Bhama Kalapam 2 Review : 1000 కోట్ల కోసం ప్రియమణి సాహసం... భామ కలాపం 2 ఎలా ఉందంటే?
Rating: 2.5/5
చిత్రం : భామాకలాపం2;
నటీనటులు : ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సుదీప్ వేద్, అనీష్ తదితరులు;
సంగీతం : ప్రశాంత్ విహారి;
సినిమాటోగ్రఫీ : దీపక్;
ఎడిటింగ్ : విప్లవ్ నైషద్;
రచన, దర్శకత్వం : అభిమన్యు;
స్ట్రీమింగ్ వేదిక : ఆహా
విడుదల తేదీ 16-02-2024
విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామా కలాపం అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ రెస్పాన్స్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రానికే కొనసాగింపుగా భామా కలాపం 2ను మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. తెలుగు ఓటీటీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. మరి ఫస్ట్ పార్ట్‌ను మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా? అనుపమగా ప్రియమణి ఈ సారి చేసిన సాహసం ఏంటి? అసలీ హెయిస్ట్ థ్రిల్లర్‌ను ఈ వీకెండ్‌లో చూడొచ్చా? అన్నది ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం..
కథేంటంటే : తొలి భాగంలో యూట్యూబ్ ఛానెల్ వేదికగా వంటలు చేసే అనుపమ (ప్రియమణి).. కోల్‌కతా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయమవడంతో తన కుటుంబంతో సహా ఇబ్బందుల్లో పడుతుంది. మర్డర్ మిస్టరీగా దీన్ని తెరకెక్కించారు. ఎలాగోలా ఆ కష్టాల నుంచి బయటపడిన అనుమప ఫ్యామిలీ ఇల్లు మారడంతో రెండో భాగం ప్రారంభమవుతుంది. అంటే తొలి భాగానికి కొనసాగింపుగా దీన్ని ప్రారంభించారు.
ఇల్లు మారేటప్పుడు ఇతరుల విషయాలను అస్సలు పట్టించుకోనని భర్తకు ప్రామిస్ చేసిన అనుపమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడబెట్టుకుని ఓ ఫుడ్ హోటల్ ప్రారంభిస్తుంది. తమ ఇంటి పనిమనిషి శిల్ప (శరణ్య)ను పార్ట్నర్గా చేసుకుని అనుపమ ఘుమఘుమ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. హ్యాపీగా లైఫ్‌ను సాగదీయాలనుకుంటూనే కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు అప్లై చేస్తుంది.

అయితే మరోవైపు ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే వ్యాపార వేత్త, స్మగ్లర్.. ఈ కుకింగ్ ఐడల్ ట్రోఫీ పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని భారీ ప్రణాళికను రచిస్తాడు. మరి అనుపమకు రూ.1000కోట్ల విలువ గల కోడి పుంజు బొమ్మ గల డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ క్రమంలో విలన్ నుంచి ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చావోరేవో తేల్చుకునే పరిస్థితి ఎదురైనప్పుడు ఆమె దాన్ని ఎలా అధిగమించింది? అసలు జుబైదా?(సీరత్ కపూర్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే ఈ హెయిస్ట్ థ్రిల్లర్‌ను చూడాల్సిందే..

ఎలా ఉందంటే : మొదటి భాగంలో గుడ్డు చుట్టూ అల్లుకున్న స్టోరీని రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను చుట్టూ తిప్పారు. హీరో లేదా హీరోయిన్ తమ ప్రమేయం లేకుండానే నేరస్థులను పోలీసులకు పట్టించడం, ఆ తర్వాత వాళ్లు బయటకు వచ్చాక హీరో లేదా హీరోయిన్‌పై పగను పెంచుకుని వారిపై దాడికి దిగడం, దాని నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఆ ప్రధాన పాత్రలు ప్రయత్నాలు చేయడం.. ఇప్పుడీ కోవకే చెందినది భామకలాపం 2. అనుపమ పాత్ర అలాంటిదే.
అయితే సమస్య వచ్చినప్పుడు డీలా పడకుండా పోరాడి గెలవాలనే స్ఫూర్తినిస్తుంది ఆమె పాత్ర. అనుపమ - శిల్పల కామెడీ, జుబేదా గ్లామర్ బాగానే ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ ల్యాగింగ్‌గా అనిపించింది. నెగటివ్ క్యారెక్టర్స్‌కు సంబంధించి సన్నివేశాలన్ని ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రేక్షకుడికి ప్రీక్లైమాక్స్‌లో ఊహించలేని ట్విస్ట్ ఎదురవుతుంది. ఇక భామాకలాపం 3 కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో మరో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే మూడో భాగం విదేశాల్లో ఉంటుందని అర్థమైంది.

ఎవరెలా చేశారంటే : అనుపమ పాత్ర ప్రియమణి కోసమే రాసిపెట్టారని అనిపిస్తుంది. వన్ విమెన్ షో అనిపించింది ఆమె. శరణ్య తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులూ. హీరోయిన్ కావాలనే ఆశతో ఉన్న అమ్మాయిగా సీరత్ కపూర్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్, సదానందం తమ పాత్రలతో బాగానే ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. సాంకేతికంగా పరంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ప్రశాంత్ ఆర్.విహారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధ ఎడిటింగ్ అని మంచిగా ఉన్నాయి.
చివరిగా కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే ఈ సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే భామాకలాపం-2 మంచి ఛాయిస్. మొదటి భాగంలో గుడ్డుతో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఈసారి కోడిపుంజుతోనూ విజయం సాధించారు.


Click it and Unblock the Notifications











