Puli Meka Web Series review ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ.. లావణ్య త్రిపాఠి ఎలా చేసిందంటే?

Rating: 2.75/5

నటీనటులు: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, స్పందన పల్లి, రాజా చెంబోలు, సిరి హన్మంతు, సుమన్ తదితరులు

దర్శకత్వం: కే చక్రవర్తి రెడ్డి
నిర్మాతలు: శ్రావ్య కోన, కోన వెంకట్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి: రామ్ కే మహేశన్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
ఓటీటీ రిలీజ్: జీ5
రిలీజ్ డేట్: 2023-02-24

పులి మేక కథ ఏమిటంటే?

పులి మేక కథ ఏమిటంటే?

కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) హంతకులను వేటాడే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ అధికారులను ఓ సీరియల్ కిల్లర్ దారుణంగా హత్యలు చేస్తూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సవాల్ విసురుతాడు. అలాంటి సంచలన కేసును డీల్ చేయమని కిరణ్ ప్రభకు డీజీపీ (సుమన్) కేసు అప్పగిస్తాడు. దాంతో సీరియల్ కిల్లర్ ఎవరు అనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫొరెన్సిక్ నిపుణుడు ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్)తోపాటు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకొంటుంది. అయితే ఆ సీరియల్ కిల్లర్ ఎవరనేది చివరు ప్రభాకర్ శర్మ గుర్తిస్తాడు.

పులి మేక కథలో ట్విస్టులు

పులి మేక కథలో ట్విస్టులు

పోలీస్ ఆఫీసర్లను వరుసగా చంపే కిల్లర్ ఎవరు? పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సీరియల్ కిల్లర్ ఎందుకు టార్గెట్ చేశాడు? మర్డర్ మిస్టరీలో పల్లవి (సిరి హన్మంతు), కరుణాకర్ శర్మ (రాజా చెంబోలు) ఎవరు? సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనేందుకు ప్రయత్నించిన కిరణ్‌కు డీజీపీ ఎలాంటి సహకారం అందించారు. నిందితుడు ఎవరో తెలిసిన ప్రభాకర్ శర్మ ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని అనుకొంటాడు? చివరకు నిందితుడు ఎవరో అనే విషయం తెలిసిందా? నిందితుడికి ఎలాంటి శిక్ష పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే పులిమేక వెబ్ సిరీస్ కథ.

పులి మేక ఎలా సాగిందంటే?

పులి మేక ఎలా సాగిందంటే?

వరుస హత్యలు సంచలనం రేపుతున్న నేపథ్యంలో లావణ్య త్రిపాఠి సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనేందుకు సిద్దం కావడంతో పులిమేక కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ముసుగు వేసుకొని హత్యలు చేస్తున్న వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రభాకర్ శర్మ చేసే ప్రయత్నాలు ప్రతీ ఎపిసోడ్‌పై క్యూరియాసిటి పెంచుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే రాజకీయాలు..ఎత్తులుపై ఎత్తులు లాంటి విషయాలను సహజంగా తెరపైన చూపించారు.

సిరి హన్మంతు పల్లవి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక రకాల ట్విస్టులతో కథ సాగుతుంటుంది. సగం ఎపిసోడ్స్ ముగిసిన తర్వాత నిందితుడెవరో తెలిసినా.. చివరి వరకు ఆ విషయాన్ని గుట్టుగా పెట్టి కథను అనేక మలుపులతో ముందుకు తీసుకెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు.

దర్శకుడు ఎలా డీల్ చేశారంటే?

దర్శకుడు ఎలా డీల్ చేశారంటే?

పోలీస్ డిపార్ట్‌మెంట్ కోణంలో సాగే మర్డర్ మిస్టరీకి కావాల్సిన అంశాలను ఎంచుకోవడంలో దర్శకుడు చక్రవర్తి రెడ్డి అనుసరించిన విధానం బాగానే ఉంది. కానీ మధ్య మధ్యలో కథ, కథనాలపై పట్టు సడలినట్టు,, కథను ముందుకు తీసుకెళ్లడంలో తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్‌లో కథను సాగదీసినట్టు అనిపించినా.. ట్విస్టులతో గ్రిప్పింగ్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాల విషయంలో కోన వెంకట్ మార్కు స్టయిల్ కనిపిస్తుంది.

