రాజశేఖరే రాంగ్ (రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్‌’ రివ్యూ)

By Srikanya

Rating:
1.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

యాగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్స్ తో దాదాపు కెరీర్ అంతా లాక్కొచ్చిన రాజశేఖర్... పెద్ద వాడ్ని అయ్యాను కదా అని హఠాత్తుగా కుందేలు వేషం వేస్తానంటే ఎలా... ఆయన ఇమేజ్ అలా లగేజ్ లా క్యారీ అవుతుంది కదా. ఈ విషయం మరిచి తమిళంలో హిట్టైన సినిమా..తక్కువ బడ్జెట్ లో అవుతుంది..కొత్త కుర్రాళ్లను నలుగురుని పెట్టుకుని...కొత్త డైరక్టర్ తో ఖర్చు తక్కువలో లాగేద్దామనుకుంటే ఎలా...అక్కడ ఎందుకు హిట్టైంది... వాళ్లకు నచ్చే విషయాలేంటి..అందులో మనకు పట్టని విషయం ఏమిటి..అనేది చూసుకోవాలి కదా..అలాగే...అసలు అక్కడ కుర్రాడు వేసిన పాత్రకు తను సూట్ అవుతానో లేదో చెక్ చేసుకోవాలి. దానికి తోడు... తమిళం నుంచి ...సీన్ టు సీన్ ...అనువదించినట్లు ఉంది కానీ....తెలుగుకి రీరైట్ చేసుకుని తెరకి ఎక్కించినట్లు లేదు...దాంతో ఏది కామెడీనో...ఏది సెటైరో ...ఎక్కడ నవ్వాలో....ఎక్కడ ఎమోషన్ అవ్వాలో అర్దం కాక ..ఆ సీన్స్ క్రింద ఆ విషయం రాస్తే బాగుండును అనిపించింది. ముఖ్యంగా రాజశేఖర్ ని పెట్టుకున్నప్పుడు అతని క్యారెక్టర్ కు ప్రయారిటి ఇచ్చి ఆ పాత్ర ప్యాసివ్ కాకుండా సీన్స్ రీరైట్ చేసుకుని సెకండాఫ్ అయినా మార్చుకోవాల్సింది. లేదా రాజశేఖర్ ని కాకుండా వేరే చిన్న హీరోని అయినా పెట్టుకుని లాగించాల్సింది నిర్మాత గా జీవిత అయినా సేఫ్ అయ్యేది.

ఓ మంచి కిడ్నాపర్ గడ్డం దాస్ (రాజశేఖర్)కి ఉద్యోగం సద్యోగం లేని మరో నలుగురు తోడవుతారు. వాళ్లంతా అతని గ్యాంగ్ గా మారి కిడ్నాపులనే వృత్తిగా మొదలెడతారు. అందులో భాగంగా ఓ బిజినెస్ మ్యాన్(కాదంబరి కిరణ్) కొడుకుని కిడ్నాప్ చేసి, విజయవంతంగా డబ్బులు వసూలు చేస్తారు. ఇది గమనించిన ఆ బిజినెస్ మ్యాన్...తనను ఇరికించిన ఓ పొలిటీషన్ (నరేష్) పై పగ తీర్చుకోవటానికి వారిని వాడాలని ఫిక్స్ అవుతాడు. ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేయమని వారిని అడుగుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ...ఆ పొలిటీషన్ కొడుకు...మహా జాదూ... ఈ కిడ్నాప్ కు ఒప్పుకున్న గడ్డం దాస్... ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి...చివరకు ఏమైంది...చిత్రంలో షీనా పాత్రమిటి అనేది మిగతా కథ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రాజశేఖర్ తన ఇమేజ్ ని మార్చుకుని కొత్త పాత్ర చేయాలనే ఉత్సాహం అభినందించతగ్గదే. అయితే ఆ పాత్రకు తను ఎంతవరకూ న్యాయం చేయగలుగుతాను...ఎంత వరకూ సెట్ అవుతానో అనేది మరో సారి ఆలోచించాల్సింది. ఎందుకంటే రాజశేఖర్ వయస్సు వ్యక్తి.... ఓ ఊహాసుందరిని ఊహిస్తూ ఉంటే డైజస్ట్( ప్రేమకు వయస్సు అడ్డం ఏంటి అంటే చెప్పలేం...ఇది అలాంటి కథా కాదు) చేసుకోవటం కష్టమనిపిస్తుంది. దానికి తోడు ఈ బ్లాక్ కామెడీని అదే జానర్ లో నడిపి ఉండాల్సింది. చాలా చోట్ల కామెడీ చేద్దామని ప్రయత్నమే కానీ ఒరిజనల్ లో కంటెంట్ ని అర్దం చేసుకుని చేసినట్లు కనపడదు. దర్శకుడు కూడా ఎంత తక్కువలో ఈ సినిమాని లాగేద్దాం అనే విషయం మీద పెట్టిన శ్రద్ద...రీమేక్ ని తెలుగుకు ...తెలుగు ఆడియన్స్ కు ...ఇక్కడ అభిరుచులకు, ఇక్కడ ప్రాంతీయతకు తగినట్లు రాసుకోలేకపోయారు.

