‘లవర్’ మూవీ రివ్యూ: కొత్తదనం లేని ప్రేమకథ!

By Bojja Kumar

Recommended Video

Lover Movie Twitter Review లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ

Rating:
2.5/5
Star Cast: రాజ్ తరుణ్, రిద్దికుమార్, రాజీవ్ కనకాల, అజయ్
Director: అనీశ్ కృష్ణ

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్ సినిమాలతో రాజ్ తరుణ్ ఇటు యూత్‌లోనూ అటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశ పరిచినా.... రాజ్ తరుణ్ తాజా మూవీ 'లవర్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం సక్సెస్‌ఫుల్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు బేనర్ ఈ సినిమా నిర్మించడమే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథలోకి వెళితే...

కథలోకి వెళితే...

రాజ్ (రాజ్ తరుణ్) కస్టమైజ్డ్ బైక్ డిజైనర్. ఎవడో తయారు చేసిన బైక్ నేనెందుకు వాడతాను.... బైక్ అయినా లైఫ్ అయినా నాకు ఇష్టమైనట్లు మార్చుకుంటాను అనే మనస్తత్వం. రాజ్ అన్నయ్య(రాజీవ్ కనకాల) లోకల్ గ్యాంగ్‌స్టర్ దగ్గర పని చేస్తుంటాడు. ఓ చిన్న గొడవలో బుల్లెట్ గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన రాజ్ అక్కడ నర్సుగా పని చేస్తున్న చరిత(రిద్దికుమార్) ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతోంది ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది అనుకునే సమయంలో ఊహించని షాక్. హీరో అన్నయ్యను చంపేసి చరితను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. దీని వెనక అసలు స్టోరీ ఏమిటి? హీరో తన లవర్‌ను ఎలా కాపాడుకున్నాడు అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

రాజ్ తరుణ్ ఈ చిత్రంలో పోనీటెయిల్‌తో కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపించాడే తప్ప... అతడి గత సినిమాలతో పోలిస్తే నటన పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. రిద్ది కుమార్ క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంది. నటన పరంగా ఫర్వాలేదు. హీరో అన్నయ్య పాత్రలో రాజీవ్ కనకాల, విలన్ పాత్రలో సచిన్ ఖేడేకర్, అజయ్, హీరో ఫ్రెండ్ పాత్రల్లో ప్రవీణ్, సత్యం రాజేష్ తదితరులు వారి పరధి మేరకు నటించారు.

టెక్నికల్ అంశాల పరంగా..

టెక్నికల్ అంశాల పరంగా..

సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా కేరళలోని అలప్పిలో జరిగే ఎపిసోడ్, ‘అద్భుతం' సాంగ్ పిక్చరైజ్ బావుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది. తనీశ్‌, అంకిత్ తివారి, సాయికార్తీక్, జె.బి అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్. రెండు పాటలు బావున్నాయి. దిల్ రాజు బేనర్ నుండి వచ్చిన సినిమా కాబట్టి నిర్మాణ విలువల పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు.

అనీశ్ కృష్ణ దర్శకత్వం

అనీశ్ కృష్ణ దర్శకత్వం

‘అలా ఎలా' ఫేం అనీశ్ కృష్ణ ‘లవర్' చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించారు. మైనస్ పాయింట్లలో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు రాసుకున్న కథే. పరమ రోటీన్ కథను ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేశాడు. స్క్రీప్లేతో కూడా ఆసక్తికరంగా లేదు. సస్సెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, గట్టిగా నవ్వుకునే ఫన్ సీన్లు కానీ ఒక్కటీ లేదు. ఇవేవీ లేక పోయినా ప్రేక్షకుడు ట్విస్టులతో కాస్త సంతృప్తి పడదామన్నా అక్కడ కూడా నిరాశ పరిచాడు. ఆడియన్స్‌ను మెప్పించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

సినిమాటోగ్రఫీ

కేరళ ఎపిసోడ్
రెండు సాంగ్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

రోటీన్ కథ, స్క్రీన్ ప్లే

పరమ బోరింగ్ ఫస్టాఫ్

ఫస్టాఫ్ ఇలా...

