For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyuralu movie review: సహజీవనం, అక్రమ సంబంధాలు నేపథ్యంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరి

  |

  Rating: 2.5/5

  సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్‌‌కు తెలుగు సినిమా పరిశ్రమ దూరమవుతుందనే వాదనకు బలం చేకూరేలా ఇటీవల సినిమాలు ఓటీటీలో హల్‌చల్ చేస్తున్నాయి. అడల్డ్ కంటెంట్, సహజీవనం, పెళ్లికి ముందే సెక్స్ లాంటి కథలు ఓటీటీ సినిమాలుగా వస్తున్నాయి. ఇలాంటి తరహాలోనే వచ్చిన చిత్రం ప్రియురాలు. శ్రీ దివ్యతో సాగరతీరంలో సిరిమల్లె పువ్వు, నిహారిక కొణిదెల, నాగశౌర్యతో ఒక మనసు చిత్రాలను అందించించిన రామరాజు స్వయంగా ప్రియురాలు మూవీకి నిర్మాతగా మారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

  ప్రియురాలు మూవీ కథ

  ప్రియురాలు మూవీ కథ

  జర్నలిస్టుగా మాధవ్ (పృథ్వీ) ఓ ప్రముఖ టెలివిజన్‌ ఛానెల్‌లో ప్రొగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తుంటాడు. చిన్నతనంలో తల్లి మరణంతో ఒంటరిగా పెరిగి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్న దివ్య (మౌనిక)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ఓ హద్దును దాటేసి సహజీవనంగా మారుతుంది. మాధవ్, దివ్య ఉండే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే వివాహితుడు సత్యం (కౌశిక్ రెడ్డి) అక్కడే పనిచేసే పనిమనిషి సరిత (కామాక్షి)తో అక్రమ సంబంధం పెట్టుకొంటాడు. ఇలా రెండు రకాల రిలేషన్‌షిప్స్‌తో కథ సాగుతున్న సమయంలో శారీరక సంబంధం పెట్టుకొనే ముందు తనకు పెళ్లి అయిందని దివ్యకు మాధవ్ చెప్పి ట్విస్టు ఇస్తాడు.

  ప్రియురాలు మూవీలో మలుపులు

  ప్రియురాలు మూవీలో మలుపులు

  పెళ్లైన మాధవ్‌ ఎలాంటి పరిస్థితుల్లో దివ్యతో సహజీవనం చేయాల్సి వచ్చింది? తన భార్యకు మాధవ్ ఎందుకు దూరంగా ఉన్నాడు? మాధవ్‌ వివాహితుడనే విషయం తెలుసుకొన్న దివ్య రియాక్షన్ ఏమిటి? అప్పటికే పెళ్లి జరిగిన ఓ కూతురు ఉన్న సత్యం పనిమనిషి సరితతో ఎందుకు సంబంధం పెట్టుకొన్నాడు? ఇలాంటి అక్రమ బంధాలు సత్యం జీవితంలో ఎలాంటి విషాదాన్ని చూపింది? మాధవ్‌, దివ్య మధ్య బంధానికి ఎలాంటి ముగింపు దొరికింది అనే ప్రశ్నలకు సమాధానం ప్రియురాలు సినిమా కథ.

  ప్రియురాలు ఎలా సాగిందంటే..

  ప్రియురాలు ఎలా సాగిందంటే..

  అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు దివ్య అనుకోకుండా మాధవ్ ఫ్లాట్ పొరపాటున తట్టడంతో రొమాంటిక్‌గా కథ మొదలవుతుంది. ఆ తర్వాత వారిద్దరి పరిచయం మరో లెవెల్‌కు వెళ్లి శారీరకంగా ఒక్కటవుతారు. తొలి భాగమంతా మాధవ్, దివ్య శృంగార లీలతోనే గడిచిపోతుంది. సున్నితమైన శృంగారంతో దర్శకుడు రామరాజు గిలిగింతలు పెట్టేందుకు ప్రయత్ని సఫలమయ్యాడు. ఇలా శృంగారంలో మునిగి తేలుతున్న దివ్యకు పెళ్లి జరిగిందని షాకింగ్ విషయం చెప్పడంతో తొలి భాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌లో సాగదీతతో..

  సెకండాఫ్‌లో సాగదీతతో..

  ఇక సెకండాఫ్‌లో కూడా ఓ పక్క మాధవ్, దివ్యల శృంగారం, మరోపక్క సత్యం, సరిత అక్రమ సంబంధం లీలలు తెరపైన కొనసాగడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంతసేపు ఇదేనా అనే ఓ జుగప్సకరమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. సినిమా చివరి 30 నిమిషాల వరకు శృంగార లీలలతో హోర్తెత్తించడం సహనానికి పరీక్షగా మారుతుంది. కాకపోతే చివరి 30 నిమిషాల్లో ఓ ఎమోషనల్ సంఘటన సినిమా స్వరూపాన్ని మార్చేస్తుంది. ఐదేళ్ల సత్యం కూతురును మెయిన్ పాయింట్‌గా చేసి ప్రేక్షకుడిని ఓ కొత్త అనుభూతికి, ఆలోచనకు గురిచేస్తాడు. దాంతో అప్పటి వరకు బూతు చిత్రం చూస్తున్నామనే ఫీలింగ్ ఏర్పడిన వారికి ఇది ఫ్యామిలీ చిత్రమనే భావన కలుగుతుంది.

