»   » బాహుబలి-1లో ఏం జరిగింది.... (Recap)

బాహుబలి-1లో ఏం జరిగింది.... (Recap)

Posted By: Staff
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల
ఈ రివ్యూని సగం రాసి ఆపేసి...మిగతా సగం మళ్లీ ఫలానా రోజు రాస్తా చదవండి అంటే ఎలా ఉంటుంది . అలా ఉంది 'బాహుబలి ' చూసిన వారి పరిస్ధితి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు...ఊహించనంత అద్బుతంగా లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. 'బాహుబలి ' తొలి భాగం థియోటర్లలోకి వచ్చి బెనిఫిట్ షోలతో పలకరించింది. పోస్టర్స్, ప్రోమోలతో మించిన అంచనాలను సంతృప్తి పరిచే ప్రయత్నంలో రాజమౌళి పడ్డ కష్టం తెరపై అడుగడుగునా కనిపించింది. ముఖ్యంగా గ్రాండియర్ లుక్ తెరను అమాంతం కమ్మేసింది. అయితే ఆ మాయలోనే సీన్స్ ను లాగించేసే ప్రయత్నం చేసారు. అంతేకానీ టోటల్ సినిమా ఎక్సపీరియన్స్ ని దృష్టిలో పెట్టుకోలేదు. స్క్రిప్టు పరిభాషలో చెప్పాలంటే యాక్ట్ టు మిస్సైంది. ప్రతీ సీన్ ను క్లైమాక్స్ అని చెప్పుకునేటట్లుగానే డిజైన్ చేసారు రాజమౌళి. అయితే సినిమాకు కీలకంగా నిలవాల్సిన క్లైమాక్స్ ని మిస్సైపోయాడు.

అయితే రెండో పార్ట్ కోసం ....ఈ ప్రధమ భాగంలో ప్రధాన పాత్రల మూల కథలను దాచటం, కథను ఓ కొలిక్కి తీసుకురాకుండానే అర్దాంతరంగా సస్పెన్స్ లో చిన్న ట్విస్ట్ ఉంచి క్లైమాక్స్ ఇచ్చి ముగించటం ఇబ్బందిగా అనిపించాయి. దాంతో కొంత అసంతృప్తి ఫీలింగ్ వచ్చింది. ఏ కథ అయినా క్లైమాక్స్ లేదా ముగింపు చూస్తేనే హ్యాపీ. అలాగే ఈ కథ ఎండింగ్ అంటే సెకండ్ పార్ట్ చూస్తేనే ఓ అంచనాకు రాగలమనిపిస్తుంది. అంటే వాస్తవానికి ఈ మొత్తం రెండు పార్ట్ ల కథకు క్లైమాక్స్ ...సెకండ్ పార్ట్ లో ఉంటుందన్నమాట. కాబట్టి అప్పటివరకూ వెయిట్ చెయ్యాలన్నమాట.


కథ...


'వంద మందిని చంపితే వీరుడు అవుతాడు...ఒక్కరిని కాపాడితే దేవుడు అవుతాడు' అలాంటి దేముడి కథే 'బాహుబలి' . శివుడు (ప్రభాస్) మహిష్మతి రాజ్యానికి వారసుడు. అయితే పసిగుడ్డుగా ఉన్నప్పుడే అక్కడ రాజ కుటుంబంలోని అంతర్గత కుట్రకు బలి అవ్వబోయి సాహసవంతురాలైన శివగామి(రమ్యకృష్ణ) చేత రక్షించబడి, ఓ గిరిజన తెగలో పెరుగి పెద్దవుతాడు. వయిస్సుకి వచ్చిన శివుడు అవంతక(తమన్నా) కి ఆకర్షితుడు అవుతాడు. ఇంతకీ అవంతక ఏం చేస్తుంది అంటే... తమ రాజ్యంపు రాజు భల్లాల దేముడు (రానా) కి వ్యతిరేకంగా...మరి కొంత మంది తో కలిసి గొరిల్లా పద్దతిలో పోరాటం చేస్తూంటుంది.


