Raayan Movie Review: రాయన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, ఎస్ జే సూర్య, సెల్వరాఘవన్ తదితరులు
రచన, దర్శకత్వం: ధనుష్
నిర్మాత: కళానిధి మారన్
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-07-26

చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సోదరులు ముత్తు రాయన్, మాణిక్యం రాయన్, దుర్గ పెంపకం, వారి సంరక్షణ బాధ్యత కార్తవ రాయన్ అలియాస్ రాయన్ అలియాస్ రాయ (ధనుష్) భుజాలపై పడుతాయి. అనుకొని పరిస్థితుల్లో పూజారిని చంపి.. రాయన్ ఆ ఊరును వదిలి వేరే గ్రామానికి వెళ్తారు. అక్కడ వారిని శేఖర్ (సెల్వరాఘవన్) ఆదరించి వారికి అండగా నిలిచి పెద్దన్నగా మారుతాడు. సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉన్నాయని అనుకొనే క్రమంలో స్థానికంగా మాఫియా వ్యవహారాలు నిర్వహించే సీతారాం (ఎస్‌జే సూర్య)తో చేతుల కలిపిన ముత్తు, మాణిక్యం తన అన్నయ్య రాయన్‌పై హత్యా ప్రయత్నం చేస్తారు.

Raayan Movie Review in Telugu  Dhanush s misses Emotions and Intense elements

శేఖర్ అండతో రాయన్ తన సోదరి, సోదరులను గొప్పగా పెంచాలనుకొన్నప్పటికీ.. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు జరగలేదు? గ్రామంలో సీతారామ్, దోరైస్వామి మధ్య గొడవలు ఏమిటి? దొరై స్వామిని ఎవరు? ఎందుకు చంపారు? సీతారాంతో ముత్తు, మాణిక్యం ఎందుకు చేతులు కలిపారు? దుర్గ (దుషార విజయన్)‌ కు జరిగిన అన్యాయం ఏమిటి? తన చెల్లెలి కోసం రాయన్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకొన్నాడు? తనపై మర్డర్ ప్లాన్ చేసిన సోదరులు ముత్తు, మాణిక్యంను రాయన్ ఏం చేశాడు? చెల్లెలు దుర్గ పెళ్లి చేయాలని చేసిన రాయన్ ప్రయత్నాలు నెరవేరాయా? అనే ప్రశ్నలకు సమాధానమే రాయన్ సినిమా కథ.

రాయన్ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనతో కథ భావోద్వేగంగా కనిపిస్తుంది. అలాంటి మూడ్‌తో ప్రారంభమైన కథలోకి వచ్చే పాత్రలు.. వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడిగా ధనుష్ ఎక్కువ సమయమే తీసుకొన్నాడనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్‌లో ఒకట్రెండు చోట్ల హై మూమెంట్స్ ఉంటాయే గానీ.. ఎక్కడా సన్నివేశాలు ఉద్వేగానికి గురి చేయకుండా ఫ్లాట్‌గా సాగుతాయి. దొరైస్వామి, సీతారాం క్యారెక్టర్లలో డెప్త్, ఇంటెన్స్ కనిపించవు. పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ కూడా అలా వచ్చిపోతుంటుంది. ఇలాంటి ఊగిసలాట మధ్య అసలు పాయింట్ సెట్ చేసిన ధనుష్ మంచి ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేలా చేయడం ప్లస్ పాయింట్ అనిపిస్తుంది.

Raayan Movie Review in Telugu  Dhanush s misses Emotions and Intense elements

ఇక సెకండాఫ్‌లో కథలో అన్ని రకాలుగా దట్టించాడు. సిస్టర్ సెంటిమెంట్, అండగా ఉండే సోదరులు తోడేళ్లుగా మారడమనేది చిన్న ట్విస్టుగా కనిపిస్తుంది. కానీ సిస్టర్ పెళ్లి సందర్భంగా జరిగిన ఓ యాక్షన్ సీన్‌తో దర్శకుడిగా ధనుష్ తనలోని సత్తాను ప్రతీ ఫ్రేమ్‌లో చూపించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు సాగిన విధ్వంసం, హింస సినిమా మరో దారి పట్టించిందనేలా అనిపిస్తుంది. అయితే పగ, ప్రతీకారం పాయింట్‌తో ఓ సిస్టర్ సెంటిమెంట్‌ను ధనుష్ ఫర్‌ఫెక్ట్ ట్విస్టుతో ముగించడం ఓ పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు.

