For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raja Raja Chora review.. శ్రీ విష్ణు హృదయాలను దోచుకొన్నాడా? అంటే..

  |

  Rating:
  2.5/5
  Star Cast: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, గంగవ్వ
  Director: హసిత్ గోలి

  అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాల తర్వాత శ్రీవిష్ణు అంటే మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా అనిపించకోకవడమే కాకుండా చాపకింద నీరులా తనకంటూ టాలీవుడ్‌లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్న శ్రీవిష్ణుకు గత చిత్రం గాలి సంపత్ చేదు అనుభవాన్ని మిగిల్చడమే కాకుండా మంచి స్పీడ్‌లో వెళ్తున్న ఆయన సక్సెస్ గ్రాఫ్‌కు బ్రేక్ వేసింది. ఈ క్రమంలో హసిత్ గోలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజ రాజ చోర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆయన సక్సెస్ గ్రాఫ్‌ను ముందుకు తీసుకెళ్లిందా? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని మిగిల్చాడు? ఈ సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

  రాజ రాజ చోర కథ ఏమిటంటే

  రాజ రాజ చోర కథ ఏమిటంటే

  చిన్నా చితకా దొంగతనాలు చేస్తూ జిరాక్స్ షాప్‌లో పనిచేసే మధ్య తరగతి యువకుడు భాస్కర్ (శ్రీవిష్ణు). భార్య విద్య (సునైన), కొడుకుకు తెలియకుండా దొంగతనాలు చేస్తూ లైఫ్‌ను మేనేజ్‌ చేయడమే కాకుండా సంజు (మేఘా ఆకాశ్)తో గుట్టుచప్పుడు కాకుండా అఫైర్ కొనసాగిస్తుంటాడు. ఇలాంటి జీవితం మధ్య అనుకోకుండా భార్య విద్యకు భాస్కర్ వ్యవహారమంతా తెలుస్తుంది.

  కథలో ట్విస్టులు ఇలా

  కథలో ట్విస్టులు ఇలా

  భాస్కర్ ఓ దొంగ అని తెలిసిన విద్య పరిస్థితి ఏంటి? దొంగతనం చేస్తూ పట్టుబడిన ఇన్స్‌పెక్టర్ విలియమ్ రెడ్డి (రవిబాబు) ఏం చేశాడు? పోలీస్ అధికారిగా విలియమ్ రెడ్డి చేయకూడని పనిచేస్తూ భాస్కర్‌కు పోవడం వల్ల ఏం జరిగింది? సంజుతో అఫైర్ గురించి తెలిసిన తర్వాత భాస్కర్, విద్య మధ్య సంబంధాలు ఎలా మారిపోయాయి? తనతో అఫైర్ పెట్టుకొన్న భాస్కర్‌కు ఇంతకుముందే పెళ్లై, కొడుకు ఉన్నాడనే విషయం తెలిసిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? జిరాక్స్ షాప్ ఓనర్ సుబ్బు (అజయ్ ఘోష్) ఉన్న రిలేషన్ ఏమిటి? తాను చేసే దొంగ పనుల్లో అంజు (గంగవ్వ) పాత్ర ఏమిటి? విలియమ్ రెడ్డికి తన స్నేహితుడు (ఇంటూరి వాసు)కు మధ్య గొడవ ఏమిటి? ఇలా రకరకాల ఎమోషనల్ ప్రశ్నలకు సమాధానమే రాజ రాజ చోర చిత్ర కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  భాస్కర్ దొంగ తనంతో రాజ రాజ చోర మొదలుపెట్టి సంజుతో అఫైర్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో కథ కాస్త హ్యుమరస్‌గానే మొదలవుతుంది. ఆ తర్వాత భార్య, కొడుకు వెంటనే పరిచయం చేసి భాస్కర్ క్యారెక్టర్‌ను ఎమోషనల్‌గా మార్చేయడంతో ఫీల్‌గుడ్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథను సాగదీస్తూ వెళ్తూ అసలు సమస్యను ఇంటర్వెల్ వరకు లాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు కనిపిస్తుంది. విలియమ్ రెడ్డి, తన స్నేహితుడు, అలాగే గంగవ్వతో భాస్కర్, జిరాక్స్ షాప్ ఓనర్ సుబ్బుతో భాస్కర్ ఇలాంటి రిలేషన్స్‌లో డెప్ట్ ఉన్నప్పటికి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోవడంతో కథ సాదాసీదాగా ఇంటర్వెల్ వరకు సాగుతుంది.

