Darbar మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Recommended Video

Darbar Movie Review And Rating || దర్బార్ మూవీ రివ్యూ

Rating:
3.0/5
Star Cast: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు
Director: ఏఆర్ మురగదాస్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి, కాలా, పేట సినిమాలు అంచనాలు చేరుకోలేకపోవడం అభిమానులను, ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసాయి. ఇలాంటి క్రమంలో ఏఆర్ మురుగదాస్‌తో కలిసి ఓ మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్బార్‌తో రజనీకాంత్ ప్రేక్షకులను మెప్పించేందుకు ముందుకొచ్చారు. టీజర్లు, ట్రైలర్లకు మంచి క్రేజ్ ఏర్పడటంతో దర్బార్‌పై అంచనాలు పెరిగాయి. జనవరి 9న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పెంచిందా? రజనీకాంత్ మరోసారి తెర మీద మ్యాజిక్ చేశారా? అని తెలుసుకోవాలంటే కథ, కథనాలను తెలుసుకోవాల్సిందే.

దర్బార్ కథ

దర్బార్ కథ

ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ముంబైలో డ్రగ్, అమ్మాయిల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా నియమించబడుతాడు. డ్రగ్ మాఫియాను తుడిచిపెట్టే క్రమంలో చేసిన ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల కమిషన్, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన కూతురు వల్లి (నివేదా థామస్‌) ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. తన కూతురును కోల్పోవడంతో ఆదిత్య అరుణాచలం మరింత అగ్రెసివ్‌గా మారుతాడు.

దర్బార్‌లో ట్విస్టులు

దర్బార్‌లో ట్విస్టులు

డ్రగ్స్, మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ఆదిత్య అరుణాచలం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టాడు? డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్‌ను ఎలా డీల్ చేశాడు? మాఫియా చేతిలో వల్లి ఎలా ప్రాణాలు కోల్పోయింది. సిన్సియర్‌గా డ్యూటీ చేసే ఆదిత్య జీవితంలోకి లిల్లీ (నయనతార) ఎలా ప్రవేశించింది. హరిచోప్రా (సునీల్ శెట్టి) విలనిజం ఎంత వరకు పండింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెరపై దర్బార్ సినిమా చూడాల్సిందే.

 ఫస్టాప్ అనాలిసిస్

ఫస్టాప్ అనాలిసిస్

దర్బార్ తొలి భాగం విషయానికి వస్తే.. ఆదిత్య అరుణాచలం చేసే ఎన్‌కౌంటర్లతో మొదలవుతుంది. అదే సమయంలో సీబీఐ, మానవ హక్కుల విచారణ విషయంలో తన మార్కును, స్టయిల్‌ను చూపించడం కథపై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్ ఎపిసోడ్ మాస్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ప్రథమార్థం మరో లెవెల్‌కు వెళ్లినట్టు కనిపిస్తుంది. ఇక ఓ నిందితుడిని ట్రేస్ చేసే క్రమంలో థాయ్‌లాండ్, నాసిక్ జైలు ఎపిసోడ్ పక్కా నాటకీయత కనిపిస్తుంది. ఇలా ప్రతీ ఫ్రేమ్‌లో రజనీకాంత్ మార్కు నటన, స్టయిల్, డైలాగ్స్‌తోపాటు నయనతార‌తో లవ్ ఎపిసోడ్స్ ఉండటంతో సరదాగా గడిచిపోతుంది.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక ఫస్టాఫ్‌ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా, కథలో భావోద్వేగాలు ఉండటంతో సెకండాఫ్‌పై మరింత అంచనాలు పెరుగుతాయి. అంచనాలకు తగినట్టే నివేదా థామస్‌తో ఎమోషనల్స్ సీన్స్ సరైనా ట్రాక్‌లోనే ఉన్నట్టు అనిపిస్తాయి. నివేదా థామస్, రజనీకాంత్ మధ్య ఎపిసోడ్స్ సెకండాఫ్‌లో భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక రైల్వే స్టేషన్‌లో ఫైట్ సరికొత్తగా ఉంటుంది. ఇలా అంతా సవ్యంగా సాగుతున్నట్టు కనిపించిన దర్బార్ మూవీ చివర్లో ట్రాక్ తప్పినట్టు కనిపిస్తుంది. పగ, ప్రతీకారాలతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. చివరి 15 నిమిషాల్లో దర్శకుడు కథపై పట్టు కోల్పోయినట్టు అనిపించడం ఖాయం.

దర్శకుడు మురగదాస్ ప్రతిభ

దర్శకుడు మురగదాస్ ప్రతిభ

దర్శకుడు ఏఆర్ మురగదాస్ రూపొందించే సినిమాల్లో, రాసుకొనే స్క్రిప్టులో సామాజిక అంశాల ప్రస్తావన బలంగా ఉంటాయి. దర్బార్ సినిమాలో కూడా డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా లాంటి సోషల్ ఎలిమెంట్స్‌తో కథను బలంగా రాసుకొన్నారు. కాకపోతే రజనీకాంత్ స్టయిల్‌ను, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫస్టాఫ్‌ను, సెకండాఫ్‌లో కొంత బాగాన్ని ఎలాంటి లోపాలు లేకుండా ప్లాన్ చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య అనురాగాలు, ప్రేమను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే నయనతారతో లవ్ ట్రాక్‌లో ప్రెష్‌నెస్ కనిపిస్తుంది. గత చిత్రాలతో పోల్చుకొంటే రజనీని డిఫరెంట్‌గా చూపించడంలో సఫలమయ్యాడు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొంత విభిన్నంగా ఆలోచించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

రజనీకాంత్ స్టయిల్..

