Raakshasa Kaavyam Review ఇంట్రెస్టింగ్‌గా క్రైమ్, యాక్షన్ డ్రామా.. రాక్షసకావ్యం సమీక్ష

Rating: 2.75/5

నటీనటులు: అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, దయానంద్ రెడ్డి, పవన్ రమేష్, రోహిణి, అర్తే కుషాలిని, యాదమరాజు
దర్శకత్వం: శ్రీమన్ కీర్తి
నిర్మాతలు: దాము రెడ్డి, సింగనమల కల్యాణ్
మ్యూజిక్: రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎం
సినిమాటోగ్రాఫర్: రుషి కోనాపురం
ఎడిటర్: వెంకట్ కల్యాణ్
రిలీజ్ డేట్: 2023-10-13

మురికివాడలో పేదరికంలో బతుకుతూ తాగుబోతుగా మారిన బిక్షపతి (దయానందరెడ్డి) కుమారుడు అజయ్ (అభయ్ నవీన్). అజయ్‌కు చదువుకోవాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ.. తండ్రి తాగుడు కోసం రోడ్లపై బిక్షాటన పనికి వెళ్లాల్సి వస్తుంది. అయితే చదువు కోవాలనే కోరిక రోజు రోజుకు పెరిగిపోవడంతో చిల్లర దొంగతనాలు చేస్తూ.. అజయ్ కిరాయి హంతకుడిగా మారుతాడు. అయితే తన జీవితంలో ఓ జరిగిన సంఘటన కారణంగా తండ్రిపై అజయ్ ద్వేషాన్ని పెంచుకొంటాడు. అయితే ఓ లక్ష్యంతో సాగుతున్న తన జీవితానికి విజయ్ (అన్వేష్ మైఖేల్) అడ్డు తగులుతాడు.

బిక్షపతి తన తాగుడు కోసం కొడుకు అజయ్‌ను ఎలా వాడుకొన్నాడు? బిక్షపతి తన భార్యను ఎలా బ్లాక్‌మెయిల్ చేశాడు? చదువు అనే తన బలహీనతతో అజయ్ ఎలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డాడు. అజయ్ జీవితంలోకి వచ్చిన విజయ్ ఎవరు? అజయ్‌ను ఎందుకు విజయ్ టార్గెట్ చేశాడు? తండ్రిని అజయ్ ఎందుకు అసహ్యించుకొన్నాడు? అజయ్, విజయ్ మధ్య అధిపత్య పోరాటానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రాక్షసకావ్యం సినిమా కథ.

 Raakshasa Kaavyam Telugu Movie Review and Rating: Jabardasth Yadamaraju, Abhai Naveen looks high note

విజయ్ మర్డర్ చేస్తుండగా ఓ స్టూడెంట్ చూడటం, అతడిని పట్టుకొని తమ వెంట తిప్పుతూ అతడితోనే మర్డర్ చేయించడమనే సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. తాను ఓ హంతకుడిగా ఎందుకు మారాను అనే విషయాన్ని చెబుతూ అజయ్ జీవితాన్ని ఫ్లాష్‌ బ్యాక్‌లో చూపించడం చాలా ఎమోషనల్‌గా మారుతుంది. ఫస్టాఫ్‌ను చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీమన్ కీర్తి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ఇక రాక్షసకావ్యం సెకండాఫ్‌లో విజయ్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి కథలో భారీ ట్విస్టును ఇవ్వడంలో కూడా దర్శకుడు శ్రీమన్ తన ప్రతిభను చాటుకొన్నాడు. అయితే క్లారిటీ లేకపోవడం, కథకు బలంగా విజయ్ క్యారెక్టర్ సపోర్టుగా లేకపోవడం వల్ల కథలో ఏదో మిస్ అయినట్టు కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఒకే పాయింట్‌తో వేరియేషన్స్, ఎమోషన్స్ లేకుండా రెగ్యులర్‌గా డ్రామా కొనసాగడం రొటీన్‌గా అనిపిస్తుంది.

 Raakshasa Kaavyam Telugu Movie Review and Rating: Jabardasth Yadamaraju, Abhai Naveen looks high note

ఇప్పటి వరకు కమెడియన్ పాత్రలకు పరిమితమైన అభయ్ కొత్త అవతారంలో అదరగొట్టే ఫెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయాడు. అజయ్ పాత్రను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. అభయ్‌ ఊహించని పాత్రతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడనే చెప్పాలి. విజయ్‌గా అన్వేష్ మాస్ పాత్రలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక ఈ సినిమాలో బిక్షపతి పాత్రను చేసిన దయానంద్ రెడ్డి సినిమాకు బలంగా మారిన క్యారెక్టర్‌లో నటించాడు. దయానంద్ రెడ్డి చేసిన పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంది. ఆ పాత్రను నేచురల్‌గా దయానంద్ చేయడంతో కథలో ఎమోషన్ పండిందని చెప్పాలి. యాదమరాజు మిగితా పాత్రల్లో నటించిన వారు కూడా మంచి నటనను ప్రదర్శించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రుషి కోనాపురం అందించిన సినిమాటోగ్రఫి, రాజీవ్ రాజ్, శ్రీకాంత్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరింత పాజిటివ్‌గా మార్చాయి. క్రైమ్, యాక్షన్, డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం దామురెడ్డి, సింగనమల కల్యాణ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్‌‌నెస్ కనిపించింది. మిగితా సాంకేతిక నిపుణులు ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం కూడా బాగుంది.

 Raakshasa Kaavyam Telugu Movie Review and Rating: Jabardasth Yadamaraju, Abhai Naveen looks high note

స్లమ్ ఏరియాలో ఇద్దరు భిన్నమైన వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ, ఆధిపత్య పోరాటం ప్రధాన అంశాలుగా రాక్షసకావ్యం ఎక్కువైంది. హింస మాటున మంచి సందేశాన్ని కూడా దర్శకుడు ఇచ్చిన తీరును అభినందించాలి. ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో తడబాటుకు గురయ్యాడనే ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు నమ్మడానికి వీలు లేకుండా పోయాయి. దాంతో కథ ఎమోషనల్ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ, కథనాలపై కొంత వర్క్ చేసి ఉంటే మంచి క్రైమ్ డ్రామా అయి ఉండేదనిపిస్తుంది. యాక్షన్, క్రైమ్ డ్రామాను ఆదరించే వారికి, అలాగే విభిన్నమైన కంటెంట్.. ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా సాగే సినిమాను ఇష్టపడేవారికి రాక్షస కావ్యం నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X