twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam Movie Review డిఫరెంట్ లవ్ స్టోరి.. ప్రభాస్, పూజా హెగ్గే ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్య శ్రీ, కృష్ణం రాజు, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, జయ్ రామ్, ఫ్లోరా జాకోబ్ తదితరులు
    రచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
    నిర్మాత: వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ (హిందీ)
    సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఎస్ థమన్ (తెలుగు), సచిన్ బల్హారా, అంకిత్ బల్హారా (హిందీ)
    పాటలు: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు), మిథున్, అమాల్ మాలిక్, మహాన్ భరద్వాజ్ (హిందీ)
    బ్యానర్: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 2022-03-11

    రాధే శ్యామ్ కథేంటి అంటే

    రాధే శ్యామ్ కథేంటి అంటే


    దేశంలోనే అత్యంత ప్రముఖుడైన హస్త సాముద్రిక జ్యోతిష్కుడు విక్రమాదిత్య (ప్రభాస్). ప్రధాని ఇందిరాగాంధీకి ముందే ఎమర్జెన్సీ వస్తుందని షాక్ ఇచ్చిన జ్యోతిష్కుడు. ఎమర్జెన్సీ కాలంలో ఇటలీలో తలదాచుకొన్న విక్రమాదిత్య అక్కడే డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడుతాడు. అరుదైన క్యాన్సర్ వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్న ప్రేరణ జాతకం చూసి 100 ఏళ్లు బతుకుతుందని చెబితే.. ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు తేలికగా కొట్టిపడేస్తారు. అయితే తన జీవితంలో ప్రేమ, పెళ్లి యోగం లేదని విక్రమాదిత్య ఫిక్స్ అవుతాడు. కొద్ది రోజుల్లో తన మరణం పొంచి ఉందని తన జాతకం తానే చూసుకొంటాడు.

    రాధే శ్యామ్ సినిమాలో ట్విస్టులు

    రాధే శ్యామ్ సినిమాలో ట్విస్టులు

    ప్రపంచంలోనే మేటి జ్కోతిష్కుడైన విక్రమాదిత్యకు జీవితంలో ఎలాంటి సమస్యలు, అనుభవాలు ఎదురయ్యాయి? కొద్ది రోజుల్లో చనిపోతుందని డాక్టర్లు నిర్ఱారణ తర్వాత ప్రేరణ జీవితం ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నది. తనకు 100 ఏళ్ల ఆయుష్షు, గొప్పగా కెరీర్ ఉందని చెప్పిన విక్రమాదిత్యకు తనలోని ప్రేమను చెప్పిందా? త్వరలోనే విక్రమాదిత్య చనిపోతాడని తెలుసుకొన్న ప్రేరణ తన జీవితానికి ఎలాంటి శిక్ష విధించుకొన్నది? మృత్యువు వెంటాడుతున్న ప్రేరణ, విక్రమాదిత్య జీవితాలకు ఎలాంటి ముగింపు లభించిందనే ప్రశ్నలకు సమాధానమే రాధే శ్యామ్ సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో బలమైన అంశాలు..

    ఫస్టాఫ్‌లో బలమైన అంశాలు..

    మేటి జ్యోతిష్కుడు, విక్రమాదిత్య గురువు పరమహంస (కృష్ణం రాజు) ఎంట్రీతో రాధే శ్యామ్ ఓ ఎమోషనల్ నోట్‌తో మొదలవుతుంది. ఇందిరాగాంధీకి జ్యోతిష్యం చెప్పిన సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇటలీలో విక్రమాదిత్య ఎంట్రీతో కథ లవ్ ట్రాక్‌పైకి ఎక్కుతుంది. పూజా హెగ్డేను విక్రమాదిత్య కలవడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఓ సరికొత్తగా కనిపిస్తుంది. రెగ్యులర్ ప్రేమ కథగా కాకుండా మెచ్యుర్డ్ లవ్ ట్రాక్‌తో సరదాగా సాగిపోతుంది. చనిపోతుందని అందరూ ఫిక్స్ అయిన సమయంలో విక్రమాదిత్య చెప్పిన జాతకం సినిమాను పూర్తిగా ఎమోషనల్‌గా మార్చడమే కాకుండా తొలి భాగానికి ట్విస్ట్ ఇస్తుంది. ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్ కథకు మరింత బలంగా మారుతుంది. అయితే కథ, కథనాలు స్లోగా సాగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

    సెకండాఫ్ ఎలా ఉందంటే?

    సెకండాఫ్ ఎలా ఉందంటే?

    రాధేశ్యామ్ సెకండాఫ్‌ భావోద్వేగమైన సంఘటనలు కథను ఇంట్రెస్టింగ్‌గా మార్చుతుంది. తన చావు కొద్ది రోజుల్లోనే ఉందని తెలుసుకొన్న విక్రమాదిత్య తన తల్లి (భాగ్య శ్రీ)కి, ప్రేరణకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం బలమైన సెంటిమెంట్‌గా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు సముద్రంలోని షిప్ ఎపిసోడ్‌కు సంబంధించిన యాక్షన్ పార్ట్ సినిమాకు హైలెట్‌గా మారుతుంది. ఓవరాల్‌గా ఈ సినిమా పెద్దగా ట్విస్టులు లేకుండా.. నిదానంగా సాగడం సగటు ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష మాదిరిగానే ఉంటుంది.

