twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raja Vikramarka Review కార్తీకేయ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating 2.5/5

    యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ నటించిన రాజా విక్రమార్క చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫన్ ఎలిమింట్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 88 రామారెడ్డి, ఆదిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రల్లో తనికెళ్ల భరణి, పశుపతి, హర్షవర్ధన్ తదితరులు నటించారు. కార్తీకేయకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా? భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచింది? అనే విషయాలను తెలుసుకొందాం..

    రాజా విక్రమార్క కథ

    రాజా విక్రమార్క కథ

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందాన్ని లీడ్ చేసే అధికారి (తనికెళ్ల భరణి) విక్రమ్ ( గుమ్మకొండ కార్తీకేయ) టీమ్ మెంబర్. హోంమంత్రి ఇంటిలో అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ క్రమంలో హోం మంత్రి (సాయికుమార్) కూతురు కాంతి (తాన్యా)తో ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలనుకొనే టెర్రిరిస్టులపై దాడి చేస్తారు. కీలక టెర్రరిస్టు వద్ద కుట్రకు సంబంధించిన సగం సమాచారాన్ని తీసుకొని చంపేస్తాడు.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..

    NIAలో కొత్తగా జాయిన్ అయిన విక్రమ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? క్రమశిక్షణ లేకపోవడం వలన విక్రమ్ ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ ఆయుధాల అమ్మకాలు సాగించే డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేయడం వల్ల విక్రమ్‌ ఎలాంటి ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నాడు? మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? హోం మంత్రికి ఉగ్రవాది గురు నారాయణ్ (పశుపతి)కి ఉన్న వైరం ఏమిటి? హోం మంత్రిపై పగ తీర్చుకోవాలనుకొన్న గురు నారాయణ్‌కు విక్రమ్ ఎలా చెక్ పెట్టాడు? ప్రేమించిన కాంతి కోసం విక్రమ్ ఎలాంటి సాహసాలు చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.

     ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్‌లో హైదరాబాద్‌లో విధ్వంసానికి భారీ కుట్రకు పథకాన్ని రచించిన టెర్రిరిస్టులపై ఎటాక్ చేసే అంశంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. హోం మినిస్టర్ కూతురితో ప్రేమలో పడటంతో సరదాగా సాగిపోతుంది. అయితే కథ, కథనాలు రోటిన్‌గా ఉన్నప్పటికీ.. కార్తీకేయ ఒంటిచేత్తో సినిమాను సేవ్ చేయడం సినిమాకు పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఇక హోంమంత్రిని చంపడానికి కుట్రపన్ని టెర్రరిస్టులను ఛేదించే నేపథ్యంగా కథ కొత్తదనం, ట్విస్టులు లేకుండా సాగిపోతున్న సమయంలో కాంతికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తొలి భాగం ముగుస్తుంది.

    ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సెకండాఫ్

    ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌లో కథను ఇంట్రస్టింగ్ చెప్పేందుకు అవకాశాలున్నా ఆ దిశగా సాగినట్టు ఎక్కడా అనిపించదు. ప్రతీ అంశంలోను కార్తీకేయ ఒంటరిపోరాటమే కనిపిస్తుంది. హర్షవర్ధన్ కామెడీ, తనికెళ్ల భరణి పంచ్ డైలాగ్స్‌తో కొంత ఉపశమనం దక్కుతుంది. ఇక ఏసీపీ గోవింద్ నారాయణ్ పాత్రలో సుధాకర్ కోమాకులు ఒదిగిపోయినప్పటికీ.. పిట్ట కొంచెం కూత ఘనం అనే మాదిరిగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి పాత్ర భారంగా మారిందనిపిస్తుంది. రొటీన్ డ్రామాతో మంచి యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నం జరిగిందనే విషయం స్పష్టమవుతుంది.

    రొటీన్ కథతో దర్శకుడి సాహసం..

    రొటీన్ కథతో దర్శకుడి సాహసం..

