‘రాజు గాడు’ రివ్యూ: ఆకట్టుకోని పరమ రొటీన్ డ్రామా...

By Bojja Kumar

Recommended Video

Raju Gadu Movie Review రాజు గాడు మూవీ రివ్యూ

Rating:
2.0/5
Star Cast: రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు
Director: సంజనా రెడ్డి

'ఉయ్యాల జంపాల' లాంటి హిట్‌తో హీరోగా తెరంగ్రేటం చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' లాంటి వరుస విజయాలు అందుకుని ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండింగ్ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరి విభిన్నంగా, ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం అతడి ప్లస్ పాయింట్స్. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్..... తర్వాత వరుస ప్లాపులతో వెనకపడిపోయాడు. ఒక్క హిట్ కొట్టి మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పడేసుకుందామని చేసిన ప్రయత్నంలో భాగమే 'రాజు గాడు'. రాజ్ తరుణ్ ఈసారైనా హిట్టుకొట్టాడా? లేదా? ఓసారి సమీక్షిద్దాం.

దొంగతనం ఒక జబ్బు....

దొంగతనం ఒక జబ్బు....

రాజు (రాజ్ తరుణ్)కు పుట్టుకుతోనే క్లెప్టోమేనియా అనే జబ్బు ఉంటుంది. దీంతో తనకు తెలియకుండానే వస్తువులు కొట్టేస్తుంటాడు. ఇంట్లోవారు, బయటి వారు, స్నేహితులు, బంధువులు అనే తేడా లేకుండా అందరి వస్తువులు దొంగతనం చేస్తుంటాడు. ఈ జబ్బును పోగొట్టడానికి రాజు తండ్రి (రాజేంద్రప్రసాద్) ఎంత మంది డాక్టర్లను కలిసినా ఫలితం ఉండదు. కొడుకు చేసే దొంగతనాలు చివరకు వారికి అలవాటైపోతాయి.

ప్రేమలో పడ్డ తర్వాత కొత్త మలుపు

ప్రేమలో పడ్డ తర్వాత కొత్త మలుపు

రాజు అందం చూసి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమలో పడతారు. అయితే వారి వస్తువులు కూడా కొట్టేసి వారితో ఛీకొట్టించుకుంటాడు ఈ దొంగ హీరో. అయితే తన్వి(అమైరా దస్తూర్) అనే అమ్మాయి మాత్రం రాజ్ తరుణ్ మనసు దోచేస్తుంది. ఆమెను చూసినప్పటి నుండి ప్రేమ ఊహల్లో మునిగితేలుతుంటాడు. దొంగతనం అంటే అస్సలు సహించని, అలాంటి పనులు చేస్తే కాళ్లు, చేతులు తీసివేసే ఫ్యామిలీ నుండి వచ్చిన తన్వి ప్రేమను దొంగబుద్దులున్న రాజు ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.

రాజ్ తరుణ్ పెర్ఫార్మెన్స్

రాజ్ తరుణ్ పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ పరంగా రాజ్ తరుణ్ ఒకే. క్లెప్టోమేనియా జబ్బున్న పాత్రలో బాగా చేశాడు. గత చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యువ హీరో ఎందుకనో ఈ చిత్రంలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక పోయాడు.

 ఆకట్టుకోని అమైరా దస్తూర్...

ఆకట్టుకోని అమైరా దస్తూర్...

అమైరా దస్తూర్ నటన గొప్పగా చేసింది అని చెప్పుకునే స్థాయిలో అయితే లేదు, ఆమెది ఇందులో అంత స్కోప్ ఉన్న పాత్ర కూడా కాదు. గత చిత్రాల్లో గ్లామర్ పరంగా ఆకట్టుకున్న ఈ ముంబై బ్యూటీ ఈ చిత్రంలో అందాల ఆరబోతకు కూడా దూరంగానే ఉంది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

దొంగతనాలు చేసే కొడుకుతో కాస్త కామెడీ క్యారెక్టర్ ఉన్న పాత్రలో రాజేంద్రప్రసాద్ మెప్పించాడు. సీరియస్ పాత్రలో నాగినీడు తన పరిధిమేర నటించాడు. విలన్ పాత్ర రావు రమేష్ చేశాడు కానీఅతడి పెర్ఫార్మెన్స్‌ను ఎలివేట్ చేసే సీన్లయితే పడలేదు. సితార, సుబ్బరాజు, 30 ఇయర్స్ పృధ్వి, రఘు, సుబ్బరాజు, కృష్ణ భగవాన్, ఖయ్యుం తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాల పరంగా...

టెక్నికల్ అంశాల పరంగా...

టెక్నికల్ అంశాల పరంగా కూడా అంత హైలెట్‌గా చెప్పుకునే విషయాలు కూడా సినిమాలో ఏమీ కనిపించలేదు. రఘు విజయ్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. గోపీ సుందర్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ చాలా పూర్‌గా ఉంది. ఏకె ఎంటర్టెన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు కాస్త ఫర్వాలేదు.

ఆకట్టుకోలేని పరమ రోటీన్ కథ

ఆకట్టుకోలేని పరమ రోటీన్ కథ

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ రోటీన్‌గా ఉంది. ఒక మామూలు కథకు కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి వినోదం పంచే ప్రయత్నం చేశారు కానీ.... స్క్రిప్టు వర్క్ బలంగా లేక పోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే పరిస్థితి వచ్చింది.

డైరెక్షన్ వైఫల్యం

డైరెక్షన్ వైఫల్యం

ఈ చిత్రానికి అంజనారెడ్డి దర్శకత్వం వహించారు. క్రియేటివిటీ అనే అంశానికి ఆమె చాలా దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సినిమాలో ప్రతీ అంశం ఏదో సినిమా నుండి లేపేసి ఇందులో పెట్టినట్లు ఉందే తప్ప ఆమె సొంత క్రియేటివిటీ వాడినట్లు అస్సలు అనిపించదు.

సీనియర్ స్టార్లు ఉన్నా సరిగా వాడుకోలేదు

సీనియర్ స్టార్లు ఉన్నా సరిగా వాడుకోలేదు

ఈ చిత్రంలో రావు రమేష్ విలన్ పాత్ర పోషించారు. ఆయన పాత్రను మరింత బలంగా డెవలప్ చేసి ఉంటే బావుండేది. స్క్రీన్ ప్లే సరిగా లేని కారణంగా ఇంకా చాలా మంది స్టార్లు, కమెడియన్లు ఉన్నా ఎవరినీ సరిగా వాడుకున్నట్లు కనిపించదు.

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్, మైనస్ పాయింట్స్

సినిమాలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, రాజేంద్ర ప్రసాద్ ఈ ఇద్దరే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఇది తప్ప కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా మిగతా అన్న విషయాలు మైనస్ అనే విధంగానే ఉన్నాయి.

చివరగా....

చివరగా....

రాజ్ తరుణ్ సినిమా అంటే ఓ స్థాయి వినోదం ఆశించి వెళతాం. అయితే ‘రాజు గాడు'లో అదే మిస్సవ్వడం పెద్దమైనస్. దీనికితోడు రోటీన్ కథ, కథనం ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి.

తారాగణం

తారాగణం

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు

తెర వెనక

తెర వెనక

కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X