Premistava Movie Review: ప్రేమిస్తావా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ఆకాశ్ మురళి, అదితి శంకర్, కుష్బూ సుందర్, శరత్ కుమార్, దగ్గుబాటి రాజా, ప్రభు, కల్కి కోష్లీన్ తదితరులు
దర్శకత్వం: పంజా ఫేమ్ విష్ణువర్ధన్
నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి: ఎరిక్ బ్రైసన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రిలీజ్ డేట్: 2025-01-31
కాలేజీలో దియా రామలింగం (అదితి శంకర్)ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయిన అర్జున్ (ఆకాశ్ మురళి) ఆమె వెంటపడుతాడు. కానీ అర్జున్ ప్రేమను తొలుత నిరాకరించినప్పటికీ.. ఓ దశలో ఒకే చెబుతుంది. అయితే కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించే దియా లైఫ్‌లో బాగా సెటిల్ కావాలనుకొంటుంది. కానీ అర్జున్‌కు దియానే ప్రపంచం. ఈ క్రమంలో వారిద్దరి ప్రేమకు బ్రేకప్ జరుగుతుంది. పోర్చుగల్‌లో మంచి ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిన దియా.. అక్కడ తన కంపెనీ ఓనర్ కార్తీక్ హత్య కేసులో జైలుకు వెళ్తుంది.
తన ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమించే అర్జున్ ప్రేమను దియా ఎందుకు నిరాకరించింది. అర్జున్ లవ్ ప్రపోజల్‌ను ఆ తర్వాత ఎందుకు ఒప్పుకొన్నది? అయితే ఇద్దరు కలిసి రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సమయంలో అర్జున్‌కు ఎందుకు బ్రేకప్ చెప్పింది? పోర్చుగల్‌లోకు వెళ్లిన దియా.. కార్తీక్‌ను ఎందుకు హత్య చేసింది? కార్తీక్ హత్య కేసులో ఎలా ఇరుక్కుపోయింది? దియా మర్డర్ కేసులో ఇరుక్కొన్నదనే విషయం తెలిసిన అర్జున్.. పోర్చుగల్‌కు వెళ్లి ఏం చేశాడు? కార్తీక్ మర్డర్ కేసుకు ఆదినారాయణ (శరత్ కుమార్), వసుంధర (కుష్బూ సుందర్)కు సంబంధమేమిటి? కార్తీక్ మర్డర్ తర్వాత వరదరాజన్ (దగ్గుబాటి రాజా) ఎలాంటి ఎత్తులు వేశాడు? ఈ కేసులో ముద్దాయిగా మారిన దియాను రక్షించేందుకు ఇందిరా (కల్కి కోష్లీన్) ఎలాంటి ప్రయత్నాలు చేసింది? చివరకు దియా కేసు నుంచి బయట పడిందా? కార్తీక్‌ను హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ప్రేమిస్తావా? సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. రెగ్యులర్ కథ, కథనాలతో లవ్ స్టోరీని సాగదీశాడనే చెప్పాలి. దియా, అర్జున్ ప్రేమ కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. ప్రేమికుల మధ్య అవే గొడవలు, అవే విభేదాలు, రొటీన్ సీన్లతో ఏం జరుగుతుందనే విషయం ఆర్థం కాకుండా ఉంటుంది. ఇక ఫస్టాఫ్‌లో బ్రేకప్ జరిగిన తర్వాత కథ పొర్చుగల్ చేరడంతో స్టోరీలో కీలక మలుపు తిరుగుతుంది.
అయితే సెకండాఫ్‌లోనైనా స్టోరీలో వేగం, కొత్తదనం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా? అనే ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతుంది. కానీ చివరి 20 నిమిషాల్లో కథలో అసలు కదలిక, ఊహించని ట్విస్టులు చోటు చేసుకొంటాయి. దాంతో ప్రేక్షకుడికి ఓ రకమైన జోష్ కలుగుతుంది.. మైండ్‌ను యాక్టివేట్ చేసినట్టు అనిపిస్తుంది. శరత్ కుమార్, కుష్బూ, దగ్గుబాటి రాజా మధ్య సన్నివేశాలు చాలా ఇంటెన్సివ్‌గా అనిపిస్తాయి. చివర్లో ప్రభు ఎంట్రీతో మరో ట్విస్టును క్రియేట్ చేసి.. దర్శకుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో సినిమాను ఫీల్ గుడ్‌తో ముగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది.
నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కథలో బలమైన సన్నివేశాలు లేకపోయినప్పటికీ.. స్క్రిప్టు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఆదితి శంకర్, ఆకాశ్ మురళీ, శరత్ కుమార్, కుష్బూ, దగ్గుబాటి రాజా తమ ఫెర్ఫార్మెన్స్‌తో మూవీని నిలబెట్టారు. ముఖ్యంగా ఆకాశ్ మురళీ మొత్తంగా కథను తన భుజాన వేసుకొని నడిపించాడు. నటనకు కొత్తవాడైనా మెచ్యురిటీతో నటించాడు. తన క్యారెక్టర్‌కు తగినట్టు బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక అదితి శంకర్ కూడా తన యాక్టింగ్‌తో ఇరగదీసింది. ఎమోషనల్ సీన్లలో మంచి మార్కులు కొట్టేసింది.
ఇక ఈ సినిమా కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లో శరత్ కుమార్, కుష్బూ, దగ్గుబాటి రాజా, బాలీవుడ్ నటి కల్కి కోష్లీన్ నటించారు. సెంకడాఫ్‌లో సీనియర్ నటులు తమ నటనతో మూవీని మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ప్రభు స్పెషల్ ఎప్పీరియెన్స్‌తో జోష్ పుట్టించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి మూడ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ అండగా నిలవడంతో మరింత రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. పోర్చుగల్‌లో సన్నివేశాలను కామెరూన్ ఎరిక్ బైసన్ అద్బుతంగా తెరకెక్కించారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్ క్రియేటర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
ఫైనల్‌గా ప్రేమిస్తావా? సినిమా గురించి చెప్పాలంటే? రొటీన్, రెగ్యులర్ లవ్ స్టోరికి.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మర్డర్ మిస్టరీగా స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మలిచిన తీరు బాగుంది. ఇంకా, కథ, కథనాలపై దృష్టిపెట్టాల్సిందనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా వేగం మందగించడం వల్ల కథలో ఉండే ఎమోషన్స్ వర్కవుట్ కాలేదనిపిస్తుంది. కానీ నటీనటుల ఫెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. మర్డర్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











