ముసలాడు గట్టోడే ('బుడ్డా హోగయా తేరా బాప్' రివ్యూ)
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: ఎబి కార్పోరేషన్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
నటీటనటులు: అమితాబ్ బచ్చన్, సోనూ సూద్, సోనాల్ చౌహాన్, ఛార్మి, హేమ మాలిని, ప్రకాష్ రాజ్ తదితరులు.
సంగీతం: విశాల్-శేఖర్
నిర్మాత: అభిషేక్ బచ్చన్
డైరక్టర్: పూరీ జగన్నాధ్
"కథ మొత్తం విన్న తర్వాత కొన్ని సందేహాలున్నాయని అమిత్‌జీ అన్నప్పుడు 'తనని నమ్మండి. బ్లాక్ బస్టర్ ఇస్తాడు" అని ఆర్జీవీ(రామ్‌గోపాల్‌వర్మ) నమ్మకంగా చెప్పారు.ఆర్జీవీ మీద నమ్మకంతో మరో మాట మాట్లాడకుండా అమిత్‌జీ బుడ్డా హోగయా తేరా బాప్ చిత్రంలో నటించారు" అంటూ పూరి జగన్నాధ్ తన చిత్రం ఎలా ఓకే అయ్యిందో ఎమోషనల్ గా చెప్పారు.మరి ఆర్జీవీ నమ్మకాన్ని నిలబెట్టేలా పూరీ సినిమాని తీసారా..లేక ఎప్పటిలాగే అదిరిపోయే ట్రైలర్స్ తో మాయ చేసి గట్టెక్కాద్దామనే ప్రయత్నం చేసాడా అంటే...
ముంబైకి చెందిన పాత గ్యాంగ్‌స్టర్ విజు(అమితాబ్). పోలీసు కేసుల్లో ఇరుక్కుని పారిపోయి ప్యారిస్ లో పబ్ నడుపుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ఈలోగా ఈ షార్ప్ షూటర్ కి గన్ కి పనిపట్టే ఎస్సైన్ మెంట్ వస్తుంది. ముంబైలోని మాపియా లార్డ్ (ప్రకాష్ రాజ్)తమను ఏరిపారేయటానికి కంకణం కట్టుకున్న ఎసిపి కరన్ (సోనూసూద్) ని చంపేయమని సుపారి ఇస్తాడు. అయితే ట్విస్టు ఏంటంటే కరన్ మరెవరో కాదు విజు కొడుకే.కానీ ఆ విషయం కరన్ కి తెలియదు.తన కొడుకుని మాఫియా నుంచి కాపాడుకోవటానికి నడుం బిగించి ఈ ముసలి రిటైర్ట్డ్ గ్యాంగస్టర్ ఏం చేసాడు అన్నది ఫన్నీగా,సెంటిమెంట్ తో నడిచే కధనం.
వరస ప్లాపుల పూరీ జగన్నధ్ ఇక్కడ మాయమై అక్కడ అమితాబ్ డైరక్ట్ చేస్తూ తేలి అందరికీ షాక్ ఇచ్చాడు.దాంతో అతను ప్లాపులను కంటిన్యూ చేస్తాడా లేక అక్కడ హిట్ తో కెరీర్ ప్రారంబించి సెటిల్ అవుతాడా అనే ఆలోచన పట్టుకుంది.అయితే ఈ సారి పూరీ వేసిన బాణం గురి తప్పలేదు. అమితాబ్ అభిమాలందరినీ ఆనందంలో ముంచేసాలా కథ...కాదు..కాదు కథనం తయారు చేసుకుని సౌతిండియా ట్విస్ట్ తో బాలీవుడ్ కి హిట్ ట్విస్ట్ ఇచ్చేసాడు.డబ్పైలు,ఎనభైల్లో అమితాబ్ సినిమాలు చూసి అభిమానులైన వారికి మరోసారి ఆ రోజులను గుర్తు చేసి ధియోటర్స్ ని నింపే ప్రయత్నం చేసాడు.
అయితే అమితాబ్ లోని అధ్బుతమైన నటుడుని ఎలివేట్ చేసే చిత్రం అని చెప్పము కానీ అంతకుమించిన ఇమేజ్ ని మరోసారి హైలెట్ చేసిన చిత్రం అని చెప్పవచ్చు. ఇక అమితాబ్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. అలాగే అమితాబ్ బార్యగా చేసిన హేమమాలిని, గర్లెప్రెండ్ గా చేసిన రవినాటాండన్ కూడా అమితాబ్ తో పోటీ పడ్డారు.అందరి కన్నా ఛార్మి తన మరిచినపోయిన నటనను వెలికితీసే ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకుంది. పాటలు ఇప్పటికే ప్రజాదారణ పొందాయి. ఎడిటింగ్ రెగ్యులర్ పూరీ సినిమాల్లో లాగానై చాలా క్రిస్ప్ గా ఉంది. అంతేగాక తెలుగులోనే కాక హిందీలోనూ పూరీ డైలాగులు స్పెషల్ గా కనిపించటం విశేషం. కెమరా కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫైనల్ గా దర్శకుడుగా పూరి జగన్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా సక్సెస్ ఫుల్ గా జరిగినట్లే. అలాగే తెలుగు నటులుకు,సాంకేతిక నిపుణులకు కూడా పూరీ ద్వారా బాలీవుడ్ కి బస్ వేసినట్లే.
ఇక అమితాబ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రత్యేకం కాబట్టి చూడక తప్పదు.అలాగే తెలుగులో పూరీ అభిమానులు కూడా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన సందర్భంగా ధియోటర్స్ కి ఆనందంగా వెళ్ళవచ్చు. అయితే అదేంటి హింది సినిమాకి వెళ్థే తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ కలిగిందే అనుకుంటే మాత్రం ఏం చెయ్యలేం. అలాగే పూరీని చూసి ఇంకాఎంతమంది తెలుగు దర్శకులు బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











