twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NET movie reivew: బూతులతో రెచ్చిపోయి ప్రమోట్ చేసిన సినిమా.. ఎలా ఉందంటే?

    |

    2.5/5

    రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందించిన తాజా మూవీ నెట్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ కారణంగా ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది, ఈ ఇంటర్నెట్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువైతే నష్టాలు ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ సమస్యల చుట్టూ అల్లుకొన్న సినిమాగా రూపొందించిన నెట్ గురించి రాహుల్ రామకృష్ణ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ముందు నుంచి కూడా సైలెంట్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆయన బూతులతో ఈ సినిమా ప్రమోషన్స్ ని చేయడంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది. మరి ఇంత హైప్ పెంచిన ఈ సినిమా ఎలా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    నెట్ కథేంటంటే

    నెట్ కథేంటంటే

    లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో మొబైల్ షాప్ నడుపుతుంటాడు. భార్య సుచిత్ర(ప్రణీత పట్నాయక్) అంటే అతనికి ఎక్కువగా ఇష్టం ఉండదు. అరేంజ్డ్ మ్యారేజ్ కావడంతో ఆమె ఊరిదని భావిస్తూ ఆమెతో ఎప్పుడూ సఖ్యంగా ఉండటానికి ప్రయత్నించడు. స్వయంగా లక్ష్మణ్ మొబైల్ షాప్ నడుపుతూ ఉండడంతో మొబైల్ ఇంటర్నెట్ కి అడిక్ట్ అవుతాడు, మరోపక్క హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్లో ప్రియా,(అవికా గోర్), రంజిత్(విశ్వజిత్) ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. అయితే అశ్లీల చిత్రాలకు అలవాటు పడిన లక్ష్మణ్, అశ్లీల చిత్రాల నుంచి లైవ్ క్యాం ద్వారా ఎవరి ఇళ్లలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకునే పనిలో పడతాడు. అలా అవి చూడడం కోసం అప్పుల పాలు అవుతాడు కూడా, అలా చూస్తూ ఉన్న క్రమంలోనే ప్రియా, రంజిత్ ఇద్దరి సన్నిహిత దృశ్యాలు కూడా కనబడతాయి, అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రియా సూసైడ్ అటెంప్ట్ చేయగా లక్ష్మణ్ లైవ్ లో చూస్తూ ఆపడానికి ప్రయత్నిస్తాడు. మరి లక్ష్మణ్ ఆ సూసైడ్ ను ఆపాడా? అసలు లక్ష్మణ్ ప్రియకి ఏం చెప్పాలనుకున్నాడు? అనేదే కథ.

    నెట్ సినిమాలో ట్విస్టులు

    నెట్ సినిమాలో ట్విస్టులు

    సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథ ఏమిటి అనేదానిమీద దర్శకుడు ఒక రకమైన క్లారిటీ తీసుకువస్తాడు. పల్లెటూరిలో మొబైల్ షాప్, ఆ మొబైల్ షాప్ నడుపుతూనే అశ్లీల దృశ్యాలలకు అలవాటు పడిన వ్యక్తి, అనే లైన్ తో తీసుకువెళ్లి ప్రేక్షకులకు ఎక్కడా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరమే లేకుండా చేశాడు, అశ్లీల దృశ్యాలకు అలవాటు పడిన వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది, అతను ఆడవాళ్లను చూసే చూపు ఎలా ఉంటుంది అనే విషయాలను దర్శకుడు హైలెట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఒంటరిగా ఉన్నా అనుకుంటున్న సమయంలో కూడా ఒంటరిగా లేమని ఎవరో మనల్ని గమనిస్తూ ఉంటారని ఈ విషయాన్ని చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. అసలు లక్ష్మణ్ ప్రియతో మాట్లాడాలని ఎందుకు అనుకున్నాడు? ప్రియను మోసం చేసింది ఎవరు? చివరికి లక్ష్మణ్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నెట్.

    సినిమా ఎలా ఉందంటే

    సినిమా ఎలా ఉందంటే

    ఈ సినిమా పూర్తిగా ఓటీటీ కోసమే రూపొందించబడింది. రెండు వేరు వేరు జంటలు, భిన్న స్థితిగతులకు చెందిన వారి ఇ జీవితాల నుంచి దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు, నల్గొండ జిల్లాలో మారుమూల పల్లెటూరిలో బతికే లక్ష్మణ్ కి హైదరాబాద్ లో చాలా సెక్యూర్డ్ జీవితం గడుపుతున్నానని ఊహల్లో ఉండే ప్రియ లైఫ్ మొత్తం సీసీ కెమెరాలో కనబడుతుంటుంది. ఒక రకంగా ప్రియను రోజు చూడటం అలవాటు పడిన లక్ష్మణ్ ప్రియ ను చూడటం కోసమే లక్షలు ఖర్చు పెట్టే స్థితికి చేరుతాడు, ఇల్లు పెళ్ళాం ఏమి పట్టించుకోకుండా కేవలం ప్రియ ఏం చేస్తుంది? ప్రియా ఎలా ఉంది అనే విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటాడు. చివరికి ప్రియ ఆత్మహత్య చేసుకునే స్థితిలో లక్ష్మణ్ ఏం చేశాడు అనే విషయాన్ని చూపడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

