For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5

  తెలుగు సినీ తెరపై ఎన్నో ప్రేమకథలో వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. వస్తాయి కూడా. ప్రేమ అనేది దాదాపు అన్ని కథల్లో అంతర్లీనంగానైనా ఉంటుంది. ప్రేమకథలను ఎన్ని స్లార్లు అందంగా, అందరూ మెచ్చే విధంగా, కొత్తగా చూపిస్తే.. ప్రేక్షకులు ఎప్పుడూ తిరస్కరించరని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ తెరపైకి వచ్చిన మరో అచ్చమైన పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథ 'రాజావారు రాణిగారు'. ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏమేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరక్)ని బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే రాణిపై రాజా ఇష్టాన్ని పెంచుకొంటాడు. అయితే ఆ తన మనసులోని విషయాన్ని మాత్రం చెప్పలేకపోయి మౌన ప్రేమికుడిగా మారిపోతాడు. ఓ క్రమంలో తన ప్రేమ విషయాన్ని రాణికి చెప్పడానికి అతని స్నేహితులు చౌదరి (రాజ్‌కుమార్ కసిరెడ్డి), నాయుడు (యజుర్వేద్ గుర్రం) సహాయం తీసుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మనసులోని మాటను మాత్రం చెప్పలేకపోతాడు. ఉన్నత చదువుల కోసం ఊరు విడిచి వెళ్లిన రాణి.. మూడున్నరేళ్లైనా తిరిగి రాదు. అయితే ఆమెను మళ్లీ ఊరికి రప్పించడానికి హీరో చేసిన ప్రయత్నాలు, వచ్చాక తన మనసులోని మాట చెప్తాడా? లేదా అన్నదే కథ.

  కథలోని ట్విస్ట్‌లు

  కథలోని ట్విస్ట్‌లు

  ఉన్నత చదువుల కోసం ఊరిని విడిచి వెళ్లిన రాణిని తిరిగి రప్పించడానికి రాజా స్నేహితులు చేసిన ప్రయత్నాలేంటి? మూడున్నరేళ్ల తరువాత ఊరికి వచ్చిన రాణితో తన మనసులోని మాట చెప్పాడా? మధ్యలో వచ్చిన రాణి బావ కథేంటి? రాణితో పెళ్లికి ఒప్పుకుని మధ్యలోనే ఆమె బావ ఎందుకు పారిపోయాడు? చివరకు రాజా ప్రేమ కథ ఎలా ముగిసింది? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  శ్రీరామపురం.. ఆ ఊరి అందాలను చూపించడం, రాజా-రాణిల ప్రేమకథను వారి స్నేహితులతో చెప్పించడం లాంటి సీన్స్‌తో మొదలు పెట్టి మెల్లిగా కథలో లీనమయ్యేట్టు చేయడం బాగుంటుంది. రాజా స్నేహితులైన చౌదరి, నాయుడు చేసే కామెడీ అందర్నీ నవ్విస్తుంది. రాణికి తన మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నించడం, ప్రతీసారి విఫలం కావడం, మళ్లీ ప్రయత్నించడం లాంటి సీన్లతో లాక్కొని రావడం ఫర్వాలేదనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం పట్టణానికి వెళ్లిన రాణిని కలవడం కోసం రాజా పడే ఇబ్బందులు, అతని స్నేహితులు చేసే ప్రయత్నాలు నవ్వును తెప్పిస్తాయి. రాణి తండ్రి చెప్పే సమాధానాలు థియేటర్లలో హాస్యాన్ని పండిస్తాయి. ఇక ఎంతకీ రాణి ఆచూకి తెలియక పోవడంతో.. తిరిగి ఊరికి రప్పించేందుకు రాజా స్నేహితులు ఓ ప్లాన్ వేయడం.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, రాణి ఊరికి రావడం లాంటి సీన్లతో ప్రథమార్థం బాగానే ఆకట్టుకుంటుంది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  మూడున్నరేళ్ల తరువాత తిరిగి వచ్చిన రాణిని అలా చూస్తుండిపోతాడే తప్పా.. మనసులోని మాట చెప్పలేకపోవడం, మళ్లీ అదే కథ మొదలవ్వడంతో ప్రేక్షకుడికి సహన పరీక్ష మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఎంతసేపు అదే పాయింట్ చుట్టూ తిప్పడంతో కథ ముందుకు సాగుతున్నట్లు అనిపించదు. రాణి బావ ఎంటరయ్యాక కాస్త బాగానే అనిపింస్తుంది. అప్పుడైనా రాజు తన ప్రేమను చెబుతాడా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. రాణికి పెళ్లి ఇష్టం లేదని, ఆమె బావను సైడ్ చేసేయాలని స్నేహితులకు చెప్పడం, వారు అతడ్ని ఓ చోట బంధించడం, అతడికి ఈ రాజు ప్రేమకథను వివరించడం చివరకు బెదిరించడంతో పారిపోవడంతో పెళ్లి సమస్య తీరుతుంది. చివరకు మళ్లీ తన చదువుల కోసం రాణి బయల్దేరడం, చివరకు అక్కడే ప్రేమకథకు శుభం కార్డం పడటంతో ముగుస్తుంది. సెకండాఫ్ ఇంకాస్త ఆసక్తికరంగా మలిచితే సినిమా బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది.