ఆమె లక్ష్యం భల్లాల దేముడు చేతిలో బంధీగా అయిన దేవసేన(అనుష్క)ని రక్షించటం. ఆమెను ప్రేమించిన శివుడు ... ఆ లక్ష్యాన్ని తను నెరవేర్చతానని భుజాన వేసుకుంటాడు. అందులో భాగంగా దేవసేన ను కట్టిపారేసి, హింసిస్తున్న రాజ్యం బయిలుదేరతాడు. అక్కడ వెళ్లాక..అక్కడ జనం అతన్ని 'బాహుబలి' అని గుర్తుపట్టినట్లుగా పిలుస్తారు. ఇదేమీ అర్దం కాని శివుడు...దేవసేనను అసలు తాను ఎవరు...ఎందుకు వాళ్లంతా అలా పిలుస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆమె అసలు 'బాహుబలి' ఎవరు అనే విషయం పై ప్లాష్ బ్యాక్ చెప్తుంది. ఇంతకీ బాహుబలి ఎవరు..అతనికి భల్లాల దేముడు కు విరోధం ఏమిటి... గతంలో అసలు ఏమైంది..క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ ఏమిటీ వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఎనాలసిస్...


రాజమౌళి చిత్రాలలో సాధారణంగా ఇంటర్వెల్ బ్లాక్,క్లైమాక్స్ హై ఎమోషన్ తో నిండి ఉంటాయి. అలాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దేందుకు కామెడీ, రొమాన్స్ కూడా జాగ్రత్తలు తీసుకుని కలుపుతూంటాడు. ఈ సారి ఆ ఫార్ములాని రాజమౌళి ఈ సినిమాకు వదిలేసారు. ఎక్కడా కామెడీ అనేది లేకుండా చేసారు. రొమాన్స్ విషయానికి వస్తే ఉందా అంటే ఉంది..లేదు అంటే లేదు అన్నట్లుగా ఉన్నాయి సీన్స్. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో అసలు కిక్కే లేదు. క్లైమాక్స్ లో సస్పెన్స్ పెట్టి సెకండ్ పార్ట్ అని తేల్చేసాడు.


దానికి తోడు సెకండాఫ్ లో వచ్చే పెద్ద యుద్దం ఎపిసోడ్ ని కావాలని పెట్టినట్లు ఉంది కానీ కథ డిమాండ్ చేసి కనపడదు. అందులోనూ ఆ యుద్దంలో కనిపించే కాలకేయుడు(ప్రభాకర్) ఎవరు...వాళ్లు మూలంగా ఏమి నష్టం జరిగింది అనేది ముందుగా చూపలేదు. దాంతో వారి గురించి ఓ డైలాగు చెప్పి యుద్దం ప్రారంభించంటంతో ఎమోషన్ మిస్సైన ఫీలింగ్ వచ్చింది. కాలకేయుడు ఓడితే ఏమిటి..గెలిస్తే ఏమిటి అనిపించింది. గతంలో ఇలాంటి సీన్ పెట్టాలంటే రాజమౌళి ఖచ్చితంగా ఆ నెగిటివ్ క్యారెక్టర్ ని పూర్తి స్ధాయిలో నెగిటివ్ గా ఎస్టాబ్లిష్ చేసేవారు. ఈ సారి ఎందుకనో డైలాగుతో, గెటప్ తో సరిపెట్టారు. దాంతో ఆ పెద్ద ఎపిసోడ్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.


ఇక పైనే చెప్పుకున్నట్లు సినిమా సెకండ్ పార్ట్ కోసం...పాత్రలను దాచి పెట్టారు. అవేమిటో ..వాటి లక్ష్యం ఏమిటో..అవి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయో తెలియకుండా వాటితో ఫాలో అవటం కష్టం కదా. అదే రక్త చరిత్ర వంటి రెండో పార్ట్ తీసిన సినిమాల్లో ...మొదటి పార్ట్ ముగింపు ఫెరఫెక్ట్ గా ఓ కథలా ఉంటుంది. దాంతో ఏ ఇబ్బందీ లేదు.


స్లైడ్ షో లో హైలెట్స్ ... మైనస్ లు


స్టన్నింగ్

స్టన్నింగ్

ఈ చిత్రం విజువల్ గా చాలా చోట్ల స్టన్నింగ్ గా ఉంది. ప్రతీ ఫ్రేమ్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేసారు రాజమౌళి.


అద్బుతంగా కుదరాయి

అద్బుతంగా కుదరాయి

అలాగే సినిమాకు ప్రాణమై నిలిచిన సెట్స్ కూడా అద్బుతంగా తీర్చి దిద్దారు. రానా విగ్రహం పెట్టే సీన్, రానా ఇంట్రడక్షన్, ప్రభాస్ ఇంట్రడక్షన్ అద్బుతంగా కుదిరాయి. ప్రభాస్ ఇంట్రడక్షన్ లో జలపాతాలను చూస్తూండిపోవాలనిపించేలా చేసారు.


