Raid 2 Movie First Review: రైడ్ 2 హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రైడ్ 2 (Raid 2). 2018 సంవత్సరంలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి ప్రముఖ క్రిటిక్ వెల్లడించిన రివ్యూ, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
రైడ్ సినిమా కథ విషయానికి వస్తే.. అమయ్ పట్నాయక్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) ఆఫీసర్. అవినీతి పరుల నివాసాలు, ఆఫీసులపై దాడి చేసిన నికార్సైన అధికారి. సుమారుగా 4200 కోట్ల రూపాయల డబ్బును రైడ్‌లో పట్టుకొంటాడు. తన కెరీర్‌లో 75వ రైడ్‌ను అవినీతి రాజకీయ వేత్త దాదా మనోహర్ భాయ్ (రితేష్ దేశ్‌ముఖ్) ఇంటిపై ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో అమయ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? దాదా మనోహర్ ఎలాంటి ఎత్తులు వేశాడు? వాటికి అమయ్ పట్నాయక్ ఎలాంటి ఎత్తుగడలు పన్నాడనేది సినిమా కథ.

రైడ్ సినిమాకు అత్యున్నత టెక్నిషియన్స్, ఆర్టిస్టులు వర్క్ చేశారు. తమిత్ త్రివేది బీజీఎం, యోయో హానీసింగ్ పాటలు అందించారు. సుధీర్ కే చౌదరీ సినిమాటోగ్రఫి, సందీప్ ఫ్రాన్సిస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఈ సినిమాలో రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాథక్ నటించగా, మిల్కి బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ నషాలో నటించారు. అలాగే జాక్వలైన్, యోయో హానీ సింగ్ మరో స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారు.
రైడ్ 2 సినిమాలోని పలు సన్నివేశాలు, డైలాగ్స్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని రాజకీయపరమైన విమర్శలను తొలగించాలని సూచించింది. ఇక ఈ మూవీలో 8 నిమిషాలపాటు అజయ్ దేవగన్ చెప్పే డైలాగ్‌పై సెన్సార్ కత్తెర వేసింది. పొలిటిషియన్స్ టార్గెట్ చేసే విధంగా ఉన్న కొన్ని డైలాగ్స్‌ను బీప్ చేయాలని సూచించింది.
ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న రైడ్ 2 సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ ప్రివ్యూ దుబాయ్‌లో ఇటీవల పూర్తయింది. ఈ సినిమాను దుబాయ్ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ తాజాగా ఈ సినిమాను చూసినట్టు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన కెరీర్‌లో అతి పెద్ద హిట్ సాధించబోతున్నాడు అని ఆయన జోస్యం చెప్పాడు.
రైడ్ 2 సినిమాలో అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవగన్ తన కళ్లతోనే పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించనున్నాడు. తనదైన మార్క్ పంచ్‌లైన్ డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. సినిమాలో తన కళ్లతోనే తన నటనను డెలీవరి చేశాడు. అతడికి పోటా పోటీగా రితేష్ దేశ్‌ముఖ్ నటించాడు. ఇద్దరు నువ్వా? నేనా అనే విధంగా నటన విషయంలో పోటీ పడ్డారనే అభిప్రాయం కలుగుతుంది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు.
రైడ్ సినిమాలో అవినీతిపరుడైన రాజకీయ నేత దాదా మనోహర్ భాయ్‌గా రితేష్ దేశ్‌ముఖ్ నటించాడు. అజయ్ దేవగన్ రేంజ్ తగిన విధంగా టప్ ఫైట్ చేశాడు. కథలో ఆద్యంతం ఆకట్టుకొనే డ్రామా ఉంటుంది. దాని కారణంగా తెరకు అతుక్కుపోయి.. మరుక్షణం ఏం జరుగుతుందనే ఆసక్తితో ప్రేక్షకుడు చూస్తాడు అని ఉమేర్ సంధూ రివ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మ్ బీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











