For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అద్బుతం కాదు కానీ.. (అయ్యారే రివ్యూ)

  By Srikanya
  |

  సంస్థ: ప్రీతమ్‌ ప్రొడక్షన్స్‌
  నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, శివాజీ, సాయికుమార్‌, అనీషాసింగ్‌, డా||శివప్రసాద్‌, అలీ, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు.
  ఎడిటింగ్: ప్రవీణ్ పి.కుమార్
  మాటలు: నివాస్
  కెమెరా: భాస్కర్ సామల
  ఆర్ట్: పార్థసారధి వర్మ
  నిర్మాతలు: బి.సుధాకర్‌బాబు,రంగన అచ్చప్ప
  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిక్షపతి తుమ్మల
  దర్శకత్వం: సాగర్‌చంద్ర.
  విడుదల: శుక్రవారం.

  రాజేంద్రప్రసాద్,శివాజీ కాంబినేషన్ లో గతంలో శ్రీరామచంద్రులు(కామిడీ)వచ్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ ని కంటిన్యూ చేస్తూ ఓ ఢిఫెరెంట్ స్టోరీలైన్ తో అయ్యారే ధియోటర్స్ లో దిగింది. అయితే ఇద్దరూ కామిడీ స్టార్స్ కదా అని ఆశపడకుండా చూస్తే ఇబ్బింది లేదనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ సరిగ్గా లేకపోయినా సెకండాఫ్ బాగుండటంతో ప్లస్ అయ్యింది.

  ఏటీఎమ్‌ సెక్యూరిటీ గార్డ్ ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌)కూతురుకి కాన్సర్ రావటంతో డబ్బుకోసం మస్కట్ వెళదామనుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో స్వామీజీ అవతారమెత్తాల్సి వస్తుంది. మరో ప్రక్క స్కూటర్‌ మెకానిక్ వెంకటేశం (శివాజీ)‌ అంజలి(అనీష)అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.పెద్దలను కూడా ప్పించాక అతని ప్రేమ ఇబ్బందుల్లో పడుతుంది. దానికి అస్సలు పరిచయం లేని ప్రసాద్ కారణమవుతాడు. ఈలోగా ఊహించని పరిస్ధితుల్లో వీరిద్దరూ కలుస్తారు. అప్పుడేమైంది? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెరపైనే చూడాలి.

  సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ స్వామి నిత్యానంద వీడియోకు చిక్కిన ఇతివృత్తం ఆధారంగా నిర్మించారంటూ ప్రచారం జరిగటంతో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. చిత్రంగా అదే అంశం ఈ చిత్రాన్ని కోర్టులకు,సెన్సార్ వద్ద ఇబ్బందులకు గురి చేసి రిలీజ్ ఆలస్యమయ్యేలా చేసింది. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని అంటూ ఆ సినిమా విడుదలను అనుమతించవద్దని అప్పట్లో స్వామి నిత్యానంద కోర్టును కోరారు. అయితే వాటినన్నటినీ దాటుకుని ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే సినిమాలో జనం అనుకున్నట్లుగా నిత్యానందమీద సీన్స్ ఏమీ లేవు. కేవలం ఆ గెటప్ మాత్రమే సినిమా పబ్లిసిటీకి వాడుకున్నారు.

  కధ పరంగా చూస్తే సినిమా ఇంటర్వెల్ తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. అప్పటివరకూ కేవలం పాత్రల సెటప్ కి టైమ్ తీసుకున్నారు. దాంతో ఫస్టాఫ్ బోర్ ఫీల్ వస్తుంది. కానీ సెకండాఫ్ స్పీడుగా గడిచిపోయినట్లుంది. ఇక కామిడీ సినిమా అనుకుని వెళ్లిన వాళ్లకి మాత్రం నిరాశపరుస్తుంది. నటీనటుల్లో రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటాడు. శివాజి ఓకే అనిపిస్తాడు. ఇక శివప్రసాద్,వేణు మాధవ్,శ్రీనివాస రెడ్డి రెగ్యులర్ గా ప్యాడింగ్ ఆర్టిస్టులుగా చేసుకుంటూ వెళ్లిపోయారు. నివాస్ డైలాగ్స్ వాస్తవికతో,కొద్ది పాటి మెసేజ్ తో ఆకట్టుకుంటాయి. మంచి పబ్లిసిటీ చేసుకుంటే సినిమా వర్కవుట్ అయ్యేవాతావరణం ఉంది. కొత్త దర్శకుడు అయినా కొత్త కాన్సెప్టు తో ఎక్కడా తడపడకుండా కథని తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ద పెట్టి ఉంటే మరింత బావుండేది. ఎడిటింగ్,కెమెరా,సంగీతం వంటి విభాగాలు సోసోగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. పైనల్ గా టైమ్ పాస్ కు పనికొచ్చే చిత్రం ఇది.

  English summary
  Rajendra Prasad's latest film Ayyare released today with positive note.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X