Rahasyam Idam Jagath Review: రహస్యం ఇదం జగత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల తదితరులు
రచన, దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
సినిమాటోగ్రఫి: టేలర్ బ్లూమెల్
మ్యూజిక్: గ్యాని
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
కథా రచయిత: రవితేజ నిట్ట
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX: హ్యూ పిక్చర్స్/హేమంత్
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2024-11-09
అమెరికాలో స్థిరపడిన అభి (రాకేష్) అకీరా (స్రవంతి) ప్రేమించుకొంటారు. అయతే ఓ కారణంగా తన తల్లి వద్దకు వెళ్లాలని అకీరా నిర్ణయం తీసుకోవడంతో ఆమెతోపాటు అభి కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకొంటాడు. ఇండియాకు వెళ్లే ముందు స్నేహితులతో ఓ వెకేషన్ ప్లాన్ చేసి ఫ్రెండ్స్ అంతా కలుస్తారు. ఆ పార్టీకి అకీరా మాజీ ప్రియుడు విశ్వ కూడా వస్తాడు. అకీరా విషయంలో అభి, విశ్వకు వాగ్వాదం జరుగుతుంది. ఆ గొడవలో అకీరాను, మరో స్నేహితుడిని విశ్వ చంపేస్తాడు.

అమెరికా వదలి అకీరా ఇండియాకు ఎందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నది? విశ్వ, అకీరా లవ్ స్టోరీలో బ్రేకప్ ఎందుకు ఏర్పడింది. అకీరాను విశ్వ చంపేసిన తర్వాత ఏం జరిగింది? ఈ కథకు శ్రీ చక్రం అన్వేషణకు సంబంధం ఏమిటి? అసలు ఈ స్టోరీలోని పాత్రలకు వామ్ హోల్ థియరీ కనెక్షన్ ఏమిటి? అసలు వామ్ హోల్ థియరీ అంటే ఏమిటి? టైమ్ ట్రావెల్ ఎందుకు చేయాలనుకొన్నారు? శ్రీ చక్రం కోసం అన్వేషణ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రహస్యం ఇదం జగత్ సినిమా కథ.
ప్రజెంట్ జనరేషన్ కథను పురాణాలకు జోడించి ఓ టైమ్ ట్రావెల్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలనే పాయింట్‌తో దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ చేసిన ప్రయత్నం అభినందించాలి. కానీ ఆ సినిమా కథను సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా ఉంటే.. వినోదం, అనుభూతితోపాటు నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ కూడా అయ్యేదనిపిస్తుంది. కోమల్ అటెంప్ట్ చేసిన పాయింట్ చాలా కొత్తదే కానీ.. దానిని ప్రజెంట్ చేయడంలో సరైనా పంథాను అనుసరించలేదనే విషయం సినిమా ఆరంభంలోనే అర్ధమవుతుంది. సైన్స్, ఫిక్షన్ లాంటి అంశాలపై నడిచే కథను సులభంగా అర్ధమయ్యేలా చెప్పడంలో దర్శకుడు తడబాటు పడ్డారని చెప్పవచ్చు.
పురాణాల్లో దేవతలు 14 లోకాలు చుట్టు వచ్చారనే విషయం మనం అనేక కథల్లో విన్నాం. ఆ టైమ్ ట్రావెల్ ఎలా జరిగింది? అనే ఇప్పటికీ ఓ రహస్యమే. అలాంటి మిస్టరీ ఎలిమెంట్స్‌ను ఆధారంగా చేసుకొని శ్రీ చక్రం అన్వేషణ అంశాలు వినడానికి కథగా బాగున్నాయి. అలాంటి విలువైన సమాచారాన్ని స్క్రీన్ మీదకు తెచ్చే విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంటుందనిస్తుంది. ఏది ఏమైనా బియాండ్ లెవెల్‌లో ఆలోచించిన విదానం ప్రశంసనీయం.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నటించిన వారందరూ కొత్తవాళ్లే. అయినా అనుభవం ఉన్న యాక్టర్లుగా నటించారు. అలాగే ఫెర్ఫార్మెన్స్ లెవెల్స్‌లో మెచ్యురిటీ కనిపించింది. ప్రతీ యాక్టర్‌లో బెస్ట్ ఇవ్వాలనే తపన కనిపించింది. ఇక ఈ సినిమాకు సాంకేతిక నిపుణుుల పనితీరు చాలా బాగుంది. టెక్రికల్‌గా బ్రిల్లియెంట్ ఎఫర్ట్స్ సినిమాలో కనిపించాయి.
ఏది ఏమైనా, మూస, రొటీన్ సినిమాల మధ్య ఇది ఓ డిఫరెంట్ మూవీ. క్వాంటమ్ ఫిజిక్స్, భారతీయ పురాణాలు, మిస్టరీ అంవాలను జోడించిన చిత్రం. కాకపోతే కామన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రూపొందించాల్సింది. ఎక్కువగా డైలాగ్స్ ఇంగ్లీష్‌లో ఉండటం వల్ల మంచి సన్నివేశాలు అర్ధం కాక డిస్ కనెక్ట్ అయ్యారనే మాట బయట వినిపించింది. డిఫరెంట్ సినిమాలు చూడాలనే వాళ్లు రహస్యం ఇదం జగత్ చూస్తే ఓ డిపరెంట్ ఎక్స్‌పీరియెన్స్ పొందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











