»   » సూపర్ మామ...లోఫర్ అల్లుడు (‘సినిమా చూపిస్త మావ’ రివ్యూ)

సూపర్ మామ...లోఫర్ అల్లుడు (‘సినిమా చూపిస్త మావ’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
అల్లుడు, మామ లేదా అత్త..అల్లుడు మధ్య ఛాలెంజ్ తో నడిచే కథలు ఆ మధ్యన అంటే ఓ పదిహేనేళ్ల క్రిందటి వరకూ తెలుగు తెరని ఊపేసాయి. ఈ మధ్యన కూడా ఓ ఇంటిలో హీరో చేరి విలన్ ని ఫూల్ చేయటం జరుగుతూ వస్తోంది. అలాంటి కథల్లో ఎంటర్టైన్మెంట్ కు చోటు ఉంటుంది. ముఖ్యంగా సెటప్ కు పెద్ద ఖర్చు ఉండదు. దాంతో ఇలాంటి కథతో ఈ టీమ్ రెడీ అయ్యింది. అయితే దర్శకుడు హీరో,హీరోయిన్, హీరోయిన్ తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు గత చిత్రాల్లో వచ్చినవి మార్చి రెడీ చేసినట్లు అనిపిస్తుంది. కాకపోతే కామెడీతో నడుస్తుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. మరికొన్ని ట్విస్టులు, టర్న్ లు కథనంలో పెట్టుకుని ఉంటే మరింత ఇంట్రస్టింగ్ గా ఖచ్చితంగా ఉండేది. హీరో రాజ్ తరుణ్ మాత్రం మంచి ఎనర్జీతో చాలా సీన్లు అలవోకగా లాక్కెళ్లిపోయాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కత్తి (రాజ్ తరుణ్) ఇంటర్ కూడా పాస్ కాని ఓ లోఫర్. ఖాళీగా ఉండటం ఎందుకునుకున్నాడో ఏమో...ప్రణీత (అవికా గోర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా సర్లే కుర్రాడు కష్టపడుతున్నాడు అని కొద్ది కాలానికి అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఆమె ఇతకి రివర్స్ ...ఇంటర్ స్టేట్ రాంకర్. సర్లే ఇంతవరకూ బాగానే ఉంది మామ అంటే...ఆమె తండ్రి ఎవరూ అంటే.... తండ్రి సోమనాధ్ ఛటర్జీ(రావు రమేష్) చాలా స్ట్రిక్ట్...ఆయన మెడికల్ కౌన్సిల్ లో డిఫ్యూటీ సెక్రటరీ గా చేస్తూంటారు. జీవితంలో ప్రతీది హై క్వాలిటీ కోరుకునే వ్యక్తి. అలాంటి వాడు తన కూతురుని ఇలాంటి లోఫర్ కి ఇవ్వటానికి ఒప్పుకుంటాడా...,ససిమేరా కాదంటారు..అలాగని కూతురు మనస్సుని నొప్పించలేదు..అప్పుడు తెలివిగా ...ఓ కండీషన్ పెడతాడు. తన కూతురు చెయ్యి పట్టుకోవాలంటే...తన కుటుంబాన్ని ఓ నెల పాటు సర్వ ఖర్చులూ భరించాలని, అదీ కత్తి సొంత ఆదాయంతో అని షరతు పెడతాడు. అప్పుడు కత్తి ఏం చేసి ఆ డబ్బు సంపాదించాడు...ఈ క్రమంలో అతనికి ఏం ట్విస్ట్ లు పడ్డాయి. చివరకు ఆమె ను ఎలా పొందాడు అనేది మిగతా కథ.


బొమ్మరిల్లు, టామ్ అండ్ జెర్రీ టైపు కధాంశాలు ఎప్పుడూ వెండితెరపై చూడటానికి బాగానే ఉంటాయి. అలాంటి సక్సెస్ ఫుల్ ఫార్ములాతో కూడిన కథాంశాన్నే దర్శకుడు ఎంచుకుని వినోదం పండించటానికి ప్రయత్నించాడు. రఫ్‌గా ఉండే ఓ మాస్‌ కుర్రాడు ఓ చదువుల సరస్వతిలాంటి అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ కథని అల్లారు. అంతవరకూ బాగానే ఉంది. ఇలాంటి కథలు మంచి ట్రీట్ మెంట్ అవసరం. అక్కడే కొద్దిగా తడబడ్డారు.అలాగే మొదటే చెప్పుకున్నట్లు ఈ మాస్ ఎంటర్టైనర్ లో సీన్లు ఎక్కడో చూపినట్లు అనిపించటమే మైనస్. అందుకు కారణం రొటీన్ గా ఉండే సెటప్ నే ఎంచుకోవటం. అయితే మాస్ డైలాగ్స్, కామెడీ సీన్లు, ఫాస్ట్ పేస్ తో ఆ లోపాన్ని కొంతవరకూ అధిగమించే ప్రయత్నం చేసాడు.


