twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpaka Vimanam review ఆనంద్ దేవరకొండ వన్ మ్యాన్ షో

    |

    Rating: 2.75/5

    దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ విభిన్నమైన కథా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొన్న ఆనంద్ దేవరకొండ మరో హిట్ కోసం పుష్పక విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాచరు. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ ,విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. నిర్మాతగా విజయ్ దేవరకొండకు హిట్ లభించిందా? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ చేరిందా అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ సినిమా కథ, కథనాలను సమీక్షించాల్సిందే.

     పుష్పక విమానం కథ

    పుష్పక విమానం కథ

    చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే టీచర్ పెళ్లి మీద గంపెడు ఆశలు పెట్టుకొంటాడు. అయితే ఎంతో ఆశపడి మీనాక్షి (గీత్ సైనీ) అనే యువతిని పెళ్లి చేసుకొంటాడు. అయితే గొప్ప ఊహించుకొన్న సుందర్ ఆశలన్నీ తలకిందులు అవుతాయి. పెళ్లైన కొద్ది రోజులకే భార్య మీనాక్షి లేచిపోతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    చిట్టిలంక సుందర్ భార్య మీనాక్షి ఎందుకు లేచిపోయింది? భర్తను వదిలేసి మీనాక్షి వెళ్లిపోవడానికి కారణాలు ఏమిటి? భార్యను వెతికే క్రమంలో సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయి. కథలో పోలీస్ ఆఫీసర్ (సునీల్) పాత్ర ఏమిటి? సుందర్‌కు షార్ట్ ఫిలిం హీరోయిన్ రేఖ (శాన్వీ మేఘన)కి సంబంధం ఏమిటి? కనిపించకుండా పోయిన మీనాక్షి పరిస్థితి ఏమిటి? చివరకు సుందర్‌కు మీనాక్షి దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే పుష్పక విమానం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    చిట్టిలంక సుందర్‌తో మీనాక్షి పెళ్లితో కథ మొదలవుతుంది. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే మీనాక్షి ఇంటి నుంచి పారిపోతుంది. అయితే భార్య లేచిపోవడంతో సమాజానికి ఏం చెప్పుకోలేక షార్ట్ ఫిలింస్‌లో నటిస్తున్న హీరోయిన్‌ రేఖ భార్యగా నటించమని కోరుతాడు. దాంతో కథలో ఫన్ ఎలిమెంట్ చేరడంతో తొలి భాగంగా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. అయితే తొలి భాగాన్ని కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథనం కాస్త బోర్‌గా అనిపిస్తుంది. భార్య కోసం సుందర్ వెతుకులాట క్రమంలో ఊహించని ట్విస్ట్ కథలో చోటు చేసుకోవడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

     సెకండాఫ్‌ ఫుల్ జోష్‌తో

    సెకండాఫ్‌ ఫుల్ జోష్‌తో

    సెకండాఫ్‌లో కథ, కథనాలు జోరందుకోవడం కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు దామోదర రాసుకొన్న సన్నివేశాలు సినిమాకు బలంగా మారాయనిపిస్తుంది. సెకండాఫ్‌లో హెడ్ మాస్టర్ (నరేష్ వీకే), ఇన్స్‌పెక్టర్ రంగం మధ్య సీన్లు ఫుల్‌గా వినోదాన్ని పండించాయి. ఫన్‌తోపాటు సన్నివేశాల్లో ఎమోషన్స్‌తో ఊహించని మలుపుతో ముందుకు వెళ్తుంది. నరేష్, సునీల్ మధ్య వచ్చే సీన్లు మంచి వినోదాన్ని అందించాయి. కొన్ని పాత్రలపై అనుమానాలు రేకెత్తిసూ చివరకు వరకు సస్పెన్స్‌ను కొనసాగించడం సినిమాకు ప్లస్‌గా మారింది.

    దర్శకుడు దామోదర ప్రతిభ గురించి

    దర్శకుడు దామోదర ప్రతిభ గురించి

    దర్శకుడు దామోదర విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో కాస్త తడబడ్డ... సెకండాఫ్‌లో జోష్‌తో కథను నడిపించాడు. ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాను పరుగులు పెట్టించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సెకండాఫ్‌ను నడిపించిన తీరు చూస్తే అనుభవం ఉన్న దర్శకుడి మాదిరిగా దామోదర కనిపిస్తాడు. ఆనంద్ దేవరకొండ నుంచి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్, శాన్వీ మేఘన నటనను బాగా దర్శకుడు రాబట్టుకొన్నారు. ప్రీ క్లైమాక్స్ వరకు బ్యాలెన్స్‌గా తీసుకెళ్లిన దర్శకుడు క్లైమాక్స్‌‌లో కాస్త జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్‌ను దర్శకుడు కలిగించాడు.