  Rajasekhar's Gaddam Gang REVIEW

రాజశేఖ్ర హీరో కాబట్టి... సినిమాలో నెగిటివ్ పాత్రను, హీరో పాత్రను విడివిడిగా మన తెలుగుకు తగినట్లు ఇంటర్వెల్ దగ్గర నుంచి అయినా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసి, నెగిటివ్ పాత్రను రాజశేఖర్ పాత్ర ఎలా ఎదుర్కొన్నాడో పెడితే , ఒరిజనల్ దెబ్బ తీసినట్లున్నా కొంతలో కొంత ఖచ్చితంగా బాగుండేది. అలా చేయకపోవటంతో రాజశేఖర్ పాత్ర జరిగే సంఘటనలకు చేష్టలు ఉడిగి అలా చూస్తూండిపోతూ, పరిస్ధితులకు రియాక్టు అవుతూ విసిగించింది. అదే ఏ ఇమేజ్ లేని హీరో చేసి ఉంటే అంత తేడా అనిపించి ఉండేది కాదు.

దానికి తోడు మనకు బ్లాక్ కామెడీలు..సెటైర్ డ్రామాలే తక్కువ. దాంతో ఈ సినిమా చాలా చాలా కొత్తగా, వింతగా అనిపిస్తుంది. దానికి తోడు...దర్శకుడు ఎక్కడా మనకు అర్దం కావాలని తీసినట్లుండడు..తనకు అర్దమైన మేరకు తీసాడనిపిస్తుంది. ఈ సినిమా చూస్తూంటే రాజశేఖర్ ...తన పోలీస్ ఇమేజ్ కు ఏ కామెడీ ని కలిపి పటాస్ లాంటి సినిమా చేసినా ఆడుతుందేమో కానీ ఇలాంటి ప్రయోగాలు కష్టమనిపిస్తుంది. కుర్రాళ్ళంతా బాగా చేసారు..దర్శకుడు వారి నుంచి మంచి నటననే రాబట్టుకున్నాడు.

అర్దాంతంగా వచ్చిపడే... ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ మాత్రం అస్సలు బాగోలేదు..ఎక్కడా సెక్స్ అప్పీల్ లేదు. ఊహా సుందరి గా షీనా పాత్ర ఒరిజనల్ లో పండినట్లు ఇక్కడ పేలలేదు. డైలాగులు కొన్ని బాగానే పేలాయి. నరేశ్, గిరిబాబు, సీత వంటి సీనియర్ ఆర్టిస్టులు బాగానే చేసారు. ముఖ్యంగా గిరిబాబు చేత చెప్పించిన డైలాగులు బాగా పేలాయి.

ఫైనల్ గా రాజశేఖర్ కు ఇది రాంగ్ సినిమా... ఆయన మనస్సు ఇంకా యువకుడుగా ఉన్నా...పైకి మాత్రం వయస్సు మీద పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి పాతికేళ్ల కుర్రాళ్లు వేసిన పాత్రలు రీమేక్ లకు వెళ్లకుండా ఉంటే మేలు. అలాగే రీమేక్ చేసేటప్పుడు మనం తెలుగుకు చేస్తున్నాం...ఇక్కడ జనాలు చూడాలి అని ఆలోచించి డిజైన్ చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాసం ఉంది.

సినిమా: ‘గడ్డం గ్యాంగ్‌'
బ్యానర్: శివాని, శివాత్మిక మూవీస్‌
నటీనటులు: డా.రాజశేఖర్, షీనా, గిరిబాబు, సీనియర్‌ నరేశ్‌, సీత, దీపక్‌, అచ్చు తదితరులు
కెమెరా: డేమిల్‌ జేవియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు,
ఎడిటర్‌: రిచర్డ్‌ కెవిన్‌,
నిర్మాత: జీవితా రాజశేఖర్‌.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.సంతోష్‌
విడుదల తేదీ: 6, ఫిబ్రవరి 2015

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X