Purushotthamudu Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Purushothamudu Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ

Rating:
2.5/5

తారాగణం: రాజ్ తరుణ్, హాసిని, మురళీశర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్
దర్శకుడు: భీమన రామ్
నిర్మాతలు: ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్
విడుదల: 17/07/2024

కథ ఏమిటంటే?

బాగా డబ్బు, వ్యాపారాలు కలిగిన బిజినెస్ మెన్ ఆదిత్య రామ్(మురళి శర్మ) కొడుకైనటువంటి రచిత్ రామ్(రాజ్ తరుణ్) విదేశాల్లో తన చదువులు అన్నీ పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తాడు. ఈ సమయంలో తన తండ్రి ఇక తన బిజినెస్ కంపెనీ భాడేటాలు తన కొడుకు రచిత్ హ్యాండిల్ చేస్తాడని చెప్పి అనౌన్స్ చేసే ప్రయత్నంలో అప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ తో ఎంట్రీ ఇస్తుంది వారి కంపెనీలో వాటా కలిగిన షేర్ హోల్డర్ వసు(రమ్యకృష్ణ). ఆమె ఇచ్చిన ట్విస్ట్ తో ఒక వంద రోజులు రచిత్ సాధారణ యువకుడిగా లైఫ్ ని లీడ్ చేసి రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రచిత్ ఉండేందుకు ఏపీలోనే ఓ చిన్న కుగ్రామానికి వెళతాడు. అక్కడ హీరోయిన్ అమ్ములు(హాసిని సుధీర్) పరిచయం తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది. ఆ ఊరిలో ఉన్న సమస్యల కోసం రచిత్ ఏం చేస్తాడు? ఫైనల్ గా తన సామ్రాజ్యం లోకి మళ్ళీ వెళ్లగలిగాడా లేదా? తన తండ్రి కోరుకున్నట్టుగా తమ కంపెనీకి సీఈఓ అయ్యాడా లేదా అనేది సినెమాలో మిగతా కథ.

Purushotthamudu movie Review in telugu

విశ్లేషణ:

గడిచిన కొన్ని వారాలు నుంచి సినీ వార్తలు సంబంధించి రాజ్ తరుణ్ కోసమే ఎక్కువగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ కాంట్రవర్సీల నడుమ రిలీజ్ కి సైలెంట్ గా ఈ సినిమా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కంటే పంటి కింద రాయిలా అనిపించే అంశాలే కూసింత ఎక్కువ కనిపిస్తాయని చెప్పవచ్చు. మెయిన్ గా ఈ సినిమాలో కనిపించే నేపథ్యమే పెద్ద బ్లండర్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఒక అరుణాచలం నుంచి చూసినా బిచ్చగాడు, మహర్షి, శ్రీమంతుడు చాలా చాలా సినిమాల కంటెంట్ సమ్మేళనమే ఈ సినిమా కూడా అన్నట్టుగా అనిపిస్తుంది. వీటితో అర్రే ఆల్రెడీ ఇలాంటి సినిమా మనం చూసేసాం కదా అన్నట్టుగా అనిపించక మానదు. ఒక హీరో తన ఐడెంటిటీ పక్క పెట్టడం ఒక ఊరికి వెళ్లడం అక్కడ తన క్యాలిబర్ చూపించడం అబ్బో చాలా సినిమాల్లోనే ఉంటుంది. వీటితో ఈ సినిమా కూడా చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గానే అనిపిస్తుంది.

మరి ఇందులో కొంచెం అయినా మెప్పించే అంశాలు లేవా అంటే కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా రాజ్ తరుణ్ పై కొన్ని హై మూమెంట్స్ చాలా బాగా తెరకెక్కించారు. అలాగే కొన్ని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం కానీ ప్రథమార్ధంలో ఫన్ పార్ట్, బ్రహ్మానందం సీన్స్ బాగున్నాయి, చాలా వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాగే హీరో హీరోయిన్ నడుమ కొన్ని సన్నివేశాలు సహజంగాను మరికొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఇంకా సెకండాఫ్ లో హీరో పాత్రకి రైతుల నడుమ నడిచే డ్రామా ఒకింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Purushottamudu

