Pushpa 2 The Rule Twitter Review : కుమ్మేసిన వైల్డ్‌ఫైర్ .. ఇది పుష్పగాడి ఊర మాస్ జాతర

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్ప ది రైజ్ (పుష్ప పార్ట్ 1). దీనికి సీక్వెల్‌గా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే పుష్ప 2 (పుష్ప ది రూల్). ఆగస్ట్ 15నే రావాల్సిన ఈ సినిమా నాలుగు నెలలు ఆలస్యంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారత్‌లో రేపు రిలీజ్ అవుతుండగా.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , దేశంలోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్‌లలో పుష్ప స్పెషల్ షోలు పడ్డాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను దాదాపు రూ. 400 కోట్ల పైచీలుకు బడ్జెట్‌తో తెరకెక్కించింది. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రూ. 500 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. ప్రస్తుతం
పుష్ప 2 మేనియాతో దేశం ఊగిపోతోంది. ఆరు భాషల్లో దాదాపు 12 వేల స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం చిన్నా, పెద్దా థియేటర్‌లలో పుష్ప 2ను రిలీజ్ చేస్తుండటం విశేషం. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుకు.. బెనిఫిట్ , స్పెషల్ షోలకు కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.

Pushpa 2 the rule Twitter review in telugu audience reaction and social media buzz

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో పుష్ప 2 ది రూల్ మూవీకి బెనిఫిట్ షో ధరలు రూ. 800 వరకు పలుకుతోంది. ఇక రిలీజ్ డే నుంచి డిసెంబర్ 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 వరకు అదనంగా ధరను పెంచుకోవచ్చు. డిసెంబర్ 9 నుంచి మాత్రం మల్టీప్లెక్స్‌లో రూ. 150, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 105 చొప్పున ధరను వసూలు చేయనున్నారు. ఏపీలోనూ దాదాపుగా ఇదే ధరలు పలుకుతున్నాయి.

కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. ఇప్పుడిప్పుడే టాక్ బయటికి వస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు, మూవీ లవర్స్ సినిమా అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ పుష్పగాడి మేజిక్‌తో షేక్ అవుతోంది. పుష్ప థియేటర్‌లలో కోలాహలం, పండుగ వాతావరణాన్ని ఫ్యాన్స్ వాట్సాప్ డీపీలతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి సోషల్ మీడియాలో పుష్ప 2 ది రూల్ గురించి ఎలాంటి టాక్ నడుస్తుందో చూస్తే :

అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయిందని, మాస్ ఎంట్రీతో గూస్ బంప్స్ తెప్పించేశాడని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. పుష్ప ఫస్ట్ పార్ట్‌ని పుష్ప ది రూల్ దాటేసిందని.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అని రుజువు చేసుకున్నారని చెబుతున్నారు. మరికొందరు ఫస్ట్ రివ్యూ ఇదే అని.. 4.2 అంటూ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటెన్స్ యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ బాగుందని .. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని పోస్ట్‌లు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: pushpa 2 the rule allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X