Raghava Reddy Review ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా.. రాఘవరెడ్డి మూవీ మెప్పించిందా?

నటీనటులు: నందితా శ్వేత, శివ కంఠమనేని, రాశి, ప్రవీణ్, అజయ్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, శ్రీనివాసరెడ్డి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సంజీవ్ మేగోటి
నిర్మాతలు: కేఎస్ శంకరరావు, జీ రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వరరావు
మ్యూజిక్ డైరెక్టర్: సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫి: ఎస్ఎన్ హరీష్
ఎడిటర్: ఆవుల వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గంటా శ్రీనివాసరావు
రిలీజ్ డేట్: 2024-01-05

వైజాగ్‌లోని నర్సింహారెడ్డి కాలేజ్‌లో రాఘవ రెడ్డి (శివ కంఠమనేని) క్రిమినాలజీలో ప్రొఫెసర్. ఎంతో మంది క్రిమినల్స్ అంతు చూసిన ఆయన కాలేజీలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. కూతురు పుట్టిన తర్వాత భార్య దేవకి (రాశి)తో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగా దాంపత్య జీవితం డిస్ట్రబ్ అవుతుంది. ఇక కాలేజీలో మహాలక్ష్మీ అలియాస్ లక్కీ (నందితా శ్వేత) గడుపు పిల్ల. ముక్కుసూటి తనం, మగరాయుడు యాటిట్యూడ్‌తో రాఘవరెడ్డి ఆగ్రహానికి గురి అవుతుంది. అయితే ఓ సంఘటన తర్వాత లక్కి అదృశ్యం అవుతుంది.

తన భార్యతో రాఘవరెడ్డి ఎందుకు విడిపోయారు? నైజాం పిల్ల వైజాగ్‌లో ఎందుకు చదువుతుంది? రాఘవరెడ్డి తన వృత్తిలో ఎలాంటి సవాళ్లను అధిగమించాడు? కాలేజీలో రాఘవరెడ్డితో లక్కీ ఎందుకు గొడవలు పడింది? లక్కీని ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాపర్ల నుంచి లక్కిని ఎవరు కాపాడారు? రాఘవరెడ్డి, దేవకి మళ్లీ కలిశారా? వారిద్దరి కూతురు పరిస్థితి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే రాఘవరెడ్డి సినిమా కథ.

Raghava Reddy Review and Rating: Nandita Shwethas Family Emotional Drama

అల్లరి పిల్ల లక్కీగాగా నందిత శ్వేత, రాఘవరెడ్డిగా శివ కంఠమనేని క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ కథ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. లక్కీ చిలిపి చేష్టలు, టపోరి భాష మాస్‌గా ఉంటే.. రాఘవరెడ్డి క్యారెక్టర్ సీరియస్ నోట్‌తో సాగుతుంది. ఇక లక్కీ యాటిట్యూడ్ మార్చేందుకు రాఘవరెడ్డి చేసే ప్రయత్నాలు, శ్రీనివాస్ రెడ్డి, బిత్తిరి సత్తి కామెడీ రొటీన్‌గా సాగుతాయి. ఇంటర్వెల్‌కు ముందు ఓ ఎమోషనల్ సీన్‌తో ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా ముగించడంతో సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటి పెరుగుతుంది.

సెకండాఫ్‌లో రాఘవరెడ్డి క్యారెక్టర్‌ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌తో యాక్షన్ జోన్‌లోకి మారుతుంది. అజయ్ ఘోష్ విలనిజం కొంత నవ్వించేలా ఉంటుంది. రాశి, శివ కంఠమనేని మధ్య సీన్లు ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు మాస్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

Raghava Reddy Review and Rating: Nandita Shwethas Family Emotional Drama

నటీనటులు విషయానికి వస్తే.. శివ కంఠమనేని సీరియస్ పాత్రలో హుందాగా కనిపించారు. ఆయన గెటప్, యాటిట్యూడ్ కొత్తగా అనిపించింది. అలాగే ప్రొఫెసర్‌గా తెర మీద డిగ్నిఫైడ్‌గా కనిపించారు. పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే.. నటనపై ఆయనకు ఉన్న తపన కనిపిస్తుంది. రాశి పాత్ర గెస్టుగా ఉన్నప్పటికీ గుర్తుండి పోతుంది. ఇక నందిత శ్వేత అల్లరిపిల్లగా, టపోరి క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నది. గతంలో కంటే డిఫరెంట్ లుక్, యాటిట్యూడ్‌తో మెప్పించే విధంగా ఫెర్ఫార్మ్ చేసింది.

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, డైలాగ్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. యాక్షన్, ఎమోషనల్ సీన్లను హరీష్ చక్కగా తెరకెక్కించారు. సుధాకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ కొంత లెంగ్తీగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఆవుల వెంకటేష్ సీన్లను పరుగులు పెట్టించాడు. శంకరరావు, రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వరరావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా రాఘవరెడ్డి మూవీ గురించి చెప్పాలంటే.. కొత్తదనం లేని రెగ్యులర్ కథతో రూపొందింది. కానీ సినిమాకు తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్, భార్య, భర్తల మధ్య ఎమోషన్స్ హైలెట్‌గా నిలిచాయి. రాఘవరెడ్డి ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. సాంకేతిక నిపుణుల పనితీరు బాగుంది. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు సెంటిమెంట్ ప్రధానం సాగే సినిమాలను ఇష్టపడేవారికి రాఘవరెడ్డి తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X