ధనుష్ గురించి కొత్త పరిచయం అక్కర్లేని టాలెంటెడ్ ఆర్టిస్ట్.ఎలాంటి పాత్రనైనా తన మార్కుతో ఆకట్టుకొవడం ఆయనకు తెలిసినట్టు మరొకరికి తెలియదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఆయన నటన, ఫెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని విధంగా రాయన్ పాత్రలో దూరిపోయి.. నట విధ్వంసం చేశాడనే చెప్పాలి. ఇక బాడీ లాంగ్వేజ్, లుక్ వైజ్ ధనుష్ కొత్తగా కనిపించాడు. ఇక యాక్షన్ల సీన్లలో చెలరేగిపోయాడు. సందీప్ కిషన్‌ మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకొన్నాడు. ధనుష్‌తో పోటీ పడేంత రేంజ్ లేదు కానీ.. పెర్ఫార్మెన్స్ పరంగా కొంత సందీప్ కిషన్ కనిపించాడనే ఫీలింగ్ కల్పించాడు. ఎస్‌జే సూర్య కామెడీ టచ్ ఉన్న విలనిజాన్ని తనదైన శైలిలో ప్రదర్శించాడు. సోదరిగా దుషార విజయన్ ఎమోషన్, యాక్షన్ సీన్లలో నటించిన తీరు ఆశ్చర్యానికి గురిచేలా ఉంటుంది. తనకు లభించిన అవకాశాన్ని ఆమె పూర్తిగా వినియోగించుకోవడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాలోని సన్నివేశాల్లో కంటెంట్, ఎమోషన్స్ లేకపోయిన ఏఆర్ రెహ్మన్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత పాత రెహ్మాన్ చూశామనే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రీ క్లైమాక్స్ నుంచి బీజీఎంతో సినిమాను ఎంగేజింగ్‌గా మార్చారు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పరంగా కొంత నిడివి తగ్గించడానికి ఆస్కారం ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.

Raayan Movie Review in Telugu  Dhanush s misses Emotions and Intense elements

అన్నదమ్ములు, అన్న చెల్లెలి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌తో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా. అయితే కథను మరో రేంజ్‌కు చేరడానికి ఉన్న స్కోప్, అవకాశాన్ని పూర్తిగా వినియోగించు కోలేదనిపిపస్తుంది. అన్నయ్యపై తమ్ముళ్లు ఎందుకు ఎదురు తిరిగారు.. చెల్లిలి కోసం అన్న ఎంతకైనా తెగిస్తాడు అనే అంశాలకు క్లారిటీ మిస్ అయ్యాడనిపిస్తుంది. అన్నాచెల్లెల అనురాగం, ప్రేమ లాంటి అంశాలతో ఈ సినిమా రెగ్యులర్, రొటీన్‌గా అనిపించినప్పటికీ.. ధనుష్ డైరెక్షన్, యాక్టింగ్ వల్ల బెటర్‌గా అనిపిస్తుంది. రైటింగ్‌పై మరింత దృష్టిపెట్టి ఉండే మహరాజా లాంటి మంచి సిస్టర్ సెంటిమెంట్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది. యాక్షన్ లవర్స్‌కు ఈ సినిమా నచ్చే అంశాలు ఉన్నాయి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న సినిమా.. ధనుష్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది ఫుల్ మీల్స్ లాంటి మూవీ.

More from Filmibeat

Read more about: dhanush raayan sandeep kishan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X