   సాగదీత వ్యవహారంతో సెకండాఫ్

  సాగదీత వ్యవహారంతో సెకండాఫ్

  ఇక సెకండాఫ్‌లో కథ, కథనాలను ఎమోషనల్‌‌గా డీల్ చేసే అవకాశం ఉన్నప్పటికి ఆ దిశగా పూర్తిస్థాయిలో ప్రయత్నం జరుగలేదనే విషయం అర్ధమవుతుంది. ఫెర్పార్మెన్స్‌కు స్కోప్ ఉన్న మంచి పాత్రలు ఉన్నప్పటికీ.. సాగదీత వ్యవహారం, నింపాదిగా కథ చెప్పే విధంగా ఆ పాత్రల్లోని ఎమోషన్స్‌ను దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. తన కోసం భర్త భాస్కర్ చేసిన దొంగపనులు కొంత మేరకు ఎస్టాబ్లిష్ అయినా మొత్తంగా తెరపైన ఫలితం రాబట్టలేకపోవడం కొంత ప్రతికూలంగా మారిందనిపిస్తుంది. సెకండాఫ్‌లో భాస్కర్ దొంగతనాలు చేయాల్సి రావడమనే ఎపిసోడ్ చాలా క్యాజువల్‌గా సాగిపోతుంది. ప్రేక్షకుల మనసులను దొంగిలించాల్సిన అంశాలు చాలా ఉన్నా ఆ ప్రయత్నం జరగలేదనేది చివరకు అర్దమవుతుంది.

   దర్శకుడు హసిత్ గోలి గురించి

  దర్శకుడు హసిత్ గోలి గురించి

  దర్శకుడు హసిత్ గోలి ఎంచుకొన్న పాయింట్ మంచిదే కానీ ఫర్‌ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుడు కావడం వల్ల తాను రాసుకొన్న సీన్లపై మమకారం వల్లో సినిమా నిడివిని పెంచేయడం ఫీల్‌ను దెబ్బ తీశాడనిపిస్తుంది. డెఫినెట్‌గా కొత్త తరహాగా కథ చెప్పాలనుకొనే ప్రయత్నం అభినందనీయం. పాత్రలను రాసుకొన్న తీరు, డిజైన్ చేసిన విధానం బాగుంది కానీ.. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడిని వెంటాడే మ్యాజిక్ వాటిలో మిస్ అయిందని చెప్పవచ్చు. అయితే తొలి చిత్ర దర్శకుడనే విషయం ఎక్కడా కనిపించకపోవడం ఆయన ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.

  శ్రీవిష్ణు ఫెర్ఫార్మెన్స్ ఇలా..

  శ్రీవిష్ణు ఫెర్ఫార్మెన్స్ ఇలా..

  ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే ఎలాంటి అనుమానాలు లేకుండా తన పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడక్కడ తన మేనరిజమ్స్‌తో నవ్విస్తే.. మరికొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నాడు. గత చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో ఇంకా బెటర్‌గా కనిపించాడు. ఫెర్ఫార్మెన్స్ పరంగా మెచ్యురిటీ కనిపించింది. సెకండాఫ్‌లో జిరాక్స్ ఓనర్‌ సుబ్బుతో ఉండే సీన్లు హార్ట్ టచింగ్ ఉంటాయి. అన్ని పాత్రలతో కనెక్టివిటి ఉన్న భాస్కర్ పాత్ర తెర మీద పూర్తిస్థాయిలో ఎలివేట్ కాకపోవడం వల్ల ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయాడని చెప్పవచ్చు. సినిమాను మొత్తం తన భుజాలపై మోయడం శ్రీవిష్ణుకు కలిసి వచ్చే అంశంగా మారింది.

  మేఘా ఆకాశ్, సునైన పాత్రలు ఎలా ఉన్నాయంటే

  మేఘా ఆకాశ్, సునైన పాత్రలు ఎలా ఉన్నాయంటే

  భార్య విద్య పాత్రలో సునైన తన పాత్ర మేరకు ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్‌లో, తనకు తెలియకుండా భర్త దొంగతనాలు చేస్తున్నాడని తెలిసిన తర్వాత వచ్చే సీన్లలో సునైన యాక్టింగ్ బాగుంది. సాధారణ, మధ్య తరగతి వివాహితగా ఆకట్టుకొన్నది. సంజుగా మేఘా ఆకాష్ పాత్ర అలా అలా సాగిపోతుంది. గుడిమెట్ల మీద భాస్కర్‌తో సాగే ఎపిసోడ్ భావోద్వేగంగా మారి ఉంటే కథకు మరింత బలంగా మారి ఉందనిపిస్తుంది. సంజుగా మేఘా ఆకాష్ ఓకే అనిపిస్తుంది. గంగవ్వ పాత్రలో కూడా మంచి ఎమోషనల్ యాంగిల్ ఉన్నా దానిని హ్యుమర్ వరకే వాడుకొన్నట్టు అనిపిస్తుంది.