    దర్శకుడి టేకింగ్ ఎలా ఉందంటే

    దర్శకుడి టేకింగ్ ఎలా ఉందంటే

    దర్శకుడు రాసుకున్న పాయింట్ కరెక్ట్ గానే ఉంది కానీ దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం విషయంలో తన పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఒకచోట డబ్బులు మోసపోయినట్లు చూపించాడు మోసపోయిన తర్వాత కూడా మోసం అర్థం చేసుకోకుండా ఇంకా దాని వెనకే పడుతున్నట్లుగా చూపించడం కాస్త సందర్భోచితంగా లేదనిపిస్తోంది. అలాగే సినిమా ముగింపులో కూడా అసంపూర్తిగా వదిలేసిన ఫీలింగ్ ఉంది, సినిమా టేకింగ్ పరంగా మిగతా అన్ని విషయాల్లోనూ చాలా శ్రద్ధ పెట్టిన దర్శకుడు సినిమా ముగింపు విషయంలో మాత్రం ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోయాడు అనిపించింది. ముందు నుంచి ఓటీటీకి అనుకుంటున్న సినిమా కాబట్టి కాస్త బెడ్రూం సీన్లు, లిప్ లాక్లు కూడా పెట్టి యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు.

    రాహుల్ రామకృష్ణ అవికా గోర్ నటన ఎలా ఉందంటే

    రాహుల్ రామకృష్ణ అవికా గోర్ నటన ఎలా ఉందంటే

    కమెడియన్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయమైన రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఎలాంటి పాత్రలో ఒదిగి పోయి నటించగలరు అనే విషయాన్ని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ రాహుల్ రామకృష్ణ అనే వ్యక్తి మనకు గుర్తుకు రాడు, కేవలం లక్ష్మణ్ మొబైల్ షాప్ ఓనర్ అనేభావనలోనే ఉంటాం అంతలా పాత్రలో ఒదిగిపోయిన రాహుల్ రామకృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు అనిపించింది. ఇక అవికా గోర్ నటన కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు దూరం అయిన ఈ భామ మళ్ళీ ఈ సినిమాలో తనదైన నటనతో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది.

      మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    కేరాఫ్ కంచరపాలెం సినిమా లో తళుక్కున మెరిసిన ప్రణీత పట్నాయక్ ఈ సినిమాలో లక్ష్మణ్ భార్య సుచిత్ర పాత్ర చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అచ్చమైన తెలంగాణ ఆడపిల్లలా నటించి తనదైన నటనతో మెప్పించింది. ఇక విశ్వజిత్ కూడా చేసింది చిన్న పాత్రే అయినా తెరమీద కనిపించినంత సేపు తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ తో కనిపించిన విష్ణు ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది చాలా ఈజ్ తో నటించాడు అని చెప్పవచ్చు.

    సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే

    సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే

    ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సంగీతం కూడా బాగా కుదిరింది. అయితే పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పని చేసిందని చెప్పవచ్చు. అయితే దర్శకుడి తప్పిదమో లేక ఎడిటర్ తప్పిదమో తెలియదు కానీ చివరి కంక్లూజన్ విషయంలో అలాగే కొన్ని కొన్ని సీన్లు విషయంలో కాస్త సందిగ్దత పరిస్థితులు ఏర్పడతాయి. మరోపక్క మధా సినిమాలో సినిమాటోగ్రఫీ చేసి ప్రశంసలు అందుకున్న అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా సూట్ అయింది. ఇక నిర్మాతల నిర్మాణ విలువలకు ఎలాంటి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు.

    ఫైనల్ గా చెప్పాలంటే

    ఫైనల్ గా చెప్పాలంటే

    ఇక ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలి అంటే ఈ జనరేషన్ వాళ్ళు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. కాస్త బోల్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది సింగిల్ గా ఉన్నప్పుడు చూడటమే బెటర్, వయసుతో సంబంధం లేకుండా అశ్లీల దృశ్యాలు ఎలా అడిక్ట్ అవుతున్నారు, దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అనే విషయాలను దర్శకుడు స్పృశించాడు. మొత్తం మీద నెట్ సినిమా ఒక్కసారి ఫ్యామిలీలతో కాకుండా ఏ సర్టిఫికెట్ కావడంతో జాగ్రత్తలు తీసుకుని చూడవలసిన సినిమా.

    Recommended Video

    Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
     నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అవికా గోర్, ప్రణీత పట్నాయక్, విశ్వ దేవ్, విష్ణు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: భార్గవ్ మాచర్ల
    నిర్మాతలు: రాహుల్ తామాడ, సాయిదీప్ రెడ్డి బొర్రా
    సంగీతం: నరేష్ కుమరన్
    డిఓపీ: అభిరాజ్ నాయర్
    ఎడిటర్: రవితేజ
    ప్రొడక్షన్ హౌజ్: తామాడ మీడియా
    ఓటీటీ : జీ5 యాప్

    English summary
    Rahul ramakrishna - avika gor starrer 'NET' movie released in Zee5 App, here is the review in telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X