Ra Raja Movie Review: రా రాజా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: సుజీ విజయ్, మౌనిక హెలెన్ తదితరులు

దర్శకత్వం: బీ శివ ప్రసాద్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: రాహుల్ శ్రీవాస్తవ
ఎడిటర్: ఉప్పు మారుతి
ఆర్ట్: రామాంజనేయులు
స్టంట్స్: నందు మాస్టర్
సమర్పణ: శ్రీమతి పద్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూర్లే హరి ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్‌: కిట్టు
బ్యానర్: శ్రీ పద్మిణి సినిమాస్
రిలీజ్ డేట్: 2025-03-07

రాజా (సుజీ విజయ్), రాణి (మౌనిక హెలెన్) అన్యోన్యమైన దంపతులు. తమ తల్లిదండ్రులతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. వారి దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంటుంది. ఈ క్రమంలో వారు ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరవుతారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రాణిని రాజా ఎటాక్ చేస్తాడు.

ra-raja-telugu-movie-review

ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఏం జరిగింది? తాను ఇష్టంగా ప్రేమించే రాణిని రాజా ఎందుకు ఎటాక్ చేశాడు? రాణిపై దాడికి కారణం ఏమిటి? ఆ తర్వాత రాజా, రాణి మధ్య రిలేషన్స్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? చివరకు రాజా, రాణి వైవాహిక జీవితానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రా రాజా సినిమా కథ.

సినిమా పరిశ్రమలో హారర్, థ్రిల్లర్ మూవీస్ ఎన్నో వస్తూనే ఉంటాయి. అయితే విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలు ఉండి.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచగలిగితే వాటి సక్సెస్‌కు ఢోకా ఉండదు. అయితే డిఫరెంట్ థాట్‌తో ప్రయోగాత్మకంగా రూపొందిన సినిమా రా రాజా. ఈ సినిమాలో ఉన్న అతి తక్కువ మంది క్యారెక్టర్లతోపాటు హీరో, హీరోయిన్ల ముఖాలు చూపించకుండా సినిమా తెరకెక్కించారు. ఇలాంటి అరుదైన ప్రయోగంతో సినిమాను రెండు గంటలపాటు నడిపించడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సామే. అయితే దర్శక, నిర్మాత బీ శివ ప్రసాద్ సినిమాపై ఉన్న అభిరుచి, తపనను వ్యక్తం చేస్తూ ఈ సినిమాను తనదైన రీతిలో మెప్పించే ప్రయత్నం చేశాడనే చెప్పాలి. పాత్రల ముఖాలు కనిపించకుండా ఆడియెన్స్‌కు ఓ కొత్త ఫీల్‌ను కలిగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.

రాజాగా సుజీ విజయ్, రాణిగా మౌనిక హెలెన్ నటించగా.. మిగితా పాత్రల్లో ఇతరులు నటించారు. అయితే కెమెరాకు ముఖం చూపించకుండా హావభావాలు, పాత్రల యాటిట్యూడ్‌ను, అలాగే బాడీ లాంగ్వేజ్‌ను చూపించడంలో విజయ్, మౌనిక సక్సెస్ అయ్యారు. కీలక సన్నివేశాల్లో వారి బాడీ లాంగ్వేజ్‌తోనే పాత్రలను ఎలివేట్ చేశారు. మిగితా పాత్రలకు పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయింది.

యాక్టర్ల పెర్ఫార్మెన్స్ కంటే ఈ సినిమా కథను, సన్నివేశాలను సాంకేతిక విభాగాల పనితీరు బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా దర్శకుడి విజన్‌కు అనుగుణంగా సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాలు వర్క్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీ వాస్తవ సహజంగా చిత్రీకరించడమే కాకుండా ఎలివేషన్ కూడా బాగా ఇచ్చారు. ఈ సన్నివేశాలకు శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. ఉప్పు మారుతి ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. శివ ప్రసాద్ టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, సన్నివేశాలను ఇంకా బెటర్‌గా రాసుకొని డిజైన్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.

హరర్ అంశానికి, ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోడించి మంచి థ్రిల్లర్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిన సినిమా రా రాజా. అన్ని సినిమాల మాదిరిగా కాకుండా దీనిని డిఫరెంట్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు కొత్తదనం. టెక్నికల్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడి చేసిన ప్రయోగం అతడికి మూవీపై ఉన్న తపనను తెలియజెప్పింది. కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. ప్రయోగాత్మకంగా రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X