For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aakasa Veedhullo review రాక్‌స్టార్ రొమాంటిక్, ఎమోషనల్ లవ్ జర్నీ!

  |

  నటీనటులు: గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు
  రచన, దర్శకత్వం: గౌతమ్ కృష్ణ
  నిర్మాతలు: మనోజ్ జేడీ, డాక్టర్ డీజే మణికంఠ
  సంగీతం: జూడా శాండీ
  ఎడిటర్: వంశీ కృష్ణ
  సినిమాటోగ్రఫి: విశ్వనాధ్ రెడ్డి
  ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధాకర్ వినుకొండ
  బ్యానర్: జీకే ఫిల్మ్ ఫ్యాక్టర్ీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2022-09-02

  సిద్దూ (గౌతమ్ కృష్ణ) చదువు కంటే మ్యూజిక్‌పైనే అమితమైన ఇష్టం. అయితే తండ్రి (దేవీ ప్రసాద్) ఇష్టానికి వ్యతిరేకంగా మ్యూజిక్‌లో రాణించి రాక్ స్టార్ కావాలనుకొంటాడు. ఈ క్రమంలో నిషా (పూజిత పొన్నాడ)తో లవ్ పడుతాడు. ఓ దశలో లివింగ్ రిలేషన్‌ చేద్దామని చెబితే ఆ ప్రపోజల్‌‌ను నిషా వ్యతిరేకిస్తుంది. దాంతో సిద్దూ మద్యానికి అలవాటు పడుతాడు, ఆ తర్వాత డ్రగ్ అడిక్ట్ అవుతాడు.

  తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టిన సిద్దూ ఎలాంటి కష్టాలను అనుభవించాడు. నిషా ప్రేమను గెలుచుకొన్నాడా? మద్యం, డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడ్డాడా? తన జీవిత లక్ష్యమైన మ్యూజిక్ రంగంలో రాణించాడా? రాక్ స్టార్ మారడానికి ఎలా నిర్ణయం తీసుకొన్నాడు? సిద్దూ జీవితం చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఆకాశ వీధుల్లో సినిమా కథ.

  Pujitha Ponnadas Aakasa Veedhullo movie review and rating: Gautam Krishna shines with acting and direction

  తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగమైన సంఘటనలతో ఆకాశ వీధుల్లో ఎమోషనల్‌గా సాగుతుంది. నిషాతో అఫైర్, రొమాంటిక్ సన్నివేశాలతో మూవీ యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అక్కడక్కడా ఆషికి2 సినిమా ఛాయలు కనిపిస్తాయి. కానీ ఆ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేకపోయిన.. అలాంటి ఫీల్ మాత్రం కలుగుతుంది. తండ్రి కొడుకుల మధ్య గొడవలు, గిటార్ పగలకొట్టే సీన్లు హృదయాన్ని టచ్ చేస్తాయి. ఇక నిషాతో అభిప్రాయ భేదాలు, అలాగే సిద్ధూ మానసిక సంఘర్షణ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.

  సాధారణ కుటుంబం నుంచి ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఓ యువకుడు రాక్‌స్టార్‌గా ఎలా మారాడనే విషయాన్ని చాలా ఎమోషనల్‌గా దర్శకుడు గౌతమ్ కృష్ణ తెరకెక్కించారు. కొత్త దర్శకుడైనా ఈ సినిమాను అనుభవం ఉన్న డైరెక్టర్‌గా సన్నివేశాలను తెర మీద ఫీల్‌గుడ్‌గా మలిచాడు. వాస్తవ జీవితంలో డాక్టర్‌ అయిన గౌతమ కృష్ణ నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను, సత్తాను చాటుకొన్నాడు. ఆకాశ వీధిలో మూవీని తెరకెక్కించిన విధానం సినిమాపై ఆయన అభిరుచిని తెలియజెప్పింది.

  Pujitha Ponnadas Aakasa Veedhullo movie review and rating: Gautam Krishna shines with acting and direction

  బహుముఖ ప్రతిభను చాటుకొన్న గౌతమ్ కృష్ణ సిద్దూ పాత్రలో ఒదిగిపోయాడు. తన జీవిత లక్ష్యం కోసం తండ్రిని ఎదురించిన కొడుకుగా, రొమాంటిక్ లవర్‌గా, రాక్ స్టార్‌గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకొన్నాడు. నిషాగా పూజిత పొన్నాడ మరోసారి భావోద్వేగమైన పాత్రతో ఆకట్టుకొన్నారు. గౌతమ్‌ కృష్ణతో కలిసి రొమాంటిక్ ట్రాక్‌ను ఎలివేట్ చేయడమే కాకుండా మంచి కెమిస్ట్రీని పండించింది. గౌతమ్ తండ్రిగా దేవీ ప్రసాద్, నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ తమ మార్కును చాటుకొన్నారు. బాల పరాశర్, దివయ నార్ని, ఆనంద్, సత్యం రాజేష్ తమ మార్కు నటనను ప్రదర్శించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ హర్షిత గౌర్ స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచింది.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే..జూడా శాండీ మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంది. చైతన్య ప్రసాద్, రాకేందు మౌళి రాసిన సాహిత్యం బాగుంది. సిద్ శ్రీరామ్ పాడిన అయ్యెయ్యో అనే పాట ఆకట్టుకొన్నది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫి, శశాంక్ నాగరాజ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు మనోజ్ జేడీ, డాక్టర్ డీజే మణికంఠ పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు.

  Pujitha Ponnadas Aakasa Veedhullo movie review and rating: Gautam Krishna shines with acting and direction

  ఆకాశ వీధిలో చిత్రం లవ్, రొమాంటిక్, మ్యూజిక్, ఫ్యామిలీ వ్యాల్యూస్ అంశాలతో తెరకెక్కింది. కథ, కథనాలు ఆకట్టుకోవడమే కాకుండా మంచి ఫీల్‌ను అందిస్తాయి. గౌతమ్ కృష్ణ పెర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పూజిత పొన్నాడ మరోసారి గ్లామర్‌తో ఆకట్టుకొంటుంది. కథ, కథనాల విషయంలో మరింత కేర్ తీసుకొంటే.. తెలుగులో మరో ఆషికి 2 లాంటి ఫీల్ ఉన్న చిత్రంగా మారి ఉండేది. యూత్, రొమాంటిక్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆకాశ వీధిలో నచ్చుతుంది.

  English summary
  Pujitha Ponnada's Aakasa Veedhullo movie review and rating: Gautam Krishna shines with acting and direction
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X