    దర్శకుడు రాధాకృష్ణ

    దర్శకుడు రాధాకృష్ణ

    దర్శకుడు రాధాకృష్ణ ఎంచుకొన్న చిన్న పాయింట్ చుట్టూ కథ, కథనాలను అల్లుకొన్న తీరు బాగుంది. కథకు కావాల్సిన సన్నివేశాలను బలంగా రాసుకోవడంలో ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది. ఇంటర్వెల్‌కు ముందు సచిన్ ఖేడేకర్‌తో ఉన్న సీన్లు, ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను డీల్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. అయితే కథను వేగంగా కొన్ని మాస్ ఎలిమెంట్స్ జొప్పించి ఉంటే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి సినిమా అయి ఉండేది. క్లాస్ టచ్ ఎక్కువగా ఉండటం ఫ్యాన్స్‌కు రుచిస్తుందో లేదో చూడాల్సిందే.

    సరికొత్తగా ప్రభాస్

    సరికొత్తగా ప్రభాస్


    ప్రభాస్ గత చిత్రాలను చూసుకొంటే ప్రభాస్ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ దండిగా కనిపిస్తాయి. రాధే శ్యామ్ విషయానికి వస్తే.. క్లాస్, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను ప్రభాస్ ఎంచుకోవడం, తన పాత్ర ద్వారా మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎమోషనల్ సీన్లలో కొత్త ప్రభాస్‌ను చూడటానికి అవకాశం కలిగింది. కృష్ణం రాజుతో కొన్ని సీన్లలో పోటాపోటిగా నటించాడు. పాటలు, ఫైట్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడంతో తనలోని కొత్త నటుడిని అభిమానులకు చూపించడానికి ప్రయత్నించాడనిపిస్తుంది. ప్రభాస్‌లో గతంలో కనిపించిన కొత్త పరిణతి ఈ సినిమాలో కనిపిస్తుంది. లుక్, బాడీ లాంగ్వేజ్‌తో స్టైలిష్‌గా కనిపించాడు.

    ఎమోషనల్ పాత్రలో పూజా హెగ్డే

    ఎమోషనల్ పాత్రలో పూజా హెగ్డే


    ప్రేరణ అనే యువ డాక్టర్‌గా పూజా హెగ్డే తన పాత్రలో ఒదిగిపోయింది. పేషెంట్స్‌కు ప్రాణం పోస్తూనే.. తన ప్రాణాలను కాపాడుకొనే యువతిగా, అలాగే ప్రియుడి ప్రేమ కోసం పరితపించే ప్రేమికురాలిగా పలు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించింది. ఫస్టాఫ్‌లో చిలిపిగా కనిపించిన ప్రేరణ, సెకండాఫ్‌లో మెచ్యురిటీ ఉన్న నటనతోపాటు గ్లామర్ పరంగా పూజా హెగ్డే మెప్పిస్తుంది. గత చిత్రాలతో పోల్చితే ఫెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కొత్త పూజా కనిపిస్తుంది.

    కృష్ణం రాజు, ఇతర పాత్రల గురించి

    కృష్ణం రాజు, ఇతర పాత్రల గురించి


    రాధేశ్యామ్ మిగితా పాత్రల విషయానికి వస్తే.. కృష్ణం రాజు పాత్ర చిన్నదైనా.. గుర్తుండి పోయే విధంగా ఉంటుంది. తన స్టేచర్‌కు న్యాయం చేసే పాత్రలో కనిపించారు. పూజా హెగ్డే పెదనాన్నగా సచిన్ ఖేడేకర్ బలమైన పాత్రలో కనిపిస్తాడు. మురళీ శర్మ, ప్రియదర్శి, భాగ్య శ్రీ పాత్రలు కథలో భాగంగా కనిపిస్తాయి. నటన పరంగా వారికి పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించదు. మిగితా నటులు తమ పాత్రల పరిధిమేరకు ఒకే అనిపించారు.

    టెక్నికల్ వ్యాల్యూస్ గురించి

    టెక్నికల్ వ్యాల్యూస్ గురించి

    రాధే శ్యామ్ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అత్యంత బలమైన అంశం సినిమాటోగ్రఫి. మనోజ్ పరమహంస ఇటలీ, జార్జియా, లండన్, ప్యారిస్ తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్ల అద్భుతంగా కెమెరాతో ఒడిసిపట్టుకొన్నారు. రవీందర్ రెడ్డి వేసిన సెట్స్ సినిమాకు సంబంధించిన ప్రతీ ఫ్రేమ్ ఆహ్లదకరంగా మార్చేలా పరమహంస చేశారనిపిస్తుంది. యాక్షన్ సీన్లు ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి కేక పెట్టించాడు. ట్రైన్ ఎపిసోడ్, ఫారెస్ట్‌కు సంబంధించిన సన్నివేశాలు, షిప్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను తన మ్యూజిక్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. పాటలు నిరాశ పరిచాయనే చెప్పాలి. సాంకేతిక విభాగాలు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ని అందించాయి. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

    Recommended Video

    Radhe Shyam Review ప్రభాస్ ఫాన్స్ జెన్యూన్ రివ్యూ .. | Prabhas | Pooja Hegde| Filmibeat Telugu
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా భావోద్వేగంగా సాగే పోయెటిక్ లవ్ స్టోరి రాధే శ్యామ్. దర్శకుడు విజన్, స్క్రిప్ట్ వర్క్, ప్రభాస్, పూజా హెగ్డే ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, కథనాలు స్లోగా సాగడం మైనస్‌గా కనిపిస్తాయి. క్లాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీలను ఆదరించే వారికి రాధే శ్యామ్ నచ్చుతుంది. మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలుగుతుంది. చివరగా రాధే శ్యామ్ సినిమా గురించి చెప్పాలంటే.. క్లీన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. ఫన్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో సాగే ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది. వీకెండ్‌ ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అవకాశం ఉన్న చిత్రమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లపైనే సినిమా ఏం రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.

    English summary
    Radhe Shyam Movie Review: Prabhas, Pooja Hegde's latest movie hits the screens on March 11th. in this occassion, Filmibeat Telugu brings Exclusive report here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X