  నటీనటుల పర్ఫామెన్స్..

  నటీనటుల పర్ఫామెన్స్..

  ఈ చిత్రంలో నటించిన వారంతా దాదాపు కొత్తవారే. రాజు పాత్రలో కిరణ్, రాణి క్యారెక్టర్‌లో రహస్య గోరక్, చౌదరిగా రాజ్ కుమర్, నాయుడుగా యజుర్వేద్ గుర్రం ఇలా అందరూ ఎంతో చక్కగా నటించారు. రాజా, రాణి పాత్రలు ఒకెత్తు అయితే.. నాయుడు, చౌదరి పాత్రలు మరో ఎత్తు. చౌదరిగా నటించిన రాజ్ కుమార్ రూపంలో టాలీవుడ్‌కు మరో చక్కటి కమెడియన్ దొరికాడన్న ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నటీనటులైనా, అంతగా పరిచయం లేని, స్టార్ స్టేటస్ లేని క్యాస్టింగ్ అయినా.. ఎక్కడా కూడా విసిగించకుండా ఆద్యంతం ఎంటర్‌టైన్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. ఈ చిత్రంలోని ప్రతీ ఒక్క పాత్ర బాగానే ఆకట్టుకుంది.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ఇప్పటి కాలంలో నడిచే ప్రేమ కథల కన్నా.. ఓ పదేళ్లు, ఇరవైయేళ్ల క్రితం జరిగిన వాటిని తెరపై చూపిస్తే అందంగా ఉంటుందని, అందరూ ఆకర్షితులవుతారనే పాయింట్‌ను తీసుకోవడమే దర్శకుడి మొదటి సక్సెస్. నాటి కాలంతో టెక్నాలజీ అంతగా లేకపోవడం, ఒకరినొకరితో మాట్లాడుకోవడం లాంటివి కుదిరేవి కావు.. ప్రేమ లేఖలు రాసే కాలం అసలే కాదు.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్లతో నేటి తరానికి ఓ చక్కటి ఫీల్ గుడ్ మూవీని అందించేందుకు దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. అయితే తన మనసులోని ప్రేమను చెప్పడం అనే ఈ పాయింట్ చుట్టే సినిమాను తిప్పడమే ప్రేక్షకుడికి కాస్త నిరాశకు గురి చేయవచ్చు. సినిమా ప్రారంభమై ఎంతసేపు గడుస్తున్నా.. ఆ ఒక్క అంశం చుట్టే తిరగడం, దాంతో సీన్లన్నీ రిపీట్ అవుతున్నట్లు కనిపించడం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఓ చక్కటి ప్రేమ కథను చూశామన్న ఫీలింగ్‌ను కల్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  నువ్వంటే ఇష్టమని చెప్పడం పెద్ద కష్టమేమీ కాదురా.. నువ్వంటే ఇష్టంలేదని వినడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి.., ప్రేమను చెప్పినవారివి ఎన్నో కథలున్నాయి.. చెప్పనోడి కథ వీడిది అంటూ చెప్పే డైలాగ్‌లు ప్రేమ లోతుల్ని, అందులోని భావాలను చాటిచెప్పేలా ఉన్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం అన్నీ కూడా కథకు తగ్గట్టు ఉన్నాయి. పల్లెటూరి అందాలనే కాదు, నటీనటులను అందంగానూ చూపించారు సినిమాటోగ్రఫర్స్. సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు, ఆర్ట్ విభాగం అన్ని సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  రాజా వారు రాణి గారికి తన ప్రేమ విషయాన్ని చెప్పడం కోసం పడే పాట్లు.. మిమ్మల్ని నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. రొటీన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చెప్పలేము కానీ, ఓ మంచి ఫీల్ గుడ్ మూవీని ఇష్టపడే వారిని మాత్రం కచ్చితంగా మెప్పిస్తుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  నటీనటులు
  కథ
  క్లైమాక్స్

  మైనస్ పాయింట్స్
  ద్వితీయార్థం
  మెల్లిగా సాగే కథనం

  #CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం, స్నేహమాధురి శర్మ, దివ్యా నర్ని తదితరులు
  దర్శకత్వం: రవి కిరణ్ కోలా
  నిర్మాత: మనో వికాస్
  మ్యూజిక్: జై క్రిష్
  సినిమాటోగ్రఫి: విద్యాసాగర్ చింతా, అమరదీప్ గుత్తుల
  ఎడిటింగ్: విప్లవ్ నైషదం
  రిలీజ్ డేట్: 2019-11-29
  రేటింగ్: 2.75/5

  English summary
  Raja Vaaru Rani Gaaru is an Telugu language Action Drama written and directed by Ravi Kiran Kola. The film stars Kiran Abbavaram, Rahasya Gorak, Rajkumar Kasireddy, Yazurved Gurram, Snehamadhuri Sharma, Divya Narni. This movie released on November 29, 2019.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X