Love Again Review లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా.. భర్తతో రొమాన్స్ సీన్లలో హాట్‌గా.. లవ్ అగైన్ స
Rating: 2.5/5
నటీనటులు: ప్రియాంక చోప్రా జోనస్, సామ్ హ్యూగన్, నిక్ జోనస్, సెలీన్ డియాన్ తదితరులు
రచన, దర్శకత్వం: జేమ్స్ సీ స్ట్రౌస్
నిర్మాత: బాసిల్ ఇవానిక్
సినిమాటోగ్రఫి: అండ్రూ డన్
ఎడిటింగ్: జెస్సే గార్డన్
మ్యూజిక్: కీగన్ డీవిట్
బ్యానర్: స్క్రీన్ జెమ్స్, 2.0 ఎంటర్‌టైన్‌మెంట్, థండర్ రోడ్ ఫిలిమ్స్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
చిన్న పిల్లల పుస్తకాలకు కార్టూన్, కేరికేచర్స్ వేసే ఆర్టిస్టుగా మీరా రే (ప్రియాంక చోప్రా) పనిచేస్తుంటుంది. జాన్ (అరింజే కెనే)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటుంది. అయితే తన కళ్లముందే జాన్ చనిపోవడంతో అతడితో జీవితం పంచుకోవాలన్న ఆశలకు గండి పడుతుంది. జాన్ మరిచిపోలేని పరిస్థితిలో అతడి ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపిస్తూ తనలోని భావాలను వ్యక్త పరుచుకొంటుంది. అయితే జాన్ ఫోన్ నంబర్ రాబ్ (సామ్ హ్యుగన్)కు ఎలాట్ అవుతుంది. జాన్ కోసం మీరా పంపే మెసేజేస్ రాబ్‌కు చేరుతుంటాయి.

మీరా రే ప్రియుడు జాన్ ఎలా చనిపోయాడు? జాన్ చనిపోయాడని తెలిసి కూడా మీరా తన ఫోన్‌కు మెసేజ్‌లు ఎందుకు పంపాలని అనుకొన్నది? జాన్ ఫోన్ ఉపయోగిస్తున్న రాబ్.. మీరా పంపే మేసేజ్‌కు ఎలా స్పందించాడు? మీరా, రాబ్ మధ్య చోటు చేసుకొన్న పరిచయం ఎలాంటి బంధానికి దారి తీసింది? మీరాకు జోయల్ (నిక్ జోనస్)కు మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు మీరా, రాబ్ రిలేషన్‌షిప్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ అగైన్ సినిమా కథ.
బాయ్‌ఫ్రెండ్‌ను మీరా యాక్సిడెంట్‌లో కోల్పోవడం అనే ఎమోషనల్ టచ్‌తో లవ్ అగైన్ మూవీ మొదలవుతుంది. తన సోదరి మీరాను విషాదం నుంచి బయటపడేందుకు సుజీ ఇచ్చే సలహాలతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి జోయల్ (నిక్ జోనస్)తో అఫైర్ కృత్రిమంగా ఉండటంతో మధ్యలోనే ఆ వ్యవహారం ఆగిపోతుంది. విషాదం నుంచి తేరుకొని తన మనసులోని భావాలను జాన్‌కు చెప్పుకొనే ప్రయత్నంలో రాబ్ పరిచయం కావడం కథలో చిన్న ట్విస్టు ఏర్పడుతుంది. దాంతో వారిద్దరి మధ్య లవ్ ట్రావెల్ పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా కనిపించదు. భావోద్వేగమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల సినిమా చాలా స్లోగా, సాగదీసినట్టు అనిపిస్తుంది. కథలో ఎమోషన్స్ పండకపోవడం వల్ల సాదాసీదా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక ప్రియాంక చోప్రా మీరా పాత్రలో ఒదిగిపోయింది. జాన్, జోయల్, రాబ్‌తో శృంగారపరమైన సన్నివేశాల్లో జీవించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి నటించిన కారు సీన్‌లో శృంగారం శృతిమించిందా? అనేలా ఉంటుంది. అలాగే రాబ్‌తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకొన్నది. ఇక సినిమాలో లేక్కలేనన్నీ ముద్దులతో అదరగొట్టింది. యదేచ్చగా లిప్‌లాక్స్‌తో ప్రియాంక చెలరేగిపోయింది. నిక్ జోనస్ కాసేపు రొమాంటిక్ సీన్లలో మెరిసినట్టు అనిపిస్తాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పెద్దగా టెక్నికల్ అంశాలకు చోటు లేకపోవడం వల్ల గొప్పగా ఏవీ అనిపించవు. ఉన్నంతలో అండ్రూ డన్ అందించిన సినిమాటోగ్రఫి, కీగన్ అందించి మ్యూజిక్ కొంత బెటర్‌గా అనిపిస్తాయి. కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఈ సినిమాను ఎస్మెమ్మెస్ ఫర్ డిక్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కంటెంట్ పరంగా రిచ్‌గా ప్లాన్ చేసి ఉంటే మంచి లవ్, రొమాంటిక్ సినిమా అయి ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది.

లవ్ అగైన్ సినిమా విషయానికి వస్తే..లవ్, ఎమోషన్స్, పెయిన్, రొమాన్స్ లాంటి అంశాలతో రూపొందించారు. ఆకట్టుకొనే, అలరించే సన్నివేశాలు లేకపోవడం, స్క్రీన్ ప్లే నత్త నడకగా సాగడం, అలాగే కథలో ట్విస్టులు లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల రిలీజ్ అవుతున్నది. రొమాంటిక్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది. తీరిక వేళ్లలో తగినంత మూడ్ సెట్ చేసుకొంటే.. లవ్ అగైన్ నచ్చవచ్చేమో.


Click it and Unblock the Notifications











