twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    RajDooth Movie Review And Rating || రాజ్‌దూత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    2.5/5

    దివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి చిన్న కుమారుడు మేఘాంశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రాజ్‌దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ న్యూ డైరెక్టర్స్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు మనం రకరకాల అంశాలపై సినిమాలు తీయడం చూశాం. కానీ ఒక బైక్‌ను మెయిన్ పాయింటుగా పెట్టి దానిచుట్టూ కథ నడింపించడం అనేది కొత్త ఆలోచనే అని చెప్పొచ్చు. మరి ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చి దిద్దడంలో ఏమేరకు సక్సెస్ అయ్యారు? శ్రీహరి కొడుకు మేఘాంశ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

    సంజయ్ అనే కుర్రాడి కథ

    సంజయ్ అనే కుర్రాడి కథ

    సంజయ్(మేఘాంశ్) ఇంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తిరిగే తుంటరి అబ్బాయి. ఫ్యామిలీ విషయాల్లో ఎంత కేర్‌లెస్‌గా ఉంటాడు. ఇలాంటి తుంటరి అబ్బాయి వీక్‌నెస్ అతడి గర్ల్ ఫ్రెండ్ ప్రియ(నక్షత్ర). సంజయ్ బిహేవియర్ నచ్చని ప్రియ తండ్రి తన కూతురును ఇవ్వడానికి ఒప్పుకోడు. అయితే సంజయ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

    రాజ్‌దూత్ బైక్

    రాజ్‌దూత్ బైక్

    అతడి పట్టుదల చూసి కాస్త కరిగిన ఆయన.... తమకు దూరమైన రాజ్‌దూత్ బైక్ తెచ్చి పెట్టాలని, ఇందులో సక్సెస్ అయితే మీ పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఆ బైకును వెతుక్కుంటూ బయల్దేరిన సంజయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది తర్వాతి కథ.

    మేఘాంశ్ పెర్ఫార్మెన్స్

    మేఘాంశ్ పెర్ఫార్మెన్స్

    శ్రీహరి వారసుడిగా వెండితెరకు పరిచయమైన మేఘాంశ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించాడు. సంజయ్ పాత్రలో బాగా సూటయ్యాడు. డైలాగ్ డెలివరీతో పాటు అందుకు తగిన విధంగా హావభావాలు పలికించడంలో ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ కథ ద్వారా మేఘాంశ్ తనలోని నటనను పూర్తిగా ప్రదర్శించే అవకాశం అయితే రాలేదనే చెప్పాలి. తొలి సినిమా కాబట్టి దానికి తగిన విధంగానే సరళంగా స్క్రీన్ ప్లే నడిపించే ప్రయత్నం చేశారు. లుక్ పరంగా బావున్నాడు... నటన పరంగా ఇంకాస్త రాటుదేలితే మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ నక్షత్ర కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైంది.

    ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    ‘రాజ్‌దూత్'లో హీరో తర్వాత కీలకమైన పాత్రలో ఆదిత్య మీనన్ నటించాడు. ఆయన పోషించిన రాజన్న పాత్ర సినిమాకు మరింత ప్లస్ అయింది. హీరో ఫ్రెండుగా కామెడీ పండించే పాత్రలో సుదర్శన్ నటించినా... పెద్దగా నవ్వించలేక పోయాడు. కోటశ్రీనివాసరావు, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

    కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే...

    కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే...

    ‘రాజ్ దూత్' అనే బైక్ చుట్టూ రాసిన కథకు ఒక ఎమోషనల్ పాయింటును యాడ్ చేసిన విధానం బావుంది. అయితే కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా సాగదీశారు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా స్క్రీ ప్లే ఆసక్తికరంగా లేక పోగా... చాలా చోట్ల విసుగుతెప్పించే విధంగా ఉంది. మధ్యలో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రేక్షకుల హృదయానికి కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నప్పటికీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేక పోయారు.

    డైరెక్షన్

    డైరెక్షన్

    ఈ చిత్రాన్ని అర్జున్‌-కార్తీక్‌ అనే ఇద్దరు కొత్త దర్శకులు డైరెక్ట్ చేశారు. సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగున్నప్పటికీ కథను వినోదాత్మకంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా నడిపించడం తడబడ్డారు. కొత్త దర్శకులు గుర్తింపు తెచ్చుకోవాలంటే డైరెక్షన్లో తమదైన ముద్ర చూపించే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ చిత్రంలో అలాంటి ముద్ర కనిపించలేదు.

    ఫస్టాఫ్ అండ్ సెకండాఫ్

    ఫస్టాఫ్ అండ్ సెకండాఫ్

    సినిమాలో ఫస్టాఫ్ అంతా బైక్ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళ్లిన హీరోకు... ఇంటర్వెల్ సమయానికి బైక్ జాడ తెలుస్తుంది. అక్కడి నుంచి బైక్‌ను ఎలా దక్కించుకోవాలి అనే కథ రన్ అవుతుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. రెండో భాగంలో వచ్చే కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా ఉండటంతో పాటు మంచి కంటెంట్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

    ప్లస్ పాయింట్

    ప్లస్ పాయింట్

    రాజ్‌దూత్ బైక్

    మేఘాంశ్
    ఆదిత్య మీనన్
    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    ఫస్టాఫ్

    సాంకేతిక అంశాలు

    సాంకేతిక అంశాలు

    సాంకేతిక అంశాల పరంగా చూస్తే.... విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. వరుణ్‌ సునీల్‌ అందించిన సంగీతం ఓకే. విజయవర్దన్ కావూరి ఎడిటింగ్ యావరేజ్. ఓవరాల్‌గా టెక్నికల్ విభాగాలు మరీ అంత గొప్పగా కాకపోయినా.... ఓకే అనే విధంగా ఉన్నాయి.

    చివరగా...

    చివరగా...

    శ్రీహరి కొడుకు మేఘాంశ్ తెరంగ్రేటం కోసం ఎంచుకున్న కథ ఒకే. కథను నడిపించడంలో డైరెక్టర్స్ కాస్త తడబడ్డాడు కానీ నటన పరంగా మేఘాంశ్ తడబడలేదు. అయితే ఈ బైక్ సోర్టీ యువతకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అనే అంశంపై విజయం ఆధారపడి ఉంటుంది.

    నటీనటులు, సాంకేతిక విభాగం

    నటీనటులు, సాంకేతిక విభాగం

    ఈ చిత్రంలో మేఘాంశ్, నక్షత్ర, సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు, బిహెచ్‌ఇఎల్‌. ప్రసాద్‌, భద్రం, జెమినీ అశోక్‌, మృణాల్‌, బిందు, రాజేశ్వరి, శిరీష, నళిని, మాస్టర్‌ ఈశాన్‌ నటించారు.

    సినిమాటోగ్రాఫర్‌: విద్యా సాగర్ చింతా
    ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి
    సంగీతం: వరుణ్‌ సునీల్‌
    రచనా సహకారం: వెంకట్‌డి. పాటి
    పాటలు: కిట్టు విస్పాప్రగడ, రాంబాబు గోపాల
    పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి
    పబ్లిసిటీ: అనంత్‌,
    ఆర్ట్‌: మురళీ వీరవల్లి
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.ఎస్‌. కుమార్‌
    నిర్మాత: ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ (సత్తిబాబు)
    రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌.

    విడుదల తేదీ: జులై 12, 2019

    English summary
    Rajdoot movie review and rating. Srihari Son Meghamsh debut with Rajdoot Movie. ‘Rajdoot’ the project is directed by Dasari Carthyk and Arjun, who happen to be renowned writers. The movie releasing on July 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X