Raajadhani Files Review ఏపీ సీఎం టార్గెట్‌‌గా.. రాజధాని ఫైల్స్ మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, అఖిలాన్, అమృత చౌదరీ, అంకితా ఠాకూర్, వీణ తదితరులు
దర్శకత్వం: భాను
నిర్మాత: కంఠంనేని రవిశంకర్
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: రమేష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గురుచరణ్, వెనిగళ్ల రాంబాబు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
ఆర్ట్: గాంధీ
బ్యానర్: తెలుగువన్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-02-15

ఏపీలోని రాజధాని ప్రాంతం భల్లూరు గ్రామానికి చెందిన రైతు నేత (వినోద్ కుమార్) అతని భార్య (వాణి విశ్వనాథ్) ప్రజల బాగోగులు కోరుకొంటూ వారి కష్టసుఖాల్లో అండగా ఉంటారు. రైతు నేత కుమారుడు గౌతమ్ (అఖిలాన్)కు జనం అంటే అయిష్టం. తండ్రి బాటలో నడవడానికి ఇష్టపడడు. అలాంటి సమయంలో రాజధాని నిర్మాణానికి రైతులందరూ తమ భూమిని ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి (విషాల్ పత్ని) అరుణావతిలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకించి.. రాష్ట్రంలో నాలుగు రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తాడు. దాంతో అరుణావతిలో రాజధాని నిర్మాణానికి రైతులు ఉద్యమం ప్రారంభిస్తారు.

రైతుల ఉద్యమంపై అధికార ప్రభుత్వం అణిచివేత ఎలా కొనసాగింది. రాజధాని కోసం జరిగిన ఉద్యమంలో ఆ ప్రాంత ఎంపీ, రాజ్యసభ సభ్యుడు (గెటప్‌, వారి క్యారెక్టరైజన్ ప్రకారం నందిగం సురేష్, ఎంపి విజయసాయిరెడ్డి) ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహకర్త (గెటప్, క్యారెక్టరైజన్ ప్రకారం ప్రశాంత్ కిషోర్) ఎలాంటి సలహాలు ఇచ్చాడు? రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వంపై రైతులు, ప్రజా ఉద్యమం ఎలా కొనసాగింది? తండ్రి సిద్దాంతాలను వ్యతిరేకించిన గౌతమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి నాయకత్వం వహించాడు? రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వంపై ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది రాజధాని ఫైల్స్ సినిమా కథ.

Raajadhani Files Telugu Movie Review and Rating

రాష్ట్ర విభజన, రాజధాని నిర్మాణం భూసేకరణ లాంటి అంశాలతో సినిమా మంచి ఫీల్‌గుడ్, ఇంట్రెస్టింగ్ అంశాలతో కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా కొనసాగుతుంది. ప్రథమార్థంలో కథకు కనెక్ట్ అయ్యేలా రాసుకొన్న సన్నివేశాలు చూస్తే దర్శకుడు సరైన పంథాలోనే వెళ్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు రాసుకొన్న అభూత కల్పనలు, అసత్యాలతో, ఊహకు అందని సన్నివేశాలతో సినిమాను నడిపించడంతో అసలు కథ ట్రాక్ తప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఏ లక్ష్యంతో సినిమాను నిర్మించారో దానికి దూరంగా వెళ్లినట్టు స్పష్టవుతుంది. ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. రైతుల వ్యథను, ఆవేదనను, వారి మనోవేదనను పక్కన పెట్టి.. స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, రాజకీయ వ్యహకర్తను టార్గెట్ చేయడం.. రాజధాని కోసం కాకుండా.. ఓ రాజకీయ ప్రతీకారమే లక్ష్యంగా సినిమా సాగినట్టు కనిపిస్తుంది. గుడివాడ కాసినో నేపథ్యంగా ఐటమ్ సాంగ్, టెక్నాలజీని వాడుకొని హీరో చేసిన పనులు సినిమా పర్పస్‌ను భారీగా దెబ్బ తీసిందనే చెప్పాలి. ఒక ఉన్నత లక్ష్యం కోసం సినిమా చేసినప్పుడు దాని చుట్టూ కథ అల్లుకొంటే బాగుండేదనిపిస్తుంది. కేవలం అధికార పార్టీని, అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కంటే.. రాజధాని నిర్మాణం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో కంటెంట్ రాసుకొంటే రాజధాని ఫైల్స్‌ ఓ నిజాయితీతో కూడిన అటెంప్ట్ అనే ఫీలింగ్ కలిగేది.

రైతునేతగా వినోద్ కుమార్, ఆయన భార్యగా వాణి విశ్వనాథ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో గౌతమ్ క్యారెక్టర్ పూర్తిగా సినిమాటిక్‌గా సాగడం ఈ కథకు యాప్ట్ కాదనిపిస్తుంది. కానీ తన పాత్ర పరిధి మేరకు గౌతమ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అమృత చౌదరీ స్పెషల్ సాంగ్‌లో ఆకట్టుకొన్నారు. పూర్తిగా విలన్ ఛాయలు ఉన్న పాత్రల్లో కనిపించిన ప్రశాంత్ కిషోర్, ఎంపీ విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌ పాత్రధారులు బాగా నటించారు. పబ్జీ ఆడుకొనే ముఖ్యమంత్రిగా తన పాత్రలో విశాల్ పత్నీ సహజసిద్దమైన నటనను ప్రదర్శించారు.

Raajadhani Files Telugu Movie Review and Rating

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రాజధాని ఫైల్స్ మూవీకి మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ మూవీకి సినిమాటోగ్రఫి, ఆర్ట్, డైలాగ్స్ మరో అదనపు ఆకర్షణ. చాలా సీన్లను డైలాగ్స్ భారీగా ఎలివేట్ చేశాయి. జామకాయలు అమ్ముకొనే వాడివి ఎంపీ అయ్యావు.. దొంగలు లెక్కలు రాసి ఎంపీ అయ్యావు అనే డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తెలుగువన్ బ్యానర్, కంఠంనేని రవి శంకర్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పొలిటికల్ యాంగిల్‌లో కాకుండా రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించి.. రైతులను ఎలా టార్గెట్ చేశారనే కోణంలో కథ రాసుకొని ఉంటే.. డెఫినెట్‌గా అందరూ అక్కున చేర్చుకొనే అవకాశాన్ని మిస్ చేసుకొన్నారనే ఫీలింగ్ కలుగుతుంది.

ఏపీ రాజధాని, రైతులు ఉద్యమంగా సాగే అంశాలను టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రం రాజధాని ఫైల్స్. కానీ అసలు కథను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి, ఎంపీలను, రాజకీయ వ్యూహకర్తలను టార్గెట్ చేయడం వల్ల మూవీ ఉద్దేశం ట్రాక్ తప్పిందని చెప్పవచ్చు. కథ, సన్నివేశాల పరంగా చాలా నాసిరకంగా, పేలవంగా ఉంది. అవాస్తవాలు, అభూత కల్పనలకు, అంతుపట్టని ఫిక్షన్‌ అంశాలు ఈ సినిమాకు మైనస్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి, ఓ ఎజెండాతో ఉండే వర్గానికి ఈ మూవీ నచ్చడానికి అవకాశం ఉంది. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగాయనే విషయంపై ఆసక్తిగా ఉండే వారు ఈ సినిమాను చూడొచ్చు. అంచనాలు పెంచుకొని వెళితే నిరాశ తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X