ఫస్టాఫ్ ..లవ్ ట్రాక్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ కు వచ్చేసరికి...హీరో తన మామ ఇచ్చిన ఛాలెంజ్ నెరవేర్చే క్రమంలో వచ్చే సన్నివేశాల్లో వేడి తగ్గినట్లు అయ్యి కథనం డ్రాప్ అయ్యింది. దానికి కారణం మామ సైడు నుంచి ఎప్పుడు ఇరుక్కుపోవటమే కానీ హీరోని పెద్దగా ఇరికించే ప్రయత్నం చేయకపోవటం. అయితే క్లైమాక్స్ కు వచ్చే సరికి రొటీన్ అనిపించినా సర్దుకున్నారు.


Raj Tarun's 'Cinema Chupista Mava' telugu movie review

ఇక కాంబినేషన్ విషయానికి వస్తే...ఉయ్యాల జంపాల పెయిర్ రాజ్ తరుణ్, అవికా గోర్ నటించిన చిత్రం అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజే ఉంది. అది కొంతవరకూ ఓపినింగ్స్ కు వర్కవుట్ అవుతుంది. అందులోనూ రేసుగుర్రంలో పాపులరైన ‘సినిమా చూపిస్త మావ' పాట ని టైటిల్ గా పెట్టడంతో అందరి దృష్టీ ఈ సినిమా వైపు తిరిగింది. మరి టైటిల్, కాంబినేషన్ సెట్ చేసిన ఈ టీమ్ కథ ని, కథనం ని కూడా మరింత క్రేజీగా రెడీ చేసి ఉంటే బాగుండేది.

హీరోగా రాజ్ తరుణ్ ...ఓ రోడ్ సైడ్ రోమియోగా, లవర్ బోయ్ గా , మాస్ హీరో లక్షణాలతో మంచి ఎనర్జీతో చేసాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలవరీ బాగా ప్లస్ అయ్యింది. అవికా గోర్ మన ప్రక్కింటి అమ్మాయి లేదా మన వీధిలో అమ్మాయి అనిపిస్తుంది. రావు రమేష్ ఎప్పటిలాగే మంచి ఫెరఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. పోసాని, కృష్ణ భగవాన్, ప్రవీణ్, వంటి వారు స్పెషల్ కాదు కానీ తమ సీనియార్టీతో నడిపించేసారు.


మిగతా విభాగాలు విషయానికి వస్తే..... శేఖర్ చంద్ర మాస్ ట్యూన్స్ తో బాగానే అలరించాడు. అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయించుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ విలువలు కూడా సినిమా కు తగ్గట్లు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టారు. ఓ రిచ్ లుక్ ఉన్న సినిమా చూసినట్లుంది.


బ్యానర్ : ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, లక్కీ మీడియా
నటీనటులు : రాజ్‌ తరుణ్‌, అవికాగోర్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సంపూర్ణేష్ బాబు, కృష్ణ భగవాన్, ప్రవీణ్, జయలక్ష్మి, సత్య, సన్ని, టి మధు, మాధవి, రంజిత తదితరులు
మాటలు : ప్రసన్నకుమార్‌
సంగీత దర్శకుడు : శేఖర్‌చంద్ర,
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్, దాశరథి శివేంద్ర
సమర్పణ :అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌, ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌
నిర్మాతలు :బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌, రూపేష్‌ డి.గోవిల్‌, జి.సునీత
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రినాథరావు నక్కిన దర్శకుడు.
విడుదల తేదీ : ఆగస్టు 14, 2015.---------------------------------


ఫైనల్ గా టైమ్ పాస్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు....అవికా గోర్ అభిమానులకు కూడా ఇది చూడదగ్గ సినిమానే


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Raj Kiran and Avika Gor’s ‘Cinema Choopistha Mava’ released today with average talk. Directed by Trinadh Rao Nakina, music scored by Shekar Chandar. Rao Ramesh, Krishna bhagawan, Brahmanandham, Sapthagiri, Posani Krishna Murali were the main lead cast of Cinema Chupista Mava. Cinema Chupista Mava is jointly produced by Aaryath Cine Entertainments and Lucky Media.
Please Wait while comments are loading...