Pushpa 2 First Half Review: పుష్ప 2 ఫస్టాఫ్ రివ్యూ.. దేవీ శ్రీ ప్రసాద్ టాప్ లేపేశాడుగా!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్‌కు ముస్తాబుతున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు అభిమానుల్లో క్రేజ్‌ను పెంచుతున్నది. ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న సమాచారం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నది. ఇప్పటికే ఉన్న అంచనాలు రెండితలు అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి సన్నివేశాల గురించి సినీ ప్రముఖులు చెబుతున్న విషయాలు ఈ మూవీ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కిస్తున్నాయి. అయితే దేవీ శ్రీ ప్రసాద్ చెప్పిన విషయాలు మరింత ఆసక్తిని పెంచాయి.

Pushpa 2 First Half Review  Music Director Devi Sri Prasad Reviews as Mind Blowing Content

పుష్ప 2 సినిమా విషయంలో అసలు తగ్గేదిలే. పుష్ప 1 రీరికార్డింగ్ బాగాలేదనే విషయం పక్కన పెడితే.. పార్ట్ విషయంలో ఎలాంటి రాజీ లేదు. నా పని గురించి నేను డబ్బా కొట్టుకోవడం ఇష్టం. సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ విషయానికి వస్తే.. ఓ టెక్నిషియన్ తన పని గురించి చెబితే ఆయనకు ఆ క్రెడిట్ చెందదు అని దేవీ శ్రీ ప్రసాద్ అన్నారు.

ఫుష్ప 2 మూవీ ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ఆ సినిమా ఫస్టాఫ్ చూసిన తర్వాత నా మతిపోయింది. సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ ఏర్పడలేదు. ఆ సినిమా కథ చెప్పినప్పుడే ఫస్టాఫ్ పూర్తయ్యే లోపే మూడుసార్లు చప్పట్లు కొట్టాం. అయితే ఆ ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు చెప్పినప్పుడు ఇది ఇంటర్వెల్ సీనా? ఇది ఇంటర్వెల్ సీనా? అనే ఉత్సాహంతో అడిగాం. కథ నేరేట్ చేసినప్పుడే ఒక సీన్‌కు మించి మరో సీన్ ఉంటుంది. ఇక విజువల్స్ చూసిన తర్వాత సుకూమార్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. నా ఫ్రెండ్ బన్నీ అద్బుతంగా చేశాడు అని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పారు.

Pushpa 2 First Half Review  Music Director Devi Sri Prasad Reviews as Mind Blowing Content

పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్‌కు సిద్దం అవుతున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను సెన్సార్ బోర్డు అధికారులు పరీశీలించారు. ఈ ట్రైలర్ సెన్సార్ రివ్యూ జరిగిన తర్వాత సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాలోని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనే విధంగా ఉన్నట్టు సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన సమాచారం.

ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వతేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఈ సినిమా ప్రీమియర్లు డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షోలు ప్రారంభం అవుతాయి. ఓవర్సీస్‌లో డిసెంబర్ 4వ తేదీన సాయంత్రమే ప్రీమియర్లు మొదలవుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X