Raayan X Review రాయన్ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ విశ్వరూపం.. సెకండ్ హీరో ఏఆర్ రెహ్మాన్

తమిళ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ రాయన్. తన కెరీర్‌లో రెండోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రంలో సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, కాళిదాస్ జయరాం, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు.

ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 26వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఏమనుకొంటున్నారనే విషయంలోకి వెళితే..

Raayan x Review

రాయన్ సినిమా రా, ఇంటెన్స్, హింసతో కూడిన సినిమా. ఇలాంటి సినిమాను తెరకెక్కించే నైపుణ్యం ధనుష్ రాజాకు ఉందని అనుకోలేదు. 90 దశకంలో మనకు తెలిసిన ఏఆర్ రెహ్మాన్ మళ్లీ మనకు కనిపించాడు. ఈ సినిమా రెహ్మన్ సెకండ్ హీరో. ధనుష్ యాక్టింగ్ అదిరిపోయింది. ప్రతీ నటుడికి స్క్రీన్ టైమ్ కచ్చితంగా ఉంది. ఈ సినిమా వెట్రీమారన్ మూవీ మాదిరిగా ఉంటుంది. ఫస్టాఫ్ వేరే లెవెల్‌లో ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రాయన్ సినిమా ఫస్టాఫ్ సాలిడ్ కంటెంట్‌తో ప్యాక్ చేశారు. దర్శకుడిగా ఈ సినినిమాను ధనుష్ తెరకెక్కించిన తీరు అద్బుతంగా ఉంది. బీజీఎం బాగుంది. ధనుష్ ఎల్లకాలం గుర్తుండిపోయే దర్శకుడు, నటుడు అనిపించుకొన్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ధనుష్ నీ కెరీర్‌లో 50వ సినిమాగా వస్తున్నందుకు కంగ్రాట్స్. ఈ సినిమాతో భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ హార్డ్ వర్క్‌కు, నిరంతర శ్రమకు ఫలితం దక్కాలని భావిస్తున్నాం. రాయన్ టీమ్‌కు హృదయపూర్వకంగా విషెస్ అని కార్తీ ట్వీట్ చేశారు.

ఫస్టాఫ్ చూశాను. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, ధనుష్, ఎస్‌జే సూర్య మధ్య పోటాపోటీగా జరిగే సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌ ఎలా ఉంటుందోననే ఆతృత పెరిగింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ధనుష్‌కు ముందస్తు కంగ్రాట్స్. మీ జీవితంలో రాయన్ ప్రత్యేకమైన మైలురాయిగా మిగిలాలని భావిస్తున్నాం. ఈ సినిమాకు సంగీతం అందించిన ఏఆర్ రెహ్మాన్‌కు ప్రత్యేకంగా అభినందనలు. ఈ మ్యూజిక్‌తో ఈ మూవీని మరో మెట్టు ఎక్కించాలని కోరుకొంటున్నాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

ధనుష్ తన 50వ సినిమా రాయన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు కంగ్రాట్యూలేషన్. సినిమా కోసం మీరు పడే తపన, కఠోర శ్రమకు భారీ సక్సెస్ లభించాలని కోరుకొంటున్నాం. రాయన్ టీమ్‌కు హృదయపూర్వకంగా అభినందనలు అని సూర్య ట్వీట్ చేశారు.

రాయన్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ధనుష్ కెరీర్‌లో స్పెషల్ మూవీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాం. ఈ సినిమా కలకాలం గుర్తుంచుకొనే సినిమా కావాలని ఆకాంక్షిస్తున్నాను అని నాగవంశీ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Read more about: raayan dhanush sandeep kishan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X