Psych Siddhartha Movie Review: సైక్ సిద్దార్థ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, సుఖేష్ రెడ్డి, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, నర్సింహా తదితరులు
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
స్క్రీన్ ప్లే: వరుణ్ రెడ్డి, శ్రీ నందు
నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి
మ్యూజిక్: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫి: కే ప్రకాశ్ రెడ్డి
క్యాస్టూమ్ డిజైనర్: ప్రియాంక రెబెకా శ్రీనివాస్
ఎడిటర్: ప్రతీక్ నూతి
బ్యానర్: స్పిరిట్ మీడియా, నందూనెస్, కీప్ రోలింగ్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-01-01
సిద్దార్థ్ (శ్రీ నందు) బిజినెస్‌లో రాణించాలనే కోరికతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పెట్టడానికి మన్సూర్ (సుఖేష్ రెడ్డి)తో చేతులు కలుపుతాడు. కానీ మన్సూర్ చేసిన మోసం వల్ల 2 కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డు మీద పడుతాడు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా నందూ లవర్ త్రిష (ప్రియాంక రెబెకా శ్రీనివాస్)ను కూడా దూరం చేసి మోసం చేస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మురికి వాడలో నివసిస్తుంటాడు. అక్కడే పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రావ్య (యామిని భాస్కర్)కు నందూ దగ్గరవుతాడు.

సిద్దార్థ్‌ను మన్సూర్ ఎలా మోసం చేశాడు? సిద్దార్థ్ లవర్ త్రిషను మన్సూర్ తన ప్రియురాలిగా ఎలా మార్చుకొన్నాడు? మన్సూర్ చేసిన మోసంతో సిద్దార్థ్ ఎలాంటి కష్టాలు అనుభవించాడు? మురికి వాడలో పరిచయమైన శ్రావ్య గతం ఏమిటి? తన కుమారుడితో కలిసి శ్రావ్య ఎందుకు ఒంటరిగా జీవిస్తున్నది? శ్రావ్యకు సిద్దార్థ్ ఎలా దగ్గరయ్యాడు? శ్రావ్యతో పరిచయం సిద్దార్థ్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది? చివరకు సిద్దార్థ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే సైక్ సిద్దార్థ్ సినిమా కథ.
దర్శకుడు వరుణ్ రెడ్డి ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఆయన ఈ సినిమాను కొత్తగా, ట్రెండీగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ కథ, కథనాలపై కాకుండా స్టైలిష్ మేకింగ్ మీదే పూర్తిగా దృష్టిపెట్టడం వల్ల పాత్రల మధ్య ఎమోషన్స్ దెబ్బ తిన్నాయనిపిస్తుంది. అలాగే చిన్న పాయింట్‌తో కథను నడిపించాలనే ప్రయత్నం, కథనంలో క్లారిటీ లేకపోవడం ఈ సినిమా ఉన్న పాజిటివిటిని దెబ్బ తీశాయనే చెప్పాలి. కథలో ఎమోషనల్, ఇంటెన్స్ కంటెంట్‌కు చాలా స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించదు. దాంతో ఈ సినిమా కంటెంట్ పరంగా నాసిరకంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, టెక్నికల్‌గా వరుణ్ రెడ్డి ఈ సినిమాను రూపొందించిన విధానం చాలా బాగుంది.
సిద్దార్థ్‌గా శ్రీ నందు తన పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. యూత్, జెన్ జీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు తన బాడీలాంగ్వేజ్ తెరపైన చూపించిన విధానం, డైలాగ్ డెలివరీ, క్యారెక్టర్ యాటిట్యూడ్ బాగుంది. అయితే సిద్దార్థ్ పాత్ర ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే సత్తా లేకపోవడం వల్ల శ్రీ నందూ కూడా ఏమీ చేయలేకపోయాడనిపిస్తుంది. దాంపత్య జీవితంలో కష్టాలు అనుభవించే యువతి శ్రావ్య పాత్రలో యామిని భాస్కర్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో బాగా పెర్ఫార్మ్ చేసింది. మన్సూర్, త్రిషా పాత్రలు ఈ సినిమాకు సపోర్టింగ్‌గా ఉండటమే కాకుండా కొంత ఫన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి.
కంటెంట్ పరంగా అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ వాటిని సాంకేతిక విభాగాలు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు తమ ప్రతిభతో కప్పిపుచ్చాయి. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నప్పటికీ.. అవసరం లేకున్నా లౌడ్‌గా అరిచి గీపెట్టడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగానే అయింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే మూవీ. కానీ ఈ కంటెంట్ పరంగా చూస్తే.. షార్ట్ ఫిలింకు ఎక్కువగా.. సినిమాకు తక్కువలా అనిపిస్తుంది. పూర్తిస్థాయి కథతో, ప్రాపర్‌గా క్యారెక్టర్ల డిజైన్ చేసి ఉంటే.. యూత్ ఫుల్, రొమాంటిక్ జోనర్‌లో డెఫినెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయి ఉండేది.


Click it and Unblock the Notifications