అనుష్క ,రానా, ప్రభాస్

అనుష్క ,రానా, ప్రభాస్

అనుష్క మేకప్ చాలా బాగా కుదిరింది. ఆమె పాత్రకు తగినట్లు బాగా డిజైన్ చేసారు. ప్రభాస్,రానా లు తమ శరీరాలను కథకు తగినట్లు సిక్స్ ప్యాక్ లతో నిండుతనం తీసుకువచ్చారు.


రెండు పాత్రలూ ఒకేలా

రెండు పాత్రలూ ఒకేలా

ఈ సినిమాలో ప్రభాస్...శివుడు గా, అమరేంద్ర బాహుబలిగా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. అయితే ఈ రెండు పాత్రలకూ పెద్ద వేరియేషన్ కనపడదు.ముఖ్యంగా గెటప్, లుక్ విషయంలో..


సత్యరాజ్ పాత్ర

సత్యరాజ్ పాత్ర

సినిమాలో కన్నప్ప గా సత్యరాజ్ నిజంగా బాగా చేసారు. గేమ్ ఆఫ్ ధ్రోన్స్ సీరిస్ నుంచి తీసున్నట్లు ఉండే ఈ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి క్లైమాక్స్ ట్విస్ట్ ఇవ్వటమే ఇబ్బందికరం.


రమ్యకృష్ణ సూపర్

రమ్యకృష్ణ సూపర్

సినిమాలో హైలెట్ గా నిలిచిన అంశం ఏదీ అంటే రమ్యకృష్ణ అని చెప్పాలి. ఆమె నటన మిగతా వారిని డామినేట్ చేసేసింది.


మరో పెద్ద మైనస్

మరో పెద్ద మైనస్

సినిమాలో మరీ డల్ అయిపోతోందని సెకండాఫ్ లో ఐటం సాంగ్ పెట్టారు. అయితే ఫారెన్ అమ్మాయిలతో పెట్టిన ఈ ఐటం సాంగ్ సోసో గా ఉండి అక్కడ అవసరమా అనిపించేలా జరిగింది.


డైలాగులు, స్క్రీన్ ప్లే

డైలాగులు, స్క్రీన్ ప్లే

ఈ సినిమాకు స్రీన్ ప్లే ప్రధాన సమస్యగా నిలిచిందని తొలినుంచే చెప్పుకుంటున్నాం. అలాగే ఇలాంటి సినిమాలకు హైలెట్ గా నిలవాల్సిన డైలాగులు చాలా నీరసంగా ఉన్నాయి. సినిమా ని డల్ చేయటానికి డైలాగులు కీలక పాత్ర వహించాయి.


కీరవాణి సైతం...

కీరవాణి సైతం...

ఈ సారి కీరవాణి సైతం... నిరాశపరిచాడనే చెప్పాలి. రీ రికార్డింగ్ సైతం సోసోగా లాగించేసాడు. రెండు పాటలు బాగున్నాయి. అంతవరకే. గతంలో రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ సూపర్ హిట్..ఈ సారి అంత సీన్ లేదు.


ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్‌


నటీనటులు: ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అడివి శేష్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు
కథ: వి. విజయేంద్రప్రసాద్‌,
సంగీతం: ఎం.ఎం. కీరవాణి,
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌కుమార్‌,
సంభాషణలు: సిహెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ జి.,
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.
ఆర్ట్ డైరక్టర్: సాబుశిరిల్‌
కాస్ట్యూమ్స్‌ :రమా రాజమౌళి
యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్
విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌: వి.శ్రీనివాస్ మోహన్
నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ
సమర్పణ: కె. రాఘవేంద్రరావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి
విడుదలైన తేదీ: 10,జూలై 2015అంచనాలు... అంచులు దాకా తగ్గించుకుని చూడడానికి వెళ్లినా ఎంతో కొంత అసంతృప్తిని మిగిల్చే ఈ చిత్రం రెండో పార్ట్ కూడా రిలీజ్ అయ్యాక... ఆ రెండు పార్ట్ లు కలిపి కంపెల్ చేసి ఓ వెర్షన్ రిలీజ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఓ ఫెరఫెక్ట్ సినిమాలా కనిపించి బాగుండే అవకాసం ఉంది.

English summary
Baahubali is tentatively titled for Prabhas, SS Rajamouli's movie and its a epic story based movie in which, Rana Daggubati is playing the role of prabhas' brother in negative lead. Anushka Shetty will be playing the female lead role in this movie.
Please Wait while comments are loading...