Pushpa 2 The Rule First Review: మైండ్ బ్లోయింగ్ అంతే ..అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో!
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ నటించిన పుష్ప ది రైజ్ ( పుష్ప 1)కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తున్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తరలివచ్చిన జనమే పుష్ప పాన్ ఇండియా క్రేజ్‌కు నిదర్శనం.
లోకల్ ఎర్రచందనం సిండికేట్‌ను ఎదిరించి కొత్త లీడర్‌గా పుష్ప ఎలా అవతరించాడన్నది తొలి భాగంలో చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్‌వర్క్‌ని ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎలా విస్తరించాడు? తనకు జరిగిన అవమానానికి భన్వర్‌సింగ్ షెకావత్ ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? మంగళం శీను, కొండా రెడ్డిలు పుష్పని ఎలా దెబ్బకొట్టారు? కొత్తగా చేరిన జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌ల క్యారెక్టర్లు ఎంటీ? వీరిందరితో పుష్ప ఎలా పోరాడాడు అన్నదే పుష్ప 2 కథ.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తుంటే పార్ట్ 2లో పొలిటికల్ మసాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రావు రమేష్- జగపతిబాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తుందట. రావు రమేష్ వైపు అల్లు అర్జున్.. జగపతిబాబు వైపు ఫహద్ ఫాజిల్‌లు నిలబడి గేమ్ ఆడతారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. పుష్ప 2 మొదటి అర్ధభాగం సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని, సెకండాఫ్‌లో భార్య కోసం ఈ దందా పక్కనపెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్పగాడు మారతాడని అంటున్నారు.
ఇక పుష్పకు భార్య శ్రీవల్లి, తన ఫ్రెండ్ కేశవ అంటే ప్రాణం. దీంతో ప్రత్యర్ధులు వీరిలో ఒకరిని చంపేసినట్లుగా డిస్కషన్ నడుస్తుంది. ట్రైలర్‌లోని ఓ చోట గంధపు చెక్కలపై ఓ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ పుష్పతో పాటు వందలాది మంది ఉంటారు. అంటే ఎవరో మఖ్యమైన పాత్ర చనిపోతారని ఖాయంగా తెలుస్తుంది. కానీ అది ఎంత వరకు నిజమో సినిమా చూస్తే కానీ తెలియదు.
హీరో హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారని చెబుతున్నారు. ఇక పుష్ప 1 లాగే పుష్ప 2కి సంగీతం కీలకపాత్ర పోషించనుందని ఇప్పటికే పలువురు ప్రముఖులు చెబుతున్నారు. దానికి తగినట్లుగానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్ట్స్ లెవల్‌లో స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలై అన్ని పాటలు మాస్‌ని ఊపేస్తున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడని ఫిలింనగర్ టాక్.

ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల విషయానికి వస్తే అందరూ అనుకుంటున్న జాతర ఎపిసోడ్ కుమ్మేసినట్లేనని అంటున్నారు. థియేటర్‌లో ఈ సీన్‌కు ఆ సమయంలో వచ్చే బీజీఎంకు గూస్‌బంప్స్ ఖాయమని చెబుతున్నారు. సినిమాలో మొత్తం మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయని ఫిలింనగర్ టాక్. క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్‌లు రెండు పెద్ద పులుల మాదిరిగా పోరాడే ఫైట్ ఊహకు అందని విధంగా ఉంటుందని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకపోవడం, నటీనటులు, ఇతర సాంకేతిక బృందం పడిన కష్టం తెరపై గ్రాండీయర్‌గా కనిపిస్తుంది. స్టాండర్డ్స్ , టెక్నీకల్‌గా పుష్ప 2 ఎక్కడా తగ్గదని ఈ సినిమాకు పనిచేసినవారు చెబుతున్నారు. ఈ సినిమా హైప్ దృష్ట్యా బాహుబలి రికార్డులను బద్ధలుకొడతుందని అంతా అంటున్నారు. మరి పుష్పగాడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











