twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Wanted Pandugadu Review కొంత కామెడీ, మరికొంత గ్లామర్‌తో.. మొత్తంగా ఎలా ఉందంటే?

    |

    Rating:
    1.5/5

    నటీనటులు: సుడిగాలి సుధీర్​, సునీల్, అనసూయ భరద్వాజ్, విష్ణు ప్రియ, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్​ రెడ్డి, పృథ్వీరాజ్, నిత్యా శెట్టి తదితరులు
    సమర్పణ: రాఘవేంద్ర రావు
    నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్​ కోవెలమూడి
    కథ, స్క్రీన్​ప్లే: జనార్ధన మహర్షి
    దర్శకత్వం: శ్రీధర్​ సీపాన
    ఎడిటర్: తమ్మిరాజు
    సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల
    సంగీతం
    విడుదల తేది: 19-08-2022

    వాంటెడ్‌ పండుగాడ్

    వాంటెడ్‌ పండుగాడ్

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తాజాగా సమర్పించిన చిత్రం వాంటెడ్‌ పండుగాడ్. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో స్మాల్ స్క్రీన్‌పై పాపులారిటీ సంపాందించుకున్న అనసూయ భరద్వాజ్, సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి, శకలక శంకర్‌తోపాటు సునీల్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి సప్తగిరి తదితరులు ఈ సినిమాలో నటించారు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలుగా వ్యవహరించారు. శుక్రవారం అంటే ఆగస్టు 19న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంతవరకు నవ్వించిందో చూద్దాం.

    కథ

    కథ

    పాండు అలియాస్ పండు సునీల్ చంచల్‌ గూడా జైలు నుంచి తప్పించుకుని నర్సాపురం ఫారెస్ట్‌లో దాక్కున్నాడని మీడియాలో వార్తలు వస్తాయి. మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌గా పేరొందని పండును పట్టుకున్న వారికి రూ. కోటి బహుమానంగా ప్రకటిస్తారు. ఈ వార్తలు చూసి పండును పట్టుకునేందుకు భిన్న నేపథ్యాలు, అవసరాలు కలిగిన సుధీర్‌ (సుడిగాలి సుధీర్‌), D (దీపికా పిల్లి), అఖిల్‌ చుక్కనేని వెన్నెల కిశోర్, విక్రమ్ రాథోడ్‌ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్‌ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) అడవిలో వెతుకుతుంటారు. మరి వారికి పండు దొరికాడా? వారిని పట్టుకునే క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి? పండుగాడు కాస్త పండు'గాడ్‌' ఎలా అయ్యాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ

    విశ్లేషణ

    జైలు నుంచి పండు తప్పించుకునే సన్నివేశంతో ప్రారంభమైన సినిమా సాదాసీదాగా సాగుతుంది. తర్వాత వచ్చే పాత్రలు, వాటి నేపథ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాటిని చూపించే తొలి సన్నివేశాలతో కథ అర్థమవుతుంది. అయితే కథనంలో ఇంకాస్త ఎక్కువగా కామెడీ పండించేందుకు ప్రయత్నిస్తే బాగుండేది. ఒక పర్టిక్యులర్‌ కథనం అంటూ ఏముండదు. ఈ పాత్రలన్ని పండును పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చే సిచ్యువేషనల్‌ కామెడీ తరహాలో ఉంటుంది. అంటే వాటిని చూస్తే జబర్ధస్త్ స్కిట్‌లు చూస్తున్నట్టే ఉంటుంది.

    రొమాంటిక్ ఫీల్‌

    రొమాంటిక్ ఫీల్‌


    ఇక యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌, విష్ణుప్రియ, దీపికా పిల్లి, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్‌లతో స్కిన్ షో చేయించారు. వారిని చూపించిన విధానం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హీరోయిన్స్‌ను చూపించే స్టైల్ కనిపిస్తుంది. అయితే ఆయన హీరోయిన్స్‌ను చూపిస్తే వచ్చే రొమాంటిక్ ఫీల్‌ వీళ్లతో రాకపోయిన తమ అందాలతో మాత్రం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'అబ్బ అబ్బ', 'కేక కేక' అనే పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సో ఈ విధంగా అటు కామెడీ, ఇటు గ్లామర్‌ రెండింటిని మ్యానేజ్ చేసే ప్రయత్నమైతే చేశారు.