  ఇతర పాత్రల్లో ఎవరెవరంటే

  ఇతర పాత్రల్లో ఎవరెవరంటే

  ఇక భార్య చేతిలో మోసపోయిన భార్తగా వాసు ఇంటూరి గానీ, అవినీతికి పాల్పడే విలియం రెడ్డిగా రవిబాబు, కానిస్టేబుల్‌గా కాదంపరి కిరణ్ పాత్రల్లో మంచి డెప్త్ ఉన్నా అవి పూర్తిస్థాయిలో పండకపోవడం వల్ల అటు ఎమోషన్స్‌ను, ఇటు వినోదాన్ని పూర్తిస్థాయిలో పండిచలేదని చెప్పవచ్చు. రవిబాబు ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. భార్య చేతిలో మోసానికి గురైన వాసు ఇంటూరిపై సానుభూతి పెరిగి ఉంటే ఆ పాత్ర మరింత బలంగా మారి ఉండేది. శ్రీకాంత్ అయ్యంగార్ నవ్వించే ప్రయత్నం చేశాడు.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  రాజ రాజ చోర సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంలో వివేక్ సాగర్‌కు నూటికి నూరు మార్కులు వేయవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని సీన్లు ఎమోషనల్ హైలెట్ అయ్యాయి. సెకండాఫ్‌లో సిధ్ శ్రీరాం పాట ఫిలాసిఫికల్ టచ్‌తో ముందుకెళ్తుంది. పాటల విషయంలో గత చిత్రాలతో పోల్సిస్తే కొంత గేజ్ తగ్గినట్టే కనిపిస్తుంది. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫి బాగుంది. ఈ సినిమా విషయంలో అదిపెద్ద కంప్లయింట్ నిడివి. విప్లవ్ తన కత్తెరు మరింత పదును పెట్టాల్సింది. దర్శకుడి విజన్ కారణంగానే నిడివి పెరిగి ఉంటుందనే ఫీల్ కలిగినందున ఇందులో విప్లవ్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సినిమా నిడివి తగ్గి ఉంటే స్పీడ్ పెరిగి సినిమా మరింత ఎమోషనల్‌గా మారి ఉండేదేమో. ఆర్ట్ మిగితా విభాగాలు పనితీరు కూడా బాగుంది. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై కొంత దృష్టిపెట్టి ఉంటే సినిమా డెఫినెట్‌గా ఫీల్‌గుడ్‌గా మారి ఉండేది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  రాజ రాజ చోర చిత్రం మంచి డెప్త్ ఉన్న కంటెంట్‌గా మారాల్సిన సినిమానే కానీ.. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉండటం సినిమాకు కొంత మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. పాత్రల డిజైన్ కథను లింక్ చేసిన విధానం బాగానే ఉంది. కానీ పాత్రలు పూర్తిస్థాయిలో పండలేకపోకపోవడం వల్ల తెర మీద మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు స్పీచ్ విన్నంత గొప్పగా సినిమా కనిపించదు. అతిగా ఊహించుకొని వెళితే భారీ విఘాతమే కలుగుతుంది. కాబట్టి తక్కువ అంచనాలతో వెళితే సినిమాను ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది. శ్రీవిష్ణు గత సినిమాలు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి రేంజ్ మాత్రం ఈ సినిమాలో కనిపించదు. వారాంతంలో ఫ్యామిలీతోపాటు కలిసి చూడటానికి స్కోప్ ఉన్న చిత్రం. కాకపోతే రాజ రాజ చోరుడు మాత్రం పూర్తిగా హృదయాన్ని దోచులేకోపోయాడని చెప్పవచ్చు.

  Raja Raja Chora Movie Trailer | Filmibeat Telugu
  తెర వెనుక, తెర ముందు..

  తెర వెనుక, తెర ముందు..

  రాజ రాజ చోర నటీనటులు, సాంకేతిక నిపుణులు
  నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, వాసు ఇంటూరి, కాదంబరి కిరణ్ తదితరులు
  దర్శకత్వం: హసిత్ గోలి
  నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
  సినిమాటోగ్రఫి: వేద రామన్ శంకరన్
  ఎడిటింగ్: విప్లవ్ నైషాడం
  మ్యూజిక్: వివేక్ సాగర్
  బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
  రిలీజ్ డేట్: 2021-08-19

  English summary
  Actor Sree Vishnu's latest movie Raja Raja Chora released in theares on August 19th. In this occassion, Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X