రజనీకాంత్ స్టయిల్..

ఇక రజనీకాంత్ నటన, స్లయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ సినిమాలో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆలరించడం ఆయనకు పరిపాటే. దర్బార్ సినిమాలో కూడా ప్రేక్షకులు, అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో వాటిని ఇవ్వడంలో రజనీ మ్యాజిక్ చేశారు. కొన్ని సీన్లలో సీరియస్‌గా, మరికొన్ని సీన్లో కొంటెతనం, మరికొన్ని సన్నివేశాల్లో బాధ్యత గల తండ్రిగా ప్రేమను పండించే పలు రకాలు వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషించి ఫ్యాన్స్ పండగ వాతావరణాన్ని నింపాడు. కబాలి, కాలా, పేటతో కొంత అసంతృప్తి గురైన ఫ్యాన్స్ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాడు.

నయనతార గ్లామర్‌గా

నయనతార గ్లామర్‌గా

ఇక నయనతార చాలా అందంగా కనిపించింది. రజనీతో కలిసి కొన్ని సీన్లు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. కనిపించిన కొద్దిసేపైనా ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఇక ఒకే ఒక పాటలో రజనీతో కలిసి ప్రేక్షకులకు జోష్‌ను పెంచింది. నయనతార కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది. పాత్ర నిడివి ఎక్కువగా లేకపోవడం వల్ల నయనతార సినిమాలో తన మార్కును, ప్రభావాన్ని చూపే విధంగా చేయలేకపోయింది.

ఎమోషనల్ పాత్రలో నివేదా థామస్

ఎమోషనల్ పాత్రలో నివేదా థామస్

దర్బార్‌లో నివేదా థామస్‌కు ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించే అవకాశం దక్కింది. రజనీకాంత్‌తో కలిసి నటించే తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొన్నారు. రజనీకాంత్‌తో కలిసి తొలి భాగంలో వినోదాన్ని పంచితే.. రెండో భాగంలో తన నటనతో భావోద్వేగానికి గురిచేసింది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్లలో తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో తన పాత్రకు ఫుల్ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు.

అనిరుధ్ మ్యూజిక్

అనిరుధ్ మ్యూజిక్

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ముందుగా అనిరుధ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సిందే. టైటిల్ సాంగ్‌తో ఇప్పటికే ఇరుగదీయగా.. ఓ డ్యూయెట్, పెండ్లి సీక్వెన్స్‌తో వచ్చే పాటలు జోష్‌ నింపుతాయి. ఇక రైల్వే స్టేషన్‌లో ఫైట్ నేపథ్యంగా వచ్చే పాట కిరాక్ అనిపించేలా ఉంది. రజనీకాంత్ బిల్డప్ సీన్లకు అందించిన సంగీతం హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ. కొన్ని సీన్లను బీజీఎం మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి

ఇక సంతోష్ శివన్ కెమెరా పనితనం సినిమాకు మరో ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్ల చిత్రీకరణ బాగుంది. మాస్ ఎలిమెంట్ కలిపి స్టంట్ డైరెక్టర్లు రామ్ లక్ష్మణ్ రూపొందించిన ఫైట్లు మరీ మాస్‌గా ఉన్నాయి. రజనీకాంత్ గత ఇమేజ్‌ను గుర్తు చేసే విధంగా స్టయిల్‌ను సంతోష్ శివన్ చక్కగా తెరకెక్కించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌కు ఎలాంటి ఢోకా లేదు. లైకా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఇక దర్బార్ చిత్రం రజనీకాంత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్ ఎలిమెంట్స్‌తోపాటు సోషల్ ఇష్యూస్‌ను కలిపి చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్‌ నుంచి ఏమి ఆశిస్తారో అన్నీ ఈ సినిమాలో లభిస్తాయి. గత కొద్ది సంవత్సరాల్లో రజనీ నటించిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. సంక్రాంతి రేసులో తెలుగు సినిమాలకు మంచి పోటీని ఇచ్చే అంశాలు ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఉన్నందున భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

  • రజనీకాంత్
  • నయనతార గ్లామర్
  • నివేదా థామస్ ఫెర్ఫార్మెన్స్
  • ఏఆర్ మురగదాస్ డైరెక్షన్
  • అనిరుధ్ మ్యూజిక్
  • సాంకేతిక అంశాలు
  • ఫస్టాప్
  • మైనస్ పాయింట్స్

    • రొటీన్ క్లైమాక్స్
    • విలన్ క్యారెక్టర్ బలంగా లేకపోవడం
    • తెర ముందు తెర వెనుక

      తెర ముందు తెర వెనుక

      నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు
      కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురగదాస్
      నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్
      మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
      సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్
      ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
      ఫైట్స్: రామ్ లక్ష్మణ్
      బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
      రిలీజ్ డేట్: 2020-01-09

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X