Public Talk on Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్‌పై పబ్లిక్ టాక్.. ఎన్టీఆర్ మాస్ అవతార్‌ ఎలా ఉందంటే?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ డ్రాగన్. వార్ 2 డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ డ్రాగన్‌ మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లో ఉండటం, టైటిల్ ఏంటో తెలియకపోవడంతో ఎన్టీఆర్‌ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారు? కథ ఏంటీ? అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని డ్రాగన్ గ్లింప్స్‌ను ప్రశాంత్ నీల్ విడుదల చేశారు. మే 19 అర్ధరాత్రి 12 గంటలకు డ్రాగన్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రాత్రి నుంచి సోషల్ మీడియాలో డ్రాగన్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ గ్లింప్స్‌పై అభిమానులు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

ధురంధర్, సలార్, కేజీఎఫ్ ఇవేవీ పనికిరావు. అన్న ఎన్టీఆర్ ఇచ్చిపడేశాడు. ఇండియా బ్రూస్‌లీ. ఇప్పటి వరకు కాలర్ ఎగరేశాం.. ఇక నుంచి షర్ట్ ఎగరేస్తాం. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమే ఎన్టీఆర్ మాస్ మొగుడు, ఇకపై ఇండియా మొత్తానికి మాస్ మొగుడు. ఎన్టీఆర్ అరాచకాన్ని చూపించారు.. అరాచకం అంటే అరాచకం... ఎన్టీఆర్‌ను ఎవరూ ఇలా చూపించలేకపోయారు. టైగర్ ఆరా చూపించారు.. ఫుల్‌గా శాటిస్‌ఫై, 4.30 నిమిషాల ట్రైలర్‌లో కనిపించేది ఒక్క నిమిషమే అయినా అస్సలు మామూలుగా లేదు స్టోరీ మాత్రం. లుక్కు పగిలిపోయింది. అసలు ఆ వీఎఫ్ఎక్స్ కానీ ఆ బాడీ గానీ టైగర్ నడుస్తున్నట్లుగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.

Public Talk on Dragon Glimpse  NTR   s Creates Sensation  Fans Call It Mass Rampage

ఎన్టీఆర్ మామూలుగా లేదు.. మాస్ అమ్మ మొగుడు. ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వచ్చింది టైగర్ కాదు డ్రాగన్. గ్లింప్స్ అయితే మామూలుగా లేదు చొక్కాలు చించుకుంటున్నాం. నాలుగేళ్ల తర్వాత ఫుల్ మీల్స్‌లా పెట్టాడు.. మాకు బిర్యానీ కాదు ప్రశాంత్ నీల్ మాకొక కొత్త అవతార్ చూపిస్తున్నాడు. 2000 కోట్లు కొట్టేయడం పక్కా. ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ అవుతుంది.. అన్ని రికార్డుల్ని డ్రాగన్ బద్ధలు కొడుతుందని అభిమానులు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ మాస్ ఆరా, డెడ్లీ లుక్, రుక్మిణీ వసంత్ బాగున్నారు. ప్రశాంత్ నీల్ గ్రాండ్ ప్రెజెంటేషన్, పవర్‌ విజువల్స్, సినిమాటోగ్రఫితో పాటు డైలాగ్స్ ఈలలు వేసేలా ఉన్నాయి. కొన్ని షాట్లు ప్రశాంత్ నీల్ గత సినిమాలను గుర్తుచేస్తాయని అభిమానులు అభిప్రాయపడ్డారు. అన్నను విమర్శించాలన్న ఆలోచన, అభిప్రాయం ఏమాత్రం లేదు. కానీ ఒక సినిమా అభిమానిగా ఆయనను మరింత అద్భుతంగా చూపించే అవకాశం ఉంటే బాగుండేది. డ్రాగన్ గ్లింప్స్ అదిరిపోయింది, బొమ్మ బ్లాక్‌బస్టర్. విలన్స్ ఆఫ్ ఆఫ్గన్ ట్రేడింగ్ కంపెనీ చూపించాడు.. కానీ విలన్స్ ఆఫ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ చూపించలేదంటే డ్రాగన్ రెండు పార్ట్స్‌గా వస్తుందా అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

డ్రాగన్ గ్లింప్స్ రోటీన్‌గా ఉంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాల పోలికలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ షాట్.. సలార్‌లో ప్రభాస్ నటించిన సీన్ మాదిరిగా ఉంది. దానికి కొంచెం మార్పులు చేసి వదిలార. అయితే ఓపీయం ట్రేడింగ్, షాట్ మేకింగ్, కాస్టింగ్ మాత్రం అదిరిపోయాయి. కేజీఎఫ్, సలార్ సమయంలో క్యారెక్టర్స్‌ని డైరెక్ట్‌గా సినిమాలో చూడటం వల్ల ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు ముందుగా రివీల్ చేయడం వల్ల కన్‌ఫ్యూజ్ కారని అభిమానులు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా అభిమానుల అంచనాలను అందుకోవడంలో డ్రాగన్ తొలి అడుగును దిగ్విజయంగా పూర్తయ్యింది. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ ఉంది కాబట్టి.. ఉన్నంతలో ప్రశాంత్ నీల్ తన మార్క్ టేకింగ్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. డ్రాగన్ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ కనిపించేది కాసేపే అయినా ఆయన ముద్ర, స్వాగ్ అభిమానుల్లో బలంగా పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more about: dragon ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X