క్లైమాక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.5/5

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు
దర్శకత్వం: భవాని శంకర్ కే
నిర్మాతలు: రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి
ఎడిటర్: బసవ పైడి రెడ్డి
మ్యూజిక్: రాజేష్, నిద్వాన
సినిమాటోగ్రఫీ: రవి కుమార్ నీర్ల
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్, రవి (ముంబై)
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్
నిర్మాణం: కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
రిలీజ్ డేట్: 2021-03-05

క్లైమాక్స్ కథ

క్లైమాక్స్ కథ


విజయ్ మోడీ (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి పచ్చి అవకాశవాది. ఎలాంటి అడ్డదారులు తొక్కైనా సరే జీవితంలో పైకి రావాలనుకొంటాడు. ఓ మంత్రికి బినామీగా కూడా వ్యవహరిస్తుంటాడు. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొని పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. పాపులారిటీ కోసం టీవీ షోలు చేస్తాడు. సినిమాలు నిర్మిస్తాడు. చివరకు విజయ్ మోడీ అప్పులపాలవుతాడు. ఓ దశలో దారుణ హత్యకు గురవుతాడు.

క్లైమాక్స్ మూవీలో ట్విస్టులు

క్లైమాక్స్ మూవీలో ట్విస్టులు


అప్పుల పాలైన తర్వాత తాను బినామీగా వ్యవహరించిన మంత్రి నుంచి విజయ్ మోడీ ఎలాంటి సహాయం కోరుతాడు? కష్టాల్లో ఉన్న సమయంలో అమ్మాయితో జరిగిన పరిచయం ఎక్కడికి దారి తీసింది? విజయ్ మోడీకి సంబంధించి సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సెన్సేషనల్ విషయాలు ఏమిటి? స్టార్ హోటల్‌లో రెండు గంటలపాటు సీసీటీవీ ఫుటేజ్ ఆపివేసిన తర్వాత అసలేం జరిగింది? సీఐడీ ఆఫీసర్లకు తెలిసిన విస్తుపోయే అంశాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే క్లైమాక్స్

దర్శకుడు భవానీ శంకర్ ప్రతిభ గురించి

దర్శకుడు భవానీ శంకర్ ప్రతిభ గురించి


దర్శకుడు భవానీ శంకర్ కామెడీ, సస్సెన్స్ థ్రిల్లర్ అంశాలను జోడించి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో దర్శకుడు చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే మరో మంచి ప్రాజెక్ట్ అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్

రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్


విజయ్ మోడీగా రాజేంద్ర ప్రసాద్‌ మరోసారి తన నటన, లుక్స్‌తో వెండితెరపైన మెరిశాడు. చక్కటి అభినయం ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. విభిన్నమైన గెటప్‌తో సరికొత్తగా కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్‌కు ఇలాంటి రోల్స్ కొట్టిన పిండే. ఇక మోడీ పీఏగా నటించిన నాగరాజు క్యారెక్టర్‌కు బాగుంది.

శ్రీరెడ్డి తదితరులు

శ్రీరెడ్డి తదితరులు


శ్రీరెడ్డి తన నిజ జీవితం క్యారెక్టర్‌ను పోషించి ఆకట్టుకొన్నది. సినిమా హీరోయిన్‌గా తనకు నచ్చిన పాత్రలో కనిపించారు. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో తెర మీద తనకు తాను నిరూపించుకోనే అవకాశం దక్కలేదు. సాషా సింగ్, పృథ్వీ, శివశంకర్ మాస్టర్ తదితరులు ఫర్యాలేదనిపించారు.

టెక్నికల్ అంశాల పనితీరు...

టెక్నికల్ అంశాల పనితీరు...

టెక్నికల్ విభాగా పనితీరు కూడా బాగుంది. రాజేశ్ నిద్వాన రీరికార్డింగ్ బాగుంది. రవి కూమార్ నీర్ల సినిమాటోగ్రఫీ సినిమాక మరో ఆకర్షణ, బవస పైడిరెడ్డి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ బాగున్నాయి. రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అభిరుచికి తగినట్టు ఈ సినిమా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

క్లైమాక్స్ ఎలా ఉందంటే..

క్లైమాక్స్ ఎలా ఉందంటే..

క్లైమాక్స్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ కొంచెం కన్‌ఫ్యూజన్ కలిగిస్తుంది. ఆ పాత్రను సరిగా తీర్చి దిద్దితే మరింత మంచి స్క్రిప్ట్ అయ్యేది. భవానీ శంకర్ డైరెక్షన్‌ ఫర్వాలేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉండాల్సిందనే పీలింగ్ కలుగుతుంది. ప్రథమార్థంలో విజయ్ మోడీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికే కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నట్టు కనిపిస్తుంది.

దాంతో ప్రథమార్థం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. సినిమా గంటన్నర నిడివి అయినా ఫస్టాఫ్ బోరింగ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే ఇక కథలో భాగంగా తనకు పరిచయమైన అమ్మాయిని ఒక రాత్రి కబుర్లు చెబితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పే అంశాలు కాస్త హుషురును పుట్టిస్తాయి. ఓవరాల్‌గా కామెడీతోపాటు థ్రిల్లింగ్ మూమెంట్స్, సస్పెన్స్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రేక్షకులు ఓ సారి చూసి ఆనందించడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

క్లైమాక్స్ సినిమా విషయానికి వస్తే.. ప్రథమార్థం కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. సినిమా గంటన్నర నిడివి అయినా ఫస్టాఫ్ బోరింగ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే ఇక కథలో భాగంగా తనకు పరిచయమైన అమ్మాయిని ఒక రాత్రి కబుర్లు చెబితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పే అంశాలు కాస్త హుషురును పుట్టిస్తాయి. ఓవరాల్‌గా కామెడీతోపాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ , సస్పెన్స్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రేక్షకులు ఓ సారి చూసి ఆనందించడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X