    రెండు పాటలు తప్పితే

    రెండు పాటలు తప్పితే


    మరీ క్వాలిటీ కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేయొద్దు గానీ, వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్‌ కాంబినేషన్స్‌లో వచ్చే హాస్యం బాగా పండింది. బోయపాటి బాలయ్యగా శ్రీనివాస్ రెడ్డి చెప్పే డైలాగ్‌లు అలరిస్తాయి. సినిమాలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, పుష్ప, అఖండ వంటి తదితర హిట్ సినిమాల్లోని సన్నివేశాలను స్ఫూఫ్‌ చేసి కామెడీని నడిపించారు. రెండు పాటలు తప్పితే మ్యూజిక్‌ అంతగా ఎక్కదు. ఇక శ్రీధర్ సీపాన దర్శకత్వం పర్వాలేదనిపిస్తుంది.

    ఎలా నటించారంటే?

    ఎలా నటించారంటే?


    సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, విష్ణుప్రియ నటన బాగానే ఉన్నా సినిమాలో ఏదో మిస్ అయినా ఫీలింగ్‌ కలుగుతుంది. విష్ణుప్రియ, దీపికా పిల్లి అభినయంతో ఆకట్టుకోడానికి చేసిన ప్రయత్నం అంతగా వర్కౌట్‌ కాలేదనే చెప్పాలి. సినిమా మొత్తం తిరిగే పాత్ర పండుగా నటించిన సునీల్‌ ప్రారంభం, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌తోపాటు ఇంకో ఒక సీన్‌ తప్పితే పెద్దగా నటించే స్కోప్ లేదు. కానీ సునీల్ చేసిన రెండు ఫైట్ సీన్లు బాగుంటాయి.

    అనసూయ పాత్రకు

    అనసూయ పాత్రకు

    అనసూయ పాత్రకు కూడా పెద్దగా నటించే స్కోప్ లేదు. ఆమె అందాల ప్రదర్శన కోసమనే 'కేక కేక' అనే సాంగ్‌ పెట్టినట్టుగా ఉంది. తనికెళ్ల భరణి, ఆమనిల నటన బాగుంది. వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి సినిమాకు హైలెట్‌గా చెప్పవచ్చు. వారి కామెడీ టైమింగ్‌తో సెకండాఫ్‌ సరదాగా ఉంటుంది. బాలకృష్ణ తరహాలో శ్రీనివాస్‌ రెడ్డి చెప్పే డైలాగ్‌లు నవ్విస్తాయి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సినిమాల్లో కనిపించి చాలాకాలం అయింది. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి తనదైన కామెడీతో బాగా ఆకట్టుకున్నారు. అయితే మధ్య మధ్యలో ఆయనకు వేరేవారిచేత డబ్బింగ్ చేయించడం రుచించదు.

    ఫైనల్‌గా చెప్పాలంటే..

    ఫైనల్‌గా చెప్పాలంటే..

    ఇక సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి లేవు. కాబట్టి, పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళితే వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డిల హాస్యంతో బాగా నవ్వుకోచ్చు. ఇక హీరోయిన్ల అందాల ప్రదర్శన బీ, సీ సెంటర్ ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంది. కానీ 'వాంటెడ్ పండుగాడ్‌' థియేటర్‌లో చూసే అంతగా లేదు.

    English summary
    Sunil Anchor Anasuya Bharadwaj Sudigali Sudheer Deepika Pilli Starrer Wanted PanduGod Telugu Movie Review And Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X