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గురించి

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గురించి

  నటీనటుల ఫెర్మార్మెన్స్ విషయానికి వస్తే.. అంతా కొత్త యాక్టర్లే కనిపిస్తారు. ఏ ఒక్కరు కూడా నటనకు కొత్త అనే ఫీలింగ్ కల్పించకుండా నటించారు. ముఖ్యంగా మాధవ్‌గా పృథ్వీ, దివ్యగా మౌనిక మధ్య కెమిస్ట్రీ తెర మీద బాగా వర్కవుట్ అయింది. అలాగే సత్యంగా కౌశిక్, సరితగా కామాక్షి నాటు సరసంతో ఆకట్టుకొన్నారు. టెలివిజన్‌ ఛానెల్ హెడ్‌గా జోగి బ్రదర్స్ కృష్ణంరాజు మీడియాలో నేటి పోకడలను కళ్లకు కట్టినట్టు తన పాత్ర ద్వారా చెప్పారు. ఇక కారు డ్రైవర్‌గా జోగి బ్రదర్స్ జోగినాయుడు సత్యం అక్రమ సంబంధానికి సంబంధించి ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

   సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  ఇక టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. ఒకట్రెండు పాటలు బాగున్నాయి. అవుట్ డోర్ పార్ట్ పెద్దగా లేకపోవడంతో తెరకెక్కించే పని మహి పీ రెడ్డికి సులభమైంది. అయితే కొత్తవాడైనా పక్కా ప్రొఫెషనల్‌గా సినిమాను ఫీల్ గుడ్ ఫ్రేమ్స్‌లో బంధించాడు. ఎడిటర్ సాయి రేవంత్ ఇంకా చాలానే పని ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చాలా చిరాకుగా కథ గమనానికి అడ్డుపడేలా ఉన్నాయి. నేటి సమాజంలో చోటుచేసుకొంటున్న పరిస్థితులను శ్రీ సౌమ్య కథగా అందించారు. గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు‌తో కలిసి రామరాజు, అజయ్ కర్లపూడి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  ప్రియురాలు తుది తీర్పు

  ప్రియురాలు తుది తీర్పు

  వివాహితులైన ఇద్దరు యువకులు.. వివాహం కాని ఇద్దరు యువతులతో పెట్టుకొన్న అక్రమ సంబంధాలు నేపథ్యంగా ప్రియురాలు సినిమా రూపొందింది. ఇలాంటి అక్రమ సంబంధాల మధ్య తల్లి ప్రేమ, కుటుంబ విలువలు అనే అంశాలను బ్యాక్ డ్రాప్‌గా కథను దర్శకుడు రామరాజు నడిపించిన తీరు అభినందనీయం. కానీ మితిమీరిన శృంగారం సినిమా కథకు సంబంధించిన ఆత్మను దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. చివరకు పెళ్లికి ముందే సహజీవనం, అక్రమ సంబంధాల వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే విషయాలను సందేశంగా చెప్పడం ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. ఈ చిత్రం సోని లివ్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. పిల్లలకు దూరంగా పెద్దలు మాత్రమే చూడాల్సిన చిత్రం. జాగ్రత్తగా ఈ సినిమా చూడాలనేది రిక్వెస్ట్. ఇది పకా ఓటీటీ కంటెంట్ చిత్రమని చెప్పవచ్చు.

  Recommended Video

  Upcoming Romantic Thriller 'PEMPAK' Release Date Postponed
  ప్రియురాలు నటీనటులు, సాంకేతిక నిపుణులు

  ప్రియురాలు నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల, శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు తదితరులు
  దర్శకత్వం: రామరాజు
  నిర్మాతలు: రామరాజు, అజయ్ కర్లపూడి
  సహ నిర్మాతలు: గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు
  సినిమాటోగ్రాఫర్: మహి పీ రెడ్డి
  సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశ్రీ
  సంగీతం: సునీల్ కశ్యప్
  ఎడిటర్: సాయి రేవంత్
  కథ: శ్రీ సౌమ్య
  ఓటీటీ రిలీజ్: సోని లివ్
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-09-17

  English summary
  Priyuralu movie is a love and romantic movie. Prithivi, Mounika, Kaushik Reddy, Kamakshi are in lead role. This movie hits the screen on the OTT Sony Liv on September 17, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X