twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోసోగా... (‘లింగ’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారి...వాటితోనే సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ మరోసారి అదే ఫార్ములాని నమ్మి థియోటర్స్ లోకి దిగారు. అడుగడుగుకీ మసాలాని,గ్లామర్ ని గుప్పించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం రజనీ ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో చాలా చాలా స్పీడుగా చేసిన చిత్రం. అయితే సినిమా నేరేషన్ లో మాత్రం అంత స్పీడు లేదు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ లాగినట్లై, ప్రీ ఇంటర్వెల్ దగ్గర వేడిక్కింది. సెకండాఫ్ సైతం అలా..అలా వెళ్లిపోయింది కానీ బలమైన ముద్ర వేయిలేకపోయింది. ముఖ్యంగా రజనీ వంటి స్టార్ చిత్రాల నుంచి ఆశించే పూర్తి స్ధాయి ట్విస్టులు, ఎంటర్టైన్మెంట్ మాత్రం కరవైంది. కథ,కథనం రొటీన్ గా చాలా ప్రెడిక్టబుల్ గా సాగింది. రజనీ అభిమానలకు ఆ స్టైలిష్ లుక్ లు, పంచ్ లు అద్బుతమనిపించవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుడుకి మాత్రం యావరేజ్ చిత్రం చూసినట్లే అనిపిస్తుంది. రోబో, శివాజి చిత్రాల కన్నా ముందు ఈ చిత్రం వచ్చి ఉంటే తప్పుకుండా బాగుండేది అనిపించేది.

    లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు. అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నిజానికి రజనీ వంటి సూపర్ స్టార్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయటం చాలా చాలా కష్టం...అది రజనీని కంట్రోలు చేసినంత ఈజీ మాత్రం కాదు. దాంతో ఏం చేసినా రజనీ ఇమేజ్ ముందు చిన్నదై తేలిపోయే పరిస్ధితి. ఇది గమనించే శంకర్...రజనీ ఇమేజ్ ని దాటేలా శివాజిని,రోబోని సక్సెస్ ఫుల్ గా తెరపైకి తేగలిగారు. ఈ రెండు చిత్రాలు తర్వాత మరింతగా పెరిగిపోయిన రజనీ ఇమేజ్ ముందు ఈ కథ చాలా చాలా చిన్నదైపోయింది. దానికితోడు రవికుమార్ తన పాత చిత్రాల తరహాలోనే ట్రై చేసాడు కానీ మారుతున్న ప్రేక్షకులకు అణుగుణంగా మారలేక,కథను,రజనీ పాత్రను మార్చలేకపోయారు. దాంతో రజనీ నవ్విస్తాడు కానీ పూర్తిగా నవ్వురాదు..రజనీ ఎమోషన్ సీన్స్ లో జీవిస్తాడు కానీ మనకు కనెక్టు కాదు.. ఫైట్స్ చేస్తాడు కానీ అవీ కృత్రిమంగా తేలిపోతూంటాయి. ఇదంతా ఇమడని కథలోకి రజనీని ఇరికించాలని చేసిన ప్రయత్నమంతే.

    గతంలో రజనీ,రవికుమార్ కాంబినేషన్ లో ముత్తు,పడియప్పా చిత్రాలు వచ్చాయి. అయితే ఆ మ్యాజిక్ కూడా ఇందులో లేదు. ఉన్నంతలో ఫ్లాష్ బ్యాక్ ఇంప్రెసివ్ గా ఉంది. అది ఆ కాలానికి చెందింది కాబట్టి...బాగా హ్యాండిల్ చేయగలిగాడు అనుకుంటాను దర్శకుడు.ముఖ్యంగా దేశభక్తిని గుప్పించి మరీ ఈ ఫ్లాష్ భ్యాక్ ని అల్లాడు. అయితే ఆ ప్లాష్ బ్యాక్ తర్వాత ప్రెజెంట్ లోకి వచ్చాక...రజనీ విశ్వరూపాన్నే సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అప్పటికీ రజనీ తనదైన స్టైల్స్ ని, మేనరింజను ఎక్కడా తగ్గకుండా చూపిస్తూ అలరించే ప్రయత్నం చేసాడు. ట్రైన్ స్టంట్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. అయితే ఎన్ని ఉన్నా పాత సీసాలో పాత సారానే అన్న ఫీలింగ్ కలిగించింది. ఎప్పుడిదో రజనీ పాత సినిమా చూస్తున్న ఫీల్ తీసుకువచ్చింది.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

    అదే సరిపోయింది...

    అదే సరిపోయింది...

    ఫ్లాష్ బ్యాక్ లు చూడ్డానికి జనం సినిమాలుకు రారు.. ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రెంజెట్ లో ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ఆసక్తికరం...ఎందుకో స్క్రీన్ ప్లేను తనే రాసుకున్న ఈ సీనియర్ దర్శకుడు ఆ విషయం మర్చి...సినిమాలో ముప్పాతిక భాగం...ప్లాష్ బ్యాక్ కే కేటాయించాడు.

    రజనీకాంత్ గురించి...

    రజనీకాంత్ గురించి...

