twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమిస్తే

    By Staff
    |

    Premiste
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: ప్రేమిస్తే (తమిళంలో 'కాదల్‌')
    విడుదల తేదీ: 12 అక్టోబర్‌ 2005
    నటీనటులు: సంధ్య, భరత్‌, సుకుమార్‌, శరణ్య, మీనాక్షి తదితరులు
    సంగీతం: జోష్వా శ్రీధర్‌
    తమిళ నిర్మాత: శంకర్‌
    తెలుగు నిర్మాత: సురేష్‌ కొండేటి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ శక్తివేల్‌

    మనకు తెలిసున్న ప్రేమకథనే మన చుట్టూ ఉన్న పాత్రలతో, పరిస్ధితులతో మలిస్తే 'ప్రేమిస్తే' చిత్రం తయారవుతుంది. మధురైలో జరిగిన వాస్తవ సంఘటనలను స్ఫూర్తిగా చేసుకుని, బిగి సడలని స్క్రీన్‌ప్లేతో చేసిన ఈ ప్రయోగంసినిమా ప్రేమికులందరూ చూడదగింది.

    పదో తరగతి చదివే ఐశ్వర్య అనే అమ్మాయి ప్రేమ కథ ఇది. మురళి అనే మెకానిక్‌తో ప్రేమలో పడి ఆ తెలిసీ తెలియని వయసులోనే లేచిపోవాలనుకుంటుంది. ఓ పక్క తండ్రి, కుటుంబం గుర్తుకు వస్తున్నా కన్నీళ్ళు దిగమింగుకుని మురళితో కలిసి చెన్నై బస్‌ ఎక్కుతుంది. బస్సు ముందుకు వెళుతుండగా మనసు వెనక్కి ప్రయాణిస్తుంది. మురళితో కాకతాళీయంగా పరిచయం కావడం, కోపం ప్రేమగా మారడం, పెద్దవాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారని, అతనితో లేచిపోవాలనుకోవడం చకచకా జరిగిపోతాయి.

    చెన్నై చేరిన ప్రేమజంటకు అనేక బాధలు ఎదురవుతాయి. మురళి స్నేహితుడి గదికి వెళ్తారు. ఒక గదిలో ఇరవై మంది ఉంటారు. చేతిలో కొద్దిగా మాత్రమే డబ్బు మిగిలి ఉంటుంది. మురళి మిత్రుడి సాయంతో ఇల్లు వెదుకుతుంటే పెళ్ళి కాని వారికి ఇల్లు ఇవ్వరని తెలుస్తుంది. మరో వైపు ఐశ్వర్య తండ్రి, చిన్నాన్న ఆమె కోసం వాకబు చేస్తుంటారు. చివరికి పెళ్ళి చేసుకుని ఒక ఇంటివారవుతారు. ఇంతలో ఆ ప్రేమ జంటకు పెద్ద అవరోధం ఎదురవుతుంది. అది ఏమిటన్నది తెర మీద చూడాల్సిందే.

    స్క్రీన్‌ప్లే నైపుణ్యానికి ఈ సినిమా ఒక మచ్చుతునక. ప్రారంభంలోనే హీరోయిన్‌ కుటుంబ సభ్యుల పాత్రలను ఫోటోతో పరిచయం చేయడం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఇంటర్వల్‌ తర్వాత చెన్నై సన్నివేశాలు వాస్తవికంగా, హృద్యంగా ఉన్నాయి. హీరో లేకుండా చివరివరకు సినిమా నడిపించడం నిజంగా ప్రయోగమే. సంధ్య, భరత్‌లు పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సాంకేతికంగా ఇంకా చేయడానికి వీలున్నా నేటివిటీ కోసం దర్శకుడు పరిధులు దాటకపోవడం ప్రశంసనీయం. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది. క్లెయిమాక్స్‌ నెగిటివ్‌గా ఉండడం తెలుగు ప్రేక్షకులకు నచ్చితే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X