Puneeth Rajkumar's James Movie Review హై ఇంటెన్స్ మాస్, యాక్షన్ థ్రిల్లర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం తీవ్ర విషాదంలోకి నెట్టింది. పునీత్ రాజ్ కుమార్ మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్ మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన నటుడి చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యిందనే వార్త అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిలీజైన ఈ చిత్రం అభిమానులు, సగటు ప్రేక్షకులను ఎలాంటి అనుభూతికి గురిచేసే అంశాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొందాం..

జేమ్స్ సినిమా కథ ఏమిటంటే?

జేమ్స్ సినిమా కథ ఏమిటంటే?

సంతోష్ కుమార్ అలియాస్ జేమ్స్ (పునీత్ రాజ్‌కుమార్) దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని సైనికుడు. అయితే దేశంలో డ్రగ్స్ కార్యకలాపాలను నిర్వహించే మాఫియా డాన్స్ జోసెఫ్ ఆంటోని (శరత్ కుమార్), విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్), కుప్పుస్వామి నాయుడు (ముఖేష్ రుషి), ఆదిత్య మీనన్‌ను సంతోష్ కుమార్ వెంటాడుతుంటాడు. తనను ప్రేమించే నిషా గైక్వాడ్ (ప్రియా ఆనంద్), ఆమె సోదరుడు విజయ్ గైక్వాడ్‌ను కిడ్నాప్ చేసి తాను జేమ్స్ అంటూ అసలు విషయాన్ని బయటపెడుతాడు.

జేమ్స్ మూవీలో ట్విస్టులు

జేమ్స్ మూవీలో ట్విస్టులు

మిలటరీలో మేజర్‌గా విధులు నిర్వహించే సంతోష్ కుమార్ ఎందుకు జేమ్స్‌గా మారాడు? డ్రగ్స్ మాఫియాలో కీలక సభ్యుడైన విజయ్ గైక్వాడ్ చెల్లెలు నిషాకు సంతోష్ కుమార్‌కు మధ్య రిలేషన్‌షిప్ ఎలా కుదిరింది? సైనికుడిగా ఉండే సంతోష్ కుమార్.. డ్రగ్స్ మాఫియాపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు? మాఫియా డాన్స్‌ను వ్యతిరేకించే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే జేమ్స్ సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

మాఫియా డాన్‌కు ముప్పు ఉందనే కారణంగా సంతోష్ కుమార్ అతడికి సెక్యూరిటీగా బాధ్యతలు చేపడుతాడు. డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలను కొనసాగించే ముఠాను ఏరిపారేస్తుంటాడు. ఫస్టాఫ్ పూర్తిగా ఊరమాస్ యాక్షన్ సీన్లతో కథ మంచి రసపట్టుతో సాగుతుంది. విజయ్ గైక్వాడ్ పక్కనే ఉంటూ తాను జేమ్స్ అంటూ అతడికి షాకివ్వడం ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఓ ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగిస్తాడు.

ఎమోషనల్ అంశాలతో సెకండాఫ్

ఎమోషనల్ అంశాలతో సెకండాఫ్

జేమ్స్ సినిమా సెకండాఫ్‌ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే భావోద్వేగమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కుదిపివేయడంతోపాటు ఓ ఫీల్‌గుడ్ అంశాలతో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అప్పటి వరకు యాక్షన్ సినిమాగా అనిపించిన జేమ్స్ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో ఎమోషనల్ డ్రామాగా మారిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో పునీత్ రాజ్ కుమార్ నటన అమోఘంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడి గుండెను పిండేస్తుంది. చివర్లలో రొటిన్ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా ముగుస్తుంది.

దర్శకుడు చేతన్ కుమార్ ప్రతిభ

దర్శకుడు చేతన్ కుమార్ ప్రతిభ

దర్శకుడు చేతన్ కుమార్ రాసుకొన్న పాయింట్ హై ఎమోషనల్‌గా ఉంటుంది. అనాధలైన ఐదుగురు స్నేహితులకు సంబంధించిన కథకు ఆర్మీ బ్యాక్ డ్రాప్‌ను జత చేసి మరింత ఇంటెన్స్‌గా మార్చాడు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను డిజైన్ చేసిన విధానం మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ అందిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఓవరాల్‌గా వెండితెర మీద పునీత్ రాజ్‌కుమార్‌ వన్ మ్యాన్ షోను దర్శకుడు నడిపించిన తీరు అందర్ని ఆకట్టుకొంటుంది.