    రజనీకాంత్ ఫెరఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. ఆయన ఈ వయస్సులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా స్టెప్స్ వేయటం, స్టైల్స్ ని ప్రదర్శించటమే ఆశ్చర్యమనిపిస్తుంది. అలాగే ఆయన రెండు గెటప్ లలోనూ డిఫెరెన్స్ ను చూపించి తనలోని నటుడుని మరోసారి మనముందు ఉంచారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో ఆయన చాలా బాగున్నారు.

    అనుష్క

    అనుష్క

    ఈ సినిమా కోసమో మరి దేని కోసమో కానీ ఆమె బాగా ఒళ్లు చేసింది. అయితే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా తక్కువ సేపు సాగింది. టీవి రిపోర్టర్ గా మాత్రం ఆమె సూట్ కాలేదు అనిపించింది.

    సోనాక్షి సిన్హా...

    సోనాక్షి సిన్హా...

    ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలో సోనాక్షి సిన్హా ఒదిగిపోయింది. అవసరమైన చోట తన లోని నటిని సైతం ఆమె బాగానే ఆవిష్కరించింది. వింటేజ్ లుక్ తో సోనాక్షి సినిమాకు కొత్త అందం తెచ్చింది.

    ఇంద్రతో పోలిక

    ఇంద్రతో పోలిక

    ఇక ఈ చిత్రం చిరు హిట్ ఇంద్రతో పోలిక ఉందంటూ కోర్టుకు ఎక్కారు. అయితే పూర్తిగా ఉందనీ చెప్పలేం. ఉందని చెప్పలేం. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఊరి కోసం...ఆస్దులన్నీ త్వజించి వెళ్లిపోయే పాత్రలో మాత్రం ఇంద్ర పాత్ర ఛాయిలు కనపడతాయి.

    ఇదే దెబ్బకొట్టింది

    ఇదే దెబ్బకొట్టింది

    సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే కాంప్లిక్ట్ కొరవడింది. సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ తో నడవటంతో కేవలం క్లైమాక్స్ కు మాత్రమే ఇప్పటి లింగాకు అవకాసం ఉంది. దాంతో విలన్ జగపతిబాబు కు సైతం సీన్లు లేకుండా పోయాయి. ఏదో తూతూ మంత్రంగా విలన్ ని కొట్టడం తో ముగించేసారు. అదే సినిమాకు పెద్ద వీక్ పాయింట్.

    మరో మైనస్

    మరో మైనస్

    రజనీకాంత్ చిత్రం అంటే ఓ బ్రాండ్. ఆయనకో ట్రేడ్ మార్క్ ఉంది. దానికి అణుగుణంగా డైలాగులు, థ్రిల్స్ ఉంటూ వస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేయటానికి అభిమానులు వెళ్తూంటారు. అయితే అవన్నీ ఇందులో మిస్సయ్యాయి. హైలెట్ గా చెప్పుకోవటానికి ఒక్క డైలాగు కానీ, మేనరిజం కాని లేదు.

    సంగీతం

    సంగీతం

    ఎఆర్ రహమాన్ వంటి సంగీత దిగ్గజం సమకూర్చిన ఈ చిత్రంలో పాటల్లో మోనా మోనా పాట ఒక్కటే మంచి హిట్ అయ్యింది. మిగతావన్ని మూమూలుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సీన్లను నిలబెట్టింది.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...


    చిత్రం సాంకేతికంగా అంటే ఉన్నతంగా, అద్బుతంగా రజనీ స్దాయికి తగ్గట్లు లేదవే చెప్పాలి. అలాగని రత్నవేలు కెమెరా వర్కు ని వంక పెట్టలేం. దర్శకుడు చిత్రాన్ని గ్రాండ్ గానే తీసాడు కానీ స్క్రిప్టే సహకరించలేదు. గ్రాఫిక్స్ మాత్రం అసలు బాగోలేదు.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతి బాబు,సంతానం,దేవ్ గిల్,బ్రహ్మానందం, కె విశ్వనాధ్, రాధారవి, విజయకుమార్, నిళిగళ్ రవి,కరుణాకరన్,మనోబాల, ఇలవరసు తదితరులు
    రచన: కె.ఎస్ రవికుమార్, పొన్ కుమరన్
    సంగీతం: ఎఆర్ రహమాన్
    కెమెరా: ఆర్.రత్నవేలు
    ఎడిటింగ్ : సంజీత్ మహ్మద్
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
    సమర్పణ : మునిరత్న, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేశ్‌
    విడుదల తేదీ : 12,12,2014

    ఏదైమైనా 'లింగా' రజనీ కాంత్ స్దాయి చిత్రం మాత్రం కాదు. ప్లాష్ బ్యాక్ తగ్గించి...ఇప్పటి సీన్లు పెంచి ఉంటే ఫలితం బాగుండేది. అలాగే లెంగ్త్ తగ్గించినా మరింత బాగుండేది. అయితే స్వాతంత్రయానికి ముందు జరిగే సన్నివేసాలు బాగా తీసారు కాబట్టి వాటిని చూడటానికి ఓ లుక్కేయచ్చు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Superstar Rajinikanth's latest movie Lingaa released today. Lingaa Starring Super Star RajiniKanth, Anushka Shetty and Sonakshi Sinha. It was directed by K.S.Ravichander. Rajini is touted to play dual role in this film. A. R. Rahman Composed tunes for this film While Cinematography was handled by R. Rathnavelu. The script as well as screenplay for Lingaa were penned by Pon Kumaran. Lingaa to release in 3 Languages which includes telugu and hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X