twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వద్దు ఫో!('రెయిన్ బొ' రివ్యూ)

    By Staff
    |

    Rainbow
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ : శ్రీ సిద్దార్ధ మూవీస్
    తారాగణం: రాహుల్,సోనాలి చౌహన్,సింధు మీనన్,గొల్లపూడి మారుతీరావు,
    పరుచూరి వెంకటేశ్వరరావు,ప్రకాష్ రాజ్,లేట్ మల్లికార్జునరావు,ధర్మవరపు సుబ్రమణ్యం,
    సునీల్,శివారెడ్డి,ఎమ్.ఎస్.నారాయణ,కొండవలస,మాస్టర్ భరత్ తదితరులు.
    సంగీతం: నిహాల్
    ఎడిటింగ్: వర్మ
    ఆర్ట్ :ఆనందసాయి
    కథ: బలబద్రపాత్రుని రమణి
    స్క్రీన్ ప్లే,డైలాగులు :పరుచూరి బ్రదర్స్
    కెమెరా :సంతోష్ శ్రీనివాస్
    కొరియాగ్రఫి:సుచిత్రా చంద్రబోస్
    నిర్మాత-దర్శకత్వం:వి.యన్.ఆదిత్య
    రిలీజ్ డేట్: అక్టోబర్ 2, 2008

    'మనసంతా నువ్వే' వంటి హిట్టిచ్చిన వి.యన్.ఆదిత్య నుంచి వచ్చే ప్రేమ కథ,అందులోనూ పొయిటిక్ టచ్ ఉన్న టైటిల్ అంటే ఏవేవో ఊహించుకుని వెళ్ళే ప్రేక్షకులకు అంత సీన్ లేదంటూ వెక్కిరించే సినిమా రెయిన్ బొ. హాంకాంగ్ సినిమాకు హైదరాబాద్ ట్రీట్ మెంట్ సరిపడకపోవటంతో కిచిడీలా తయారైన ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేసినప్పటికీ వారికసలు ఈ సినిమా రిలీజయిందా అన్న రీతిలో విడుదలయింది. అవకాశముంటే ఎవాయిడ్ చెయ్యాల్సిన ఈ సినిమాలో టైటిల్ జస్టిఫికేషన్,అసభ్యత లేకపోవటమనేవే ప్లస్. ఆ మాత్రం చాలనుకునేవారికి ఈ సినిమా ఆహ్వానం పలుకుతుంది.

    పెయింటర్ కమ్ అనాధ అయిన శ్యామ్(రాహుల్) కి స్వప్న(సోనాలి చౌహాన్) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే హీరోయిన్ కావాలనే జీవితాశయంతో ఉన్నామెతో ఆ విషయం చెప్పడు. అయితే స్వప్న..స్వప్నం నెరవేర్చటానికి ప్రక్కింటి మూగమ్మాయి కమల(సింధు మీనన్) దగ్గర నుండి డబ్బు అప్పుతీసుకుని మరీ కష్టపడుతూంటాడు. అలాగే కమల కూడా యధాశక్తి మూగ ప్రేమతో శ్యామ్ కి సాయం చేస్తూంటుంది. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుండగా స్వప్న కి ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చేస్తుంది. మరో ప్రక్క శ్యామ్ కి ఏక్సిడెంట్ అయి కలర్ బ్లైండ్ నెస్ వచ్చేస్తుంది. అప్పడతని ప్రపంచం అంతా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోతుంది. అయితే స్వప్న మాత్ర కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఓపిక చేసుకుని సినిమా ఫినిష్ చేయాల్సిందే.

    పర పర సుకరో అనే హాంకాంగ్ సినిమా ఆధారంగా తయారైన ఈ సినిమా కథ కి తెలుగు నేటివిటీ అద్దే క్రమంలో ఎడాప్షన్ సరిగా కుదరకపోవటంతో సహన పరీక్షగా ప్రేక్షకుడికి అనుభవమయ్యింది. రొటీన్ క్లైమాక్స్ అయితే పరమ బోర్. అయితే ఒక్క విషయంలో డైరక్టర్ ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు హైద్రాబాద్ వచ్చి సినీ హీరోయిన్ అవటం తెలుగు ఫీల్డులో చాలా ఈజీ అనేది చెప్పినందుకు. ఎందుకంటే ఆ పాత్ర చేసిన అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి కాదు. అంటే ఆయన కూడా ఎంకరేజ్ చేయడు. ఇక ఈ సినిమాలో కామెడీ పార్టుని బాగా నెగ్లెట్ చేసారు. రాహుల్ ఒక్కడే సినిమా మొత్తాన్ని మేసుకువెళ్తాడు అని బావించటం మరో మైనస్. ఉన్నంతలో గొల్లపూడి,పరుచూరి వెంకటేశ్వరరావు లు ఉన్నకాసేపయినా బాగా చేసారు. శివారెడ్డి మిమిక్రి ట్యాలెంట్ ని (డాన్సింగ్ అండ్ ఏక్టింగ్ స్కూల్ ఇనస్ట్కక్టర్ పోస్ట్ లో) చూపి మాత్రం బాగా వినియోగించుకున్నారు. అలాగే శ్రీను వైట్ల, కోడి రామకృష్ణ, రాజమౌళి ని డైరక్టర్స్ గానే చూపటం బాగుంది.పాటలు వినటానికి బాగున్నాయి...మరింత బాగా తీసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలగచేసాయి. డైలాగులు కొన్ని బాగానే పేలాయి. ప్రకాష్ కనిపించింది కొద్ది సేపేనయినా తనేంటో మరోసారి చూపించాడు. ఇలా ఇందరూ చక్కగా చేసినా దర్శకుడుగా వి.యన్.ఆదిత్య ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించటానికి కారణంసినిమాకు సరిపడ విషయం లేనికథ,కథనం, పాత కాలం నాటి టేకింగ్.

    ఫస్ట్ ఆఫ్ బోరు..సెకండాఫ్ జీరో అనిపించే ఈ సినిమాకు క్లైమాక్స్ నీచమై నిలివటం జరిగింది. అయితే ఏ సినిమా అయినా ఫరావాలేదు... కాస్సేపు నిద్రపోవటానికి అనుకున్న వారికి మాత్రం మోర్ సజెస్ట్ బుల్. ఎందుకంటే...వాయిద్యాల హోరు చాలా తక్కువగా ఉంది. ట్రై చేయండి..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X