లావణ్య త్రిపాఠి ఫుల్ లెంగ్త్‌తో

లావణ్య త్రిపాఠి ఫుల్ లెంగ్త్‌తో

ఇక నటీనటులు విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠికి దక్కిన మంచి పాత్ర అని చెప్పవచ్చు. కిరణ్ ప్రభగా ఫెర్ఫార్మెన్స్ ఫుల్ స్కోర్ సాధించే పాత్రలో నటించడమే కాకుండా కథను తన భుజాలపై ఉంచి ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. చాలా రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో లావణ్య ఒదిగిపోయింది. ఎమోషనల్, యాక్షన్ సీన్లలో లావణ్య ఫెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొనేలా ఉంది. ఆదిసాయికుమార్‌తో సెన్సిబుల్ లవ్ ట్రాక్‌లో కెమిస్ట్రీని పండించింది.

ఆది సాయికుమార్, ఇతర నటీనటుల గురించి

ఆది సాయికుమార్, ఇతర నటీనటుల గురించి

ప్రభాకర్ శర్మగా ఆదిసాయికుమార్‌ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. కథను నడిపించే ప్రధాన పాత్రలో ఆదిసాయికుమార్ ఒదిగిపోయాడు. చివరి ఎపిసోడ్స్‌లో ఆది క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం, దానికి తగినట్టు నటన బాగుంది. సిరి హన్మంతు, రాజా, సుమన్, స్పందన క్యారెక్టర్లు కథకు బలంగా మారాయి. ఆ పాత్రల గురించి ఎక్కువ చెబితే.. స్టోరీలో ఉండే ట్విస్టులకు మజా ఉండదు. వీరందరూ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారని చెప్పవచ్చు.

పులి మేక సాంకేతిక విభాగాల గురించి

పులి మేక సాంకేతిక విభాగాల గురించి

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ప్రవీణ్ లక్కరాజు అందించిన బీజీఎం బాగుంది. కథ, సన్నివేశాల మూడ్‌ను తన బీజీఎంతో ప్రవీణ్ ఎలివేట్ చేశాడని చెప్పవచ్చు. డిఫరెంట్ లేయర్స్ ఉన్న పులిమేక కథకు తగినట్టుగా రామ్ మహేశన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాలెట్ ఉపయోగించిన విధానం వల్ల సీన్లు చాలా ఫ్రెష్‌గా కనిపించాయి. ఎడిటర్ చోటా కే ప్రసాద్ కట్ ఎపిసోడ్స్ పరుగులు పెట్టేలా చేసింది. శ్రావ్య, వెంకట్ కోన అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

పులి మేక ఫైనల్‌గా ఎలా ఉందంటే?

పులి మేక ఫైనల్‌గా ఎలా ఉందంటే?

సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్, మర్డర మిస్టరీని చేధించే అంశాలను డీల్ చేయడం ఎవరికైనా పెద్ద సవాల్. అలాంటి సవాల్‌ను ఎమోషనల్ అంశాలు, గ్రిప్పింగ్‌గా సీన్లను జోడించి చేసిన వెబ్ సిరీస్ పులి మేక. వెబ్ సిరీస్‌ను రెండు భాగాలు విడదీస్తే.. రెండో భాగంలో ట్విస్టులను రివీల్ చేస్తూ వెళ్లిన విధానం కథ, కథనాలకు బలంగా మారింది.

రాజా, సుమన్, సిరి హన్మంతు క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. లావణ్య త్రిపాఠి వన్ ఉమెన్ షో ఫెర్ఫార్మెన్స్ వెబ్ సిరీస్‌ను చూడాలనిపించేలా చేస్తుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నది. కాబట్టి.. వీలైనంత సమయాన్ని ఒకే స్ట్రెచ్‌లో చూస్తే మంచి మజా లభిస్తుంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఆదరించే వారికి పులి మేక నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X