పునీత్ రాజ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్

పునీత్ రాజ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్

పునీత్ రాజ్ కుమార్ నటన, ఫైట్స్, డ్యాన్సుల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్, భావోద్వేగమైన చిత్రాలతో అభిమానులు హృదయంలో గూడు కట్టుకొన్నారు. జేమ్స్ సినిమా విషయానికి వస్తే.. అభిమానులను ఆలరించే పాత్రలో నటించారు. మూడు రకాల వేరియేషన్ ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. ఫైట్స్, డ్యాన్సులు, ఎమోషన్స్‌ను పూర్తిస్థాయిలో పలికించారు. చిరకాలం ఎన్నో అనుభూతులను పంచే పాత్రతో తన సినీ జీవితాన్ని పునీత్ ముగించారని చెప్పవచ్చు.

శివరాజ్ కుమార్, ఇతర నటీనటుల గురించి

శివరాజ్ కుమార్, ఇతర నటీనటుల గురించి

సంతోష్ కుమార్ (పునీత్ రాజ్‌కుమార్) గాడ్ ఫాదర్‌గా శివరాజ్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. శివరాజ్ కుమార్ పాత్ర అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. కథకు కీలకంగా మారిన అతిథి పాత్రలో శివరాజ్ కుమార్ మెరిసారు.
మాఫియా డాన్లుగా శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్య మీనన్, ముఖేష్ రుషి నటించారు. పునీత్ ప్రియురాలు నిషాగా ప్రియా ఆనంద్ నటించింది. అయితే ఈ పాత్రలన్నీ కథ పరిధికి తగినట్టే ఉన్నాయి. ప్రధానంగా పునీత్ రాజ్ కుమార్‌పైనే కథ సాగడం వల్ల మిగితా క్యారెక్టర్లకు అంతగా స్క్రీన్ స్పేస్ లభించలేదని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగాల పనితీరు..

సాంకేతిక విభాగాల పనితీరు..

టెక్నికల్ అంశాలకు వస్తే.. స్వామీ జే గౌడ అందించిన సినిమాటోగ్రఫి మరో అదనపు ఆకర్షణ. ఆర్మీ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా మంచుకొండల్లో తీసిన యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను డిజైన్ చేసిన తీరును అభినందించాలి.

చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత బలంగా మారింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేలా ఉందని చెప్పవచ్చు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉందని చెప్పవచ్చు. కిషోర్ పత్తికొండ అనుసరించిన నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ఉత్తమ ప్రమాణాలతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

యాక్షన్, మానవ సంబంధాలు, భావోద్వేగమైన అంశాలతో కూడిన చిత్రంగా జేమ్స్ రూపొందింది. డ్రగ్స్ మాఫియాపై పోరాటం సాగించే ఆర్మీ మేజర్‌గా పునీత్ రాజ్ కుమార్ నటన నభుతో నభివిష్యత్ అని చెప్పవచ్చు. సినిమా భారాన్నంత తన భుజాలపై వేసుకొని వన్ మ్యాన్ ఆర్మీ అనే విధంగా పునీత్ పెర్‌ఫార్మెన్స్ ఉంటుంది. పునీత్ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా ఎమోషనల్ పరిస్థితుల్లో రిలీజ్ అయినందున్న జేమ్స్ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు. థియేటర్‌కు వెళ్లిన ప్రతీ ప్రేక్షకుడు భారమైన హృదయంతో బయటకు వస్తాడు.

Recommended Video

James Movie: Puneeth Rajkumar చివరి సినిమా Karnataka పునీత్ మయం| Appu Lives On | Filmibeat Telugu
జేమ్స్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

జేమ్స్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: పునీత్ రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, అను ప్రభాకర్, శ్రీకాంత్, ఆర్ శరత్ కుమార్, ముఖేష్ రుషి, ఆదిత్య మీనన్ తదితరులు
రచన, దర్శకత్వం: చేతన్ కుమార్
నిర్మాత: కిషోర్ పత్తికొండ
సినిమాటోగ్రఫి: స్వామి జే గౌడ
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
మ్యూజిక్: చరణ్ రాజ్
బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్
బడ్జెట్: 70 కోట్లు
రిలీజ్ డేట్: 2022-03-17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X