Iddaru Movie Review: ఇద్దరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. మాజీ సీఎం భార్య పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, జేడీ చక్రవర్తి, రాధిక కుమారస్వామి, కే విశ్వనాథ్, సమీర్, సోనీ చరిష్టా తదితరులు
దర్శకత్వం: SS సమీర్
నిర్మాత: Md ఫర్హీన్ ఫాతిమా
సినిమాటోగ్రఫి: అమీర్ లాల్
మ్యూజిక్: సుభాష్ ఆనంద్
ఎడిటింగ్: ప్రభు
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం
బ్యానర్: FS ఎంటర్‌‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-10-19

పలు మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించే సంజయ్ రంగస్వామి (అర్జున్) కోట్లకు పడుగలెత్తిన బిజినెస్‌మ్యాన్. ఆయన కంపెనీలో పనిచేసే చక్రి (జేడీ చక్రవర్తి) ఉన్నట్టుండి కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే కుట్రతో తన బాస్‌పైనే హానీ ట్రాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు.

Radhika Kumaraswamy s Iddaru Movie Review and Rating in Telugu  Arjun Sarja  JD Chakravarthy excels with Performances

హానీ ట్రాప్ అంటే ఏమిటి? బాస్ అర్జున్‌పై చక్రీ ప్రయోగించిన హానీ ట్రాప్‌లో అమ్మాయి ఎవరు? బాస్‌ను హానీ ట్రాప్‌లో ఎలా ఇరికించాడు? చక్రీ కుట్రను అర్జున్ పసిగట్టాడా? అర్జున్, చక్రీ మధ్య జరిగిన సైకాలజికల్ గేమ్ ఏమిటి? చక్రీ ఎత్తులకు అర్జున్ వేసిన పై ఎత్తులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఇద్దరు సినిమా కథ.

కన్నడలో ఒప్పండా, తెలుగు భాషల్లో ఇద్దరు టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఈ చిత్రంలో సుప్రసిద్ద దర్వకులు కే విశ్వనాథ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, సీనియర్ హీరోయిన్ రాధిక కుమారస్వామి, బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ లాంటి యాక్టర్లు నటించడంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన దృష్టి పడింది.

Radhika Kumaraswamy s Iddaru Movie Review and Rating in Telugu  Arjun Sarja  JD Chakravarthy excels with Performances

హానీ ట్రాప్ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు ఎస్ఎస్ సమీర్ రాసుకొన్న పాయింట్ బాగుంది. అర్జున్ సర్జా, జేడీ చక్రవర్తి, రాధిక కుమారస్వామి పాత్రలను బాగా డిజైన్ చేసుకొన్నాడు. కానీ కథను తెర మీదకు తీసుకు రావడంలో తడబాటు కనిపించింది. అయితే ముఖ్యంగా మూడు పాత్రల మధ్య డ్రామాను బాగా నడిపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. చివరకు తన కథకు న్యాయం చేసేందుకు చేసిన నిజాయితీ దర్శకుడిలో కనిపిస్తుంది.

ఇక అర్జున్ సర్జా, జేడీ చక్రవర్తి, రాధిక కుమారస్వామి గురించి, వారి యాక్టింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిచ్ బిజినెస్‌మ్యాన్‌గానే కాకుండా డిఫరెంట్ రోల్‌తో అర్జున్ సర్జా మెప్పించారనే చెప్పాలి. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో జేడీ చక్రవర్తి ఆకట్టుకొన్నాడు. అర్జున్, ఆయన ఇద్దరు పోటీ పడి నటించారు. రాధిక కుమారస్వామి, ఫైజల్ ఖాన్, కే విశ్వనాథ్ ప్రత్యేక ఆకర్షణే కాకుండా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పవచ్చు.

Radhika Kumaraswamy s Iddaru Movie Review and Rating in Telugu  Arjun Sarja  JD Chakravarthy excels with Performances

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అమీర్ లాల్ అందించిన సినిమాటోగ్రఫి, సుభాష్ ఆనంద్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు చూస్తే.. ప్రభు ఎడిటింగ్ విషయంలో కొంత షార్ప్‌గా వర్క్ చేయాల్సిందేమో అనిపిస్తుంది. అమ్మా రాజశేఖర్ కొరియోగ్రఫి ఫర్వాలేదనిపిస్తుంది. ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హీన్ ఫాతీమా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సీనియర్ యాక్టర్లతో రాజీ లేకుండా సినిమాను నిర్మించడం హర్షించదగిన విషయంగా చెప్పుకోవచ్చు.

హానీ ట్రాప్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా మూడు పాత్రల మధ్య జరిగే డ్రామాతో నడిచే సైకాలజికల్ థ్రిల్లర్. అర్జున్, జేడీ చక్రవర్తి, రాధిక కుమారస్వామి, విశ్వనాథ్ లాంటి నటీనటుల ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక అంశాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్. కథా పరంగా లోపాలు, సన్నివేశాల్లో ఇంకా బెటర్‌గా రాసుకొని ఉంటే థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సినిమా మరో రేంజ్‌కు వెళ్లే అవకాశం ఉండేదనిపిస్తుంది. స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలను, థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X