    హాలీవుడ్ పనిచేసిన అనుభవం ఉన్న దర్శకుడు శ్రీ సరిపల్లి కథను ఎంచుకోవడంలోనే తప్పటడుగు వేశాడనిస్తుంది. రొటీన్ కథ అయినప్పటికీ కొత్తగా చెప్పడానికి సన్నివేశాలను ఇంట్రెస్టింగ్‌గా రాసుకోకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది. కథలేకుండా యాక్షన్ డ్రామాతో సాహసం చేశారేమిటనే విషయం కనిపిస్తుంది. ఫన్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్లను చాలా క్వాలిటీగా, హై స్టాండర్డ్స్‌తో తీశాడని చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేశాడనే ఘనతను సొంతం చేసుకొని ఉండేవాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

    కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

    గత చిత్రాలను చూసుకొంటే కార్తీకేయ నటన, ఫెర్పార్మెన్స్, డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో ఏ మాత్రం తప్పుపట్టలేం. కానీ కథ విషయంలో కాస్త ఊగిసలాట కనిపిస్తుంది. ఎప్పటి మాదిరిగానే తన ఫెర్ఫార్మెన్స్‌తో రాజా విక్రమార్కను ఓ లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ప్రతీ సినిమాకు నటనపరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా మెచ్యురిటీ కార్తీకేయలో కనిపించింది. కీలక సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంటుంది.

    మిగితా పాత్రల్లో ఎవరెవరంటే..

    మిగితా పాత్రల్లో ఎవరెవరంటే..

    ఇక తాన్యా రవిచంద్రన్ హోంమంత్రి కూతురిగా మెప్పించింది. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. ఇక సాయికుమార్ హోంమంత్రిగా హుందాగా కనిపించారు. ఆయన పాత్రను అర్ధాంతరంగా ముగించడం అభిమానులకు నిరాశను మిగిల్చింది. తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎన్ఐఏ అధికారి తనికెళ్ల భరణి డైలాగ్స్, పంచులు బ్రహ్మండంగా పేలాయి. పేలవమైన సీన్లకు ఆయన చేత చెప్పించిన పంచ్ డైలాగ్స్ సపోర్ట్‌గా నిలిచాయి. పశుపతి పాత్ర ఒకేలా ఉంది. సుధాకర్ కోమాకులు నెగిటివ్ షేడ్‌లో బాగా రాణించినప్పటికీ.. ఆ పాత్ర ఆయన బాడీ లాంగ్వేజ్‌కు భారంగా మారిందని చెప్పవచ్చు. ఎప్పటి మాదిరిగానే హర్షవర్ధన్ తన మార్క్ కామెడీని పండించాడు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

    టెక్నికల్ అంశాలు ఇలా..

    టెక్నికల్ అంశాలు ఇలా..

    టెక్నికల్ విభాగం పనితీరు విషయానికి వస్తే.. పి.సి.మౌళి సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. యాక్షన్ సీన్లను హై రేంజ్లో తెరకెక్కించారు. కథలో పసలేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం వల్ల సినిమా నిడివి ఎక్కువైందనే భావన కలుగుతుంది. కొన్ని సీన్లపై జస్విన్ ప్రభు వేటు వేస్తే సినిమా కాస్త క్రిస్పిగా ఉంటుంది. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సమ్మతమే సాంగ్ బాగుంది. ఆదిరెడ్డి టీ, 88 రామారెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    యాక్షన్, డ్రామా, వినోదం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన చిత్రం రాజా విక్రమార్క. కార్తికేయ పెర్ఫార్మెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తాన్యా రవిచంద్రన్ గ్లామర్, తనికెళ్ల భరణి, పశుపతి నటన సినిమాకు సపోర్టుగా నిలిచాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌ను ఇష్టపడే వారికి నచ్చే అంశాలు ఉన్నాయి. యూత్‌‌కు పైసా వసూలు చిత్రంగా చెప్పుకోవచ్చు

    Recommended Video

    Valimai : Ajith తో Kartikeya Kollywood Entry | Raja Vikramarka | Part 03
    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు
    సమర్పణ : ఆదిరెడ్డి టి
    నిర్మాత: 88 రామారెడ్డి
    దర్శకత్వం: శ్రీ సరిపల్లి
    పీఆర్వో: పులగం చిన్నారాయణ
    ఛాయాగ్రహణం: పి.సి.మౌళి
    సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
    ఎడిటింగ్: జస్విన్ ప్రభు
    ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్
    ఫైట్స్: సుబ్బు, నబా
    పాటలు: రామజోగయ్య శాస్త్రి
    విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు
    సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా
    రిలీజ్ డేట్: 2021-11-12

    English summary
    Raja Vikramarka Movie Review: Karthikeya Gummakonda's Raja Vikramarka released on November 12, 2021. Here is the exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X