twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bro Daddy movie review.. ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా.. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ అదుర్స్

    |

    Rating: 3/5

    కరోనావైరస్ పరిస్థితుల్లోను విభిన్నమైన చిత్రాలతో మలయాళ సినీ పరిశ్రమ ఆకట్టుకొంటున్నది. ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఓటీటీని పూర్తిస్థాయిలో ఉపయోగించకొంటూ ఫీల్‌గుడ్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నది. సూపర్ స్టార్స్ కూడా తమ సినిమాలను ఓటీటీ ద్వారా అభిమానులకు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కల్యాణి ప్రియదర్శన్ కలిసి నటించిన బ్రో డాడీ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయంలోకి వెళితే..

    బ్రో డాడీ సినిమా కథ

    బ్రో డాడీ సినిమా కథ

    జాన్ కట్టాడి (మోహన్ లాల్), అన్నమ్మ (మీనా) దంపతుల కుమారుడు ఈషో కట్టాడి (పృథ్వీరాజ్ సుకుమారన్). ఈషో బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు. జాన్ స్నేహితుడు కురియన్ (లాలు అలెక్స్) కుమార్తె అన్నా ( కల్యాణి ప్రియదర్శన్)‌ కూడా బెంగళూరులోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటుంది. ఈషో, అన్నా బాల్య స్నేహితులు. అయితే వారిద్దరు ఇంట్లో చెప్పకుండా బెంగళూరులో సహజీవనం చేస్తుంటారు. ఆ క్రమంలో అన్నా గర్బవతి అవుతుంది. ఇదే సమయంలో ఈషో తల్లి (మీనా) కూడా గర్భవతి అవుతుంది.

    బ్రో డాడీ మూవీలో ట్విస్టులు

    బ్రో డాడీ మూవీలో ట్విస్టులు

    లేటు వయసులో అన్నమ్మ గర్బవతి కావడంతో జాన్ పరిస్థితి ఏమిటి? వయసులో ఉన్న కొడుకుకు తాను తండ్రి కాబోతున్నానని చెప్పాల్సి రావడంతో జాన్ ఎలా స్పందించాడు? తన తండ్రి కూడా తండ్రి కాబోతున్నాడనే విషయం తెలుసుకొన్న ఈషో పరిస్థితి ఏమిటి? అలాగే పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్నాననే విషయం ఈషో ఏ పరిస్థితుల్లో చెప్పాడు? తనతోపాటు తన కుమారుడు కూడా తండ్రి కాబోతున్నాడనే విషయం తెలిసిన తర్వాత రియాక్షన్ ఏమిటి? పెళ్లికాకుండానే తన కూతురు తల్లి కాబోతుందనే విషయాన్ని కురియన్ ఫ్యామిలీ ఎలా తీసుకొన్నది? తన స్నేహితుడు కుమారుడు ఈష్ చేసిన పనికి అన్నా తండ్రి ఏం చేశాడు. ఈ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన సమస్యకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే బ్రో డాడీ సినిమా కథ.

    బ్రో డాడీ ఎలా ఉందంటే?

    బ్రో డాడీ ఎలా ఉందంటే?

    బ్రో డాడీ సినిమా పక్కాగా వినోదంతోసాగే కుటుంబ కథా చిత్రం. పాపులారిటీ, సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలాంటి కథలో నటించడమే ఓ సాహసమని చెప్పాలి. లేటు వయసులో తండ్రి కావడం, అలాగే పెళ్లి కాకుండా తల్లి కావడమనే పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మెన్స్ హృదయాన్ని టచ్ చేస్తుంది.

    సున్నితమైన పాయింట్‌ను మనసును మెప్పించేలా, దానికి హాస్యాన్ని జోడించి చెప్పిన తీరు చాలా మంచిగా అనిపిస్తుంది. సినిమాలోని సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. కాస్త అడల్డ్ కంటెంట్ అనిపించే ఛాన్స్ ఉన్నప్పటికి.. దానిని డీల్ చేసిన విధానం ఫీల్‌గుడ్‌గా మారింది అని చెప్పవచ్చు.

    మోహన్ లాల్, మీనా, లాలు అలెక్స్ నటన గురించి

    మోహన్ లాల్, మీనా, లాలు అలెక్స్ నటన గురించి

    బ్రో డాడీ సినిమా కథ విషయానికి వస్తే.. లేటు వయసులో తండ్రి అయ్యానని ఓ తండ్రి చెప్పాల్సిన పరిస్థితి రావడం, అలాగే పెళ్లికాకుండానే తండ్రిని కాబోతున్నానే విషయం కొడుకు చెప్పాల్సి రావడమనే పాయింట్స్ తెర మీద ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. జాన్ పాత్రలో మోహన్ లాల్, అన్నమ్మ పాత్రలో మీనా ఒదిగిపోయారు.