ఫస్టాఫ్ ఇలా...

సినిమా తొలి భాగం... హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్‌ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడటం, ఆమెను ఒప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేయడం, రెండు పాటలేసుకోవడం, చివరకు హీరోయిన్ ఇంప్రెస్ అయ్యేలా ఓ ఎమోషనల్ మూమెంట్ క్రియేట్ చేయడం లాంటి రోటీన్ అండ్ బోరింగ్ స్క్రీన్‌‌ప్లేతో సాగింది.

సెకండాఫ్

సెకండాఫ్

రెండో భాగంలో... హీరో హీరోయిన్ ఎంగేజ్మెంట్ జరుగడం, అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో విలన్ ఎంట్రీ ఇవ్వడం, హీరోయిన్ కిడ్నాప్ చేయడం, తన లవర్‌ను కాపాడుకోవడం కోసం హీరో తన బుద్ది బలం ప్రదర్శించడం లాంటి సీన్లతో సాగుతుంది.

ఇలాంటివి చాలా...

ఇలాంటివి చాలా...

అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపుతో ఉండే పెద్ద విలన్ అరుదైన వ్యాధి భారిన పడి చావు బ్రతుకుల్లో ఉండటం, అతడు బ్రతకాలంటే వేరొకరి నుండి అవయవ మార్పిడి చేయాలి.... ఇప్పటికే అర్థమయి ఉంటుంది కథ ఎంత పక్తుగా ఉందో?

విశ్లేషణ

విశ్లేషణ

ఒక కొత్త సినిమా చూడటానికి వెళ్లే ప్రతిసారి ప్రేక్షకుడు సరికొత్త అనుభూతిని పొందాలని ఆశ పడతాడు. చూసిన కథలనే చూడాలని ఎవరూ కోరుకోరు. హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, ప్రియురాలు ఆపదలో ఉంటే ఆమెను కాపాడుకునే ప్రయత్నం హీరో చేయడం ఏ సినిమాకైనా బేకిస్ పాయింట్. అయితే ఈ రెండు పాయింట్ల మధ్య ప్రేక్షకులను మెప్పించడానికి ఎలాంటి ఎలిమెంట్స్ చొప్పించాము, ఆ ఎలిమెంట్స్ వారికి ఏ మేరకు కనెక్ట్ అయ్యాయి అనేది దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి కథలో బలం లేక పోయినా వినోదాత్మక అంశాలతో లేదా భావోద్వేగమైన సీన్లు నచ్చితే ప్రేక్షకుడు సంతృప్తి పడతాడు. ‘లవర్' మూవీలో అలా సంతృప్తి పడే అంశాలు ఏమీ లేక పోవడం పెద్ద మైనస్.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

‘లవర్' మూవీ కొత్తదనం లేని ఒక సాధారణ ప్రేమకథ. ప్రియురాలిని కాపాడుకునే క్రమంలో హీరో రాజ్ తరుణ్ చేసే ప్రయత్నాలు పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్, రాజ్ తరుణ్ లాంటి యంగ్ టాలెంటెడ్ హీరో చేతిలో ఉన్నప్పటికీ దర్శకుడు అనీశ్ కృష్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు.

నటీనటులు

నటీనటులు

రాజ్ తరుణ్, రిద్ది కుమార్, రాజీవ్ కనకాల, అజయ్, సచిన్ ఖేడేకర్, సుబ్బరాజు, ప్రవీణ్, సత్యం రాజేష్ తదితరులు.

తెరవెనక

తెరవెనక

కెమెరా: స‌మీర్ రెడ్డి, మ్యూజిక్‌: అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌: జె.బి, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, స్టంట్స్‌: విజ‌య్‌, వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి, నిర్మాత: హ‌ర్షిత్ రెడ్డి, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X