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో ఆ పెళ్లి వేడుకలో అనుకోకుండా పరిచయమైన రమ్య (ఆనంది)ను మది ఇష్టపడుతాడు. రమ్య కూడా మదిని ఇష్టపడుతుంది. అలా ఇద్దరి మనసులు కలిసిపోయి పెద్దల అంగీకారంతో ఒక్కటవుతారు. ఆ తర్వాత మధుసూదన్ చేసేది ఉద్యోగం కాదు. రాత్రిళ్లు దొంగతనం చేస్తాడని షాకింగ్ విషయం రమ్యకు తెలుస్తుంది.

Premante Movie Review and Rating

బ్రేకప్ తర్వాత రమ్యను మది ఎలా ఒప్పించాడు? మది ప్రపోజల్‌ను రమ్య ఎలా అంగీకరించింది? ఆ తర్వాత వారిద్దరి కాపురం ఎలా సాగింది? తన భర్త దొంగ అని తెలిసిన తర్వాత రమ్య రియాక్షన్ ఏమిటి? మది ఎందుకు దొంగగా మారాడు? విలాసవంతమైన నివాసాల్లో మది చేసే దొంగతనాలను దర్యాప్తు చేసే పోలీసులు సంపత్ కుమార్ (వెన్నెల కిషోర్), ఆశా మేరి (యాంకర్ సుమ) వేట ఎలా సాగింది? మది, రమ్య దాంపత్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమంటే సినిమా కథ.

ఏదో ఊహించుకొని పెళ్లి చేసుకొన్న భర్త తన ఊహలకు ఏ మాత్రం సరితూగని వ్యక్తి అని తెలిసిన పాయింట్ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాయింట్‌ చుట్టూ అందమైన ప్రేమ కథ, దాంపత్య జీవితాన్ని అల్లడమే అసలు సిసలైన ఛాలెంజ్. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఈ క్లిష్టమైన పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. ఫీల్‌గుడ్ అంశాలను కొన్ని జొప్పించినప్పటికీ సినిమాను కాపాడలేకపోయాయి. ఇక వెన్నెల కిషోర్, యాంకర్ సుమ ట్రాక్ చాలా పేలవంగా, నిస్తేజంగా సాగుతుంది. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ.. వారిని సరిగా వాడుకోకపోవడం మరో మైనస్‌గా అనిపిస్తుంది. సంపన్న కుటుంబాలకు చెందిన నివాసాల్లో దొంగతనాలు చేయడమే పాయింట్ పూర్తిగా తేలిపోవడంతో ఫస్టాఫ్ కొంత పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ ఓపిక, సహనానికి పరీక్షలా ఉంటుంది.

ప్రియదర్శి, ఆనంది జంట రొమాంటిక్ సీన్లలో ఫర్వాలేదనిపిస్తుంది. కానీ వారిద్దరూ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి సరైన సరుకు లేకపోవడంతో డీలా పడిపోయారు. ఎంత సేపు దొంగతనాలు, అనవసర విషయాలతో సినిమా అంతా సాగదీసి.. సాగదీసి.. ఆడియెన్‌కు రెండు గంటలపాటు కఠినమైన పరీక్షగానే మారుతుంది. సుమ కనకాల పాత్ర అంతగా ఆకట్టుకొనేలా ఉండదు. వెన్నెల కిషోర్, సుమ మధ్య కామెడీ ట్రాక్ అవుట్ డేటెడ్ ఫార్మాట్‌‌లా కనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విశ్వనాథ్ రెడ్డి, లియోన్ జేమ్స్ పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటలు అంతగా ఆకట్టుకొనేలా ఉండవు. సెకండాఫ్‌లో ఎడడిటర్ రాఘవేంద్రకు ఇంకా చేతి నిండా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ నుంచి గతంలో మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకులను ఆలరించాయి. ఈ సినిమా విషయంలో పూర్తిగా మిస్ అయ్యారు. నిర్మాతలు జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు భారీగా ఉన్నా.. వాటికి తగ్గ ఫలితం తెర మీద కనిపించదు. మెదడుకు పనిపెట్టకుండా సినిమా చూస్తే ఏమైనా నచ్చుతుందో.. ఏమో.. కామెడీ ట్రాక్ తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది. ఈ సినిమా రెండు గంటలపాటు ప్రేక్షకుడికి కఠిన పరీక్షే.

More from Filmibeat

Read more about: priyadarshi anandi Premante
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X