    ఆనంద్ దేవరకొండ వన్ మ్యాన్ షో

    ఆనంద్ దేవరకొండ వన్ మ్యాన్ షో

    పుష్పక విమానం సినిమాను ఆనంద్ దేవరకొండ వన్ మ్యాన్ షోగా ముందుకు తీసుకెళ్లాడు. అమాయకమైన యువకుడి పాత్రలో ఆనంద్ చూపించి బాడీ ల్వాంగేజ్ బాగుంది. సెకండాఫ్‌లో పాత్రలో ఒదిగిపోయి నటించిన విధానం నటుడిగా ఆయనలో పూర్తిస్థాయి పరిణితి కనిపించింది. సీరియస్‌గా కనిపిస్తునే ఫన్ క్రియేట్ చేయడం ఆనంద్ టాలెంట్‌కు అద్దం పట్టింది. సెకండాఫ్‌లో అతడి ఎనర్జీ తెరపైన స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

    ఆకట్టుకొన్న శాన్వీ, గీత్ సైనీ

    ఆకట్టుకొన్న శాన్వీ, గీత్ సైనీ

    ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. రేఖగా నటించిన శాన్వీ మేఘన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. మాస్, క్లాస్ రెండింటిని మిక్స్ చేసి ఆకట్టుకొన్నది. పోలీస్ స్టేషన్‌లో ఎన్స్‌పెక్టర్‌కు ఝలక్ ఇచ్చిన సీన్‌లో అనుభవం ఉన్న నటిగా కనిపించింది. సెకండాఫ్‌లో క్లాసికల్ డ్యాన్స్‌తో తనలోని ప్రతిభను చాటుకొన్నది. భవిష్యత్‌లో మంచి పాత్రలు లభిస్తే.. తనలోని సత్తాను నిరూపించుకోవడానికి సిద్దమనే సంకేతాలను ఇచ్చింది. ఇక మీనాక్షిగా గీత్ సైనీ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. అందంగా, మంచి అభినయంతో మెప్పించిందని చెప్పవచ్చు.

     టెక్నికల్ వ్యాల్యూస్

    టెక్నికల్ వ్యాల్యూస్

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. ఫస్టాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కాస్తా శృతిమించినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలకు సింక్ కాని మ్యూజిక్ డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో వారి పనితనం బ్రహ్మండంగా ఉంది. సెకండాఫ్‌లో వారు అందించిన బీజీఎం కీలక సన్నివేశాలను మరింత హైలెట్ చేసింది. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. సన్నివేశాల మూడ్‌ను ఎలివేట్ చేసే విధంగా వాడుకొన్న లైటింగ్ బాగుంది. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ విభాగం పనితీరు, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగున్నాయి.

     ప్రోడక్షన్ వ్యాల్యూస్ గురించి

    ప్రోడక్షన్ వ్యాల్యూస్ గురించి

    ఇక పుష్పక విమానం సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కథకు తగిన విధంగా ఆర్టిస్టుల ఎంపిక వారికి సినిమాపై ఉన్న అభిరుచిని చెప్పకనే చెప్పింది. గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ దషీ, ప్రదీప్ ఎర్రబెల్లి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో క్లీన్ మూవీని అందించారని చెప్పవచ్చు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఫన్, ఎమోషన్స్‌ను మేలవించి రూపొందించిన మర్డర్ మిస్టరీ పుష్పక విమానం. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి ప్రతిభ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన ఫెర్ఫార్మెన్స్ చూడాలనుకొనే వారికి పుష్పక విమానం కేరాఫ్ అడ్రస్. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఈ వారం కేరాఫ్ అడ్రస్‌ అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వినోదాన్ని ఆస్వాదించాలనుకొనే వారికి ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లే సినిమా అని చెప్పవచ్చు.

    Recommended Video

    Pushpaka Vimanam Public Talk
    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, భద్రం, సుదర్శన్, వీకే నరేష్ తదితరులు
    రచన-దర్శకత్వం: దామోదర
    సమర్పణ: విజయ్ దేవరకొండ
    నిర్మాతలు: గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ దషీ, ప్రదీప్ ఎర్రబెల్లి
    సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
    ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
    ఎడిటర్ : రవితేజ గిరిజాల
    మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
    కాస్టూమ్స్ : భరత్ గాంధీ
    బ్యానర్స్: కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్
    పీఆర్‌వో: జీఎస్‌కె మీడియా
    రిలీజ్ డేట్: 2021-11-2021

    English summary
    After Dorasani, Middle Class melodies, Anand Deverakonda coming with Pushpaka Vimanama movie. This movie coming on November 12th. In this occassion, filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X