    లేట్ వయసులో తండ్రిని కాబోతున్నానని తన తల్లికి చెప్పే సీన్లలో మోహన్ లాల్ నటన పీక్స్‌. చిలిపి, సరదా సన్నివేశాలు సినిమాను ఫన్నీగా మార్చేశాయి. జాన్ స్నేహితుడిగా నటించిన కురియన్ పాత్రలో లాల్ కూడా మంచి నటనను ప్రదర్శించాడు. పెళ్లికాకుండానే తల్లి కాబోతున్న అమ్మాయికి తండ్రి పడే సంఘర్షణ చాలా పరిణితితో తెరపైన పలికించాడు.

    పృథ్వీరాజ్, కల్యాణి కెమిస్ట్రీ అదుర్స్

    పృథ్వీరాజ్, కల్యాణి కెమిస్ట్రీ అదుర్స్

    ఇక ఈషోగా పృథ్వీరాజ్ సుకుమారన్, అన్నాగా కల్యాణి ప్రియదర్శన్ తమ నటనతో అదరగొట్టారు. యూత్‌పుల్ టచ్‌తో, నేటి నాగరికత పరిస్థితుల్లో జీవించే యువతి, యువకుల పాత్రలో ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. గర్బవతి అనే విషయం తెలిసిన తర్వాత కల్యాణి, పృథ్వీ పడే సంఘర్షణ యువతి యువకులను ఆలోచింపచేస్తుంది. పృథ్వీరాజ్, మోహన్ లాల్ మరోసారి తన సహజనటనతో సినిమాను మరొ లెవెల్‌కు తీసుకెళ్లారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    అలాగే సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అభినందన్ రామనుజమ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. అర్బన్, సెమీ అర్బన్ లుక్‌తో కూడిన వాతావరణాన్ని చక్కగా కెమెరాలో బంధించాడు. కథకు తగినట్టుగానే పాత్రల్లో ఉండే రిచ్‌నెస్ ప్రతీ ఫ్రేమ్‌ను ఆహ్లాదకరంగా మార్చింది. ఆర్ట్ విభాగం పనితీరు చాలా బాగుంది. ఇంటిలో మొక్కలు, గ్రీనరీ లుక్ చాలా ఆకట్టుకొంటుంది. దీపక్ దేవ్ మ్యూజిక్ సీన్లలోని ఎమోషనల్ కంటెంట్‌ను మంచిగా ఎలివేట్ చేసింది. భాష తెలియకపోయినా పాటల్లో ఓ ఫీల్ వెంటాడుతుంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు చాలా బాగుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    సినిమాలో ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా వీర లెవెల్ కంటెంట్ అవసరం లేదనే విషయం బ్రో డాడీలో కనిపిస్తుంది. సన్నితమైన అంశాలు, ఎమోషనల్‌గా సాగే రెండు పాయింట్లతో కథను ఫీల్‌గుడ్‌గా తెరకెక్కించిన విధానం హైలెట్. స్టార్ హోదాను నమ్ముకోకుండా కేవలం కథను నమ్మి మలయాళీ స్టార్లు సినిమా చేస్తారని మరోసారి బ్రో డాడీ సినిమా నిరూపించింది. మోహనల్ లాల్, మీనా, పృథ్వీరాజ్ కుమార్, కల్యాణి ప్రియదర్శన్, లాలు అలెక్స్, కనిహా తమ పాత్రలతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు. ఫ్యామిలీ అంతా చక్కగా ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. సినిమా చూసినంత సేపు హృదయంలో ఓ ఆలోచన, పెదవిపై ఓ చిరునవ్వు అలా కొనసాగుతుంటుంది. అది గ్యారంటీ..

    బ్రో డాడీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    బ్రో డాడీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీ సుకుమారన్, మీనా, కల్యాణి ప్రియదర్శన్, లాలు అలెక్స్, కనిహా, మల్లిక సుకుమారన్ తదితరులు
    దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
    రచన: శ్రీజిత్ ఎన్, బిబిన్ మలీకల్
    నిర్మాత: అంటోని పెరంబవూర్
    సినిమాటోగ్రఫి: అభినందన్ రామనుజమ్
    ఎడిటింగ్: అఖిలేష్ మోహన్
    మ్యూజిక్: దీపక్ దేవ్
    బ్యానర్: ఆశ్వీరాద్ సినిమాస్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-01-26

    English summary
    Bro Daddy movie review: Mohanlal and Prithviraj Sukumaran with Meena, Kalyani Priyadarshan, Lalu Alex, Kaniha's Bro Daddy hits the screens on 26th January. Here is the full review of this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X