నటీనటుల పెర్ఫామెన్స్ లు ఎలా ఉన్నాయ్?
ఈ సినిమాలో ప్రధాన తారాగణం అంతా మంచి నటన అందించారు. ముఖ్యంగా ప్రతి పాత్రకి నటీనటుల ఎంపిక అనేది పర్ఫెక్ట్ గా కుదిరింది. హీరో రాజ్ తరుణ్ గతంలో చేసిన యువ హీరో పాత్రల్లా అల్లరి హీరోగా కాకుండా ఈ సినిమాలో కొంచెం షేడ్ మార్చాడు. దీనితో తనలోని ఒక పరిపక్వత కలిగిన నటుడు కనిపిస్తాడు. మంచి డ్రెస్సింగ్, స్టయిలిష్ష్ మేకోవర్ తో రాజ్ తరుణ్ మాత్రం ఈ సినిమాలో కొత్త వెర్షన్ లో కనిపిస్తూ రిఫ్రెషింగ్ గా అనిపిస్తాడు.

ఇక హీరోయిన్ సినిమాలో అందంగా కనిపించడమే కాకుండా అందాల ఆరబోత కూడా బాగానే చేసింది పై పెచ్చు తన పాత్రని కూడా అలవోకగా చేసేసింది. ఇంకా ఇద్దరి జోడి ఆన్ స్క్రీన్ లో చూసేందుకు చక్కగా ఉంది. ఇక వీరితో పాటుగా సీనియర్ అండ్ వెర్సటైల్ నటులు రమ్యకృష్ణ, మురళి శర్మలు కనిపిస్తారు.

రిచ్ బిజినెస్ మ్యాన్ గా మురళి శర్మ తన మార్క్ సెటిల్డ్ నటనను కనబరిస్తే నెగిటివ్ షేడ్ లో ఎప్పటిలానే శివగామి రమ్య కృష్ణ అదరగొట్టారు. ఇంకా బ్రహ్మానందం తన పాత్రకి న్యాయం చేశారు. వీరితో పాటుగా ఇతర జూనియర్ ఆర్టిస్ట్ లు విలన్ రోల్ లో నటించిన నటులు కూడా బాగా చేశారు. ఇలా ఓవరాల్ గా నటీనటుల పెర్ఫామెన్స్ లకి మాత్రం ఎలాంటి వంక పెట్టనవసరం లేకుండా పర్ఫెక్ట్ గా చేసేసారు.

టెక్నికల్ గా ఎలా ఉంది?
సినిమా చిన్నదో పెద్దదో అనేది పక్కన పెడితే నిర్మాతలు మాత్రం ఖర్చుకి వెనుకాడకుండా సినిమాకి పెట్టిన ఖర్చు కొన్ని లావిష్ విజువల్స్ లో కనిపిస్తుంది. అలాగే టెక్నీషియన్స్ విషయంలో కూడా నోటెడ్ గోపి సుందర్ ని తీసుకున్నారు. తాను తన నమ్మకాన్ని ఈ సినిమాకి నిలబెట్టుకున్నాడు.

అలాగే మంచి కలర్ ఫుల్ గా విందా ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. డైలాగ్స్, కాస్ట్యూమ్స్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఇక మెయిన్ మ్యాన్ దర్శకుడు కోసం చెప్పాలంటే.. దర్శకుడు కథనాన్ని నడిపించిన విధానం కోసం మెచ్చుకోవచ్చు. సామాజిక సందేశంతో ఫ్యామిలీ వాల్యూస్‌తో రూపొందించిన తీరు ఆకట్టుకొనేలా ఉందది. ది.

ఫైనల్‌గా
పురుషులందు పుణ్య పురుషుడు వేరయా అన్నట్టుగా వచ్చిన ఈ "పురుషోత్తముడు" మాత్రం ఒక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పవచ్చు. హీరో రాజ్ తరుణ్ నుంచి నటుడుగా తనకిది కొత్త ప్రయత్నమని చెప్పాలి. కొత్త అమ్మాయైనాప్పటిపిటి హీరోయిన్ పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేసేసింది. ఈ వారం రిలీజైన సినిమాల్లో మంచి టాక్ అందుకొంటున్నది. క్లీన్, అండ్ ఫన్ మూవీ చూడాలంటే.. ఈ సినిమాను థియేటర్‌లో ఎలాంటి సందేహం లేకుండా చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X