'ప్రిన్స్' ఆఫ్ పర్షియా (హాలీవుడ్ ఫిల్మ్ రివ్యూ)

చిత్రం: ప్రిన్స్ ఆఫ్ పర్షియా
నటీనటులు: జాక్ గైలెన్ హాల్, జమ్మా ఆర్టెరిటన్, బెన్ కింగ్ స్లే, రిచ్చర్డ్ కోయల్, టోబి తదితరులు
దర్శకత్వం: మైక్ న్యూయెల్
నిర్మాత: జెర్రి బ్రూక్ హైమర్
విడుదల తేదీ: 28, మే 2010
రాజుని చంపారన్న నేరం మోపబడ్డ ఓ అనాధ తనకు దొరికిన అరుదైన మ్యాజిక్ కత్తితో, ప్రక్క రాజ్యం యువరాణితో కలిసి ఎలా తను నిరపరాధినని నిరూపించుకున్నాడనే పాయింటుతో తీయబడ్డ చిత్రం ప్రిన్స్ ఆఫ్ పర్షయా. ఇలాంటి జానపద చిత్రాలు ఎన్టీఆర్ కాలంలో చాలా వచ్చి హిట్టనవే. అయితే అవి తెలియని ఈ తరానికి కొత్త ఎక్సపీరియన్స్ ని ఈ చిత్రం ఇస్తుంది. అలాగే ఈ చిత్రంలోని భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, గాంధీ ఫేమ్ బెన్ కింగ్లెస్ లే నటన, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు కట్టిపారేస్తాయి.
అనాధైన దస్తాన్(జాక్ గైలెన్ హాల్) ధైర్య సాహసాలు చూసి పర్షియా చక్రవర్తి అతన్ని చిన్న తనంలోనే దత్తత చేసుకుని తన సొంత కొడుకులు టస్(రిచ్చర్డ్ కోయల్), గర్సవ్(టోబి) లతో సమానంగా పెంచుతాడు. పెద్దయ్యాక దస్తాన్ అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారని ప్రక్క రాజ్యంపై దండెత్తుతాడు. విజయం సాధించిన దస్తన్.. యువరాణి తమీనా(జమ్మా ఆర్టెరిటన్)తోనూ,ఆమెకు చెందిన ఓ మ్యాజిక్ కత్తిని తీసుకుని వస్తాడు. ఈ విజయ సంబరాలు జరుపుకునే సమయంలో చక్రవర్తి హత్య జరుగుతుంది. ఆ నేరం దస్తాన్ పై పడుతుంది. దస్తాన్ కి చక్రవర్తి పెద్ద కుమారుడు టస్ తనను తప్పించటానికే ఈ పనిచేసాడనుకుని దస్తాన్ బయిలుదేరుతాడు. అతన్ని యువరాణి తమీనా అనుసరిస్తుంది. ఈ లోగా దస్తాన్ ఆ కత్తి కి జరిగిన గతాన్ని వెనక్కి తీసుకుని రాగల శక్తి ఉందని అర్ధం చేసుకుంటాడు. ఈ శక్తి సాయింతో దస్తాన్ తాను నిరపరాధినని ఎలా నిరూపించుకుంటాడు...అసలు విలన్ ఎవరు అనేది ఎలా పట్టుకుంటాడనేది మిగాతా కథ.
2003 లో వచ్చి పాపులర్ అయిన వీడియో గేమ్ ఆధారంగా 'వాల్ట్ డిస్నీ" వారు 2,500 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో నిర్మించారు. ఇక ఈ వీడియో గేమ్ కి ఆధారం అరేబియన్ నైట్స్. అలాగే ఫస్ట్ ట్విస్ట్ పడ్డ తర్వాత నుంచి మ్యాజిక్ కత్తి హీరోకి దొరికే దాకా కొద్ది గా బోర్ వస్తుంది. అలాగే కత్తి వచ్చిన తర్వాత చూసే వారి దృష్ఠి అంతా అంత పవర్ గల ఆ కత్తి కథలో ఏ మార్పులు తీసుకురాబోతోందనే అంశం పై ఉంటుంది. అయితే హీరో దాన్ని పట్టుకుని తిరుగుతూంటాడు కానీ దాన్ని ఉపయోగించి విలన్స్ భరతం పట్టడమే లేక తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటమో చెయ్యడు..అదే లోపంగా అనిపిస్తుంది. ఇక ధ్రిల్లర్ గా ఎవరు విలన్ అనేటట్లు కథనం రాసుకోవటం బావుంటుంది.
ఏదైమైనా రెగ్యులర్ సినిమాలనుంచి ఉపశమనం పొందటానికి ఈ ఫాంటసీ యాక్షన్, ఎడ్వంచర్ చిత్రానికి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు . అలాగే ఎక్కడా సెక్స్, హింస లేవు కాబట్టి పిల్లలను కూడా తీసుకుని ఫ్యామిలీస్ ఈ సమ్మర్ లో ఓ సాయింత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications











