twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున, సమంత మెప్పించారు: ‘రాజుగారి గది 2’ మూవీ రివ్యూ

    రాజుగారి గది 2 చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ప్రేక్షకులను నచ్చే అవకాశం ఉంది.

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    Star Cast: నాగార్జున అక్కినేని, సమంత అక్కినేని, సీరత్ కపూర్
    Director: ఓంకార్

    ఓంకార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'రాజు గారి గది' మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్ అని కాదు కానీ.... ఆ హిట్ ప్రాంచైజీని వాడుకుంటూ తాజాగా 'రాజుగారి గది 2' పేరుతో మరో హారర్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    గతంలో వచ్చిన సినిమాకు స్టార్ గ్లామర్ లేక పోయినా కంటెంటుతో హిట్టయింది. అయితే ఈ సారి సినిమాను మరింత పెద్దగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఇమేజ్ కూడా యాడ్ చేశారు.

    Recommended Video

    Raju Gari Gadhi 2 Movie Public Review : A Must Watch Movie For This Weekend - Filmibeat Telugu

    మరి ఇలాంటి అదనపు హంగులతో వచ్చిన 'రాజుగారి గది 2' సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆలరించింది? నాగార్జున కోరుకున్నట్లు కొత్త కోడలు అక్కినేని ఇంటికి హిటు తెచ్చిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    ‘రాజుగారి గది 2' కథ విషయానికొస్తే.... అశ్విన్, కిషోర్, ప్రవీణ్ ముగ్గురూ కలిసి రాజుగారు కట్టించిన ఓ రిసార్టును కొనుగోలు చేస్తారు. రిసార్ట్ బిజినెస్ బాగా సాగుతుందనుకుంటున్న తరుణంలో అమృత(సమంత) అనే ఆత్మ వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది. దెయ్యం ఉందని తెలియడంతో రిసార్టుకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయి బిజినెస్ దెబ్బతింటుంది. దాన్ని అమ్మేసుకుందామన్నా కొనేవారు ఎవరూ ఉండరు. చర్చి ఫాదర్ సూచన మేరకు వారు ఈ సమస్యను పరిష్కరించేందుకు రుద్ర(నాగార్జున) అనే మెంటలిస్టును ఆశ్రయిస్తారు. అసలు అమృత దెయ్యంగా ఎందుకు మారింది? ఈ రిసార్టునే ఎందుకు టార్గెట్ చేసింది? సైన్సును నమ్మే మెంటలిస్టు.... ఆత్మలను ఎలా హ్యాండిల్ చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

    నాగారార్జున, సమంత పెర్పార్మెన్స్ అదుర్స్

    నాగారార్జున, సమంత పెర్పార్మెన్స్ అదుర్స్

    మెండలిస్టుగా నాగార్జున, ఆత్మగా సమంత పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. ఈ ఇద్దరి పాత్రలే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మెంటలిస్టుగా నాగార్జున తనదైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. రియల్ లైఫ్‌లో ఎలాంటి మాయలు, మర్మాలు లేకుండా మెంటలిస్టులు కేసులు ఎలా పరిష్కరిస్తారు? అనే ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

    సీరత్ కపూర్ గ్లామర్

    సీరత్ కపూర్ గ్లామర్

    సినిమాలో హీరోయిన్ సీరత్ కపూర్ ‘సుహానిషా' అనే కీలకమైన పాత్రలో నటించింది. కేవలం ఆత్మలు, కామెడీయేనా...? కాస్త గ్లామర్ కూడా యాడ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమెను సినిమాలో తీసుకున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేక పోయినా తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్‌తో ఆకట్టుకుంది.

    అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్

    అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్

    ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో మూడు పాత్రలు అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్. అశ్విన్ నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. వెన్నెల కిషోర్, ప్రవీణ్ కామెడీ అక్కడక్కడా ప్రేక్షకులను నవ్వించింది.

    సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

    సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

    డి. దివాకరన్ అందించిన సినిమాటోగ్రఫీ ఓకే. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్సయింది. ఎడిటింగ్ కూడా బావుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

    సినిమా కథ ఎలా ఉందంటే..

    సినిమా కథ ఎలా ఉందంటే..

    ఓ ఆత్మ చుట్టూ తిరిగే హారర్, కామెడీ సినిమా అంటే..... ఆ ఆత్మకు బ్రతికున్నపుడు ఏదో అన్యాయం జరుగడం, పగ తీర్చుకునేందుకు ప్రత్నించడం, ఇందుకోసం మనుషుల సహాయం తీసుకోవడం లాంటివి మామూలే. కాక పోతే సంఘటనలు, సందర్భాలు వేరు అంతే. రాజుగారి గది 2 స్టోరీ కూడా అలానే రొటీన్‌గా ఉంది.

    స్క్రీన్ ప్లే....

    స్క్రీన్ ప్లే....

    హారర్ కామెడీ కాన్సెప్టు ఎంచుకున్నపుడు...... ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే హారర్, కడుపుబ్బా నవ్వించే కామెడీ అవసరం. ఈ రెండింటిని పకడ్బిందీగా డీల్ చేస్తూ గ్రిప్పింగ్ గా సాగే స్క్రీన్ ప్లే ఉన్నపుడే ప్రేక్షకుడు థ్రిల్ అవుతాడు. అయితే ‘రాజుగారి గది 2' సినిమా విషయంలో ఈ అంశాలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

    సెకండాఫ్ లో సెంటిమెంటుతో టచ్ చేశాడు

    సెకండాఫ్ లో సెంటిమెంటుతో టచ్ చేశాడు

    ఫస్టాఫ్ కాస్త హారర్, కాస్త కామెడీతో సరదాగా సాగితే... సెకండాఫ్ మాత్రం ఫాదర్ సెంటిమెంటుతో టచ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తండ్రీ కూతుళ్లుగా సమంత, రావు రమేష్ పోర్షన్ చాలా చిన్నదే అయినప్పటికీ ప్రేక్షకుల హార్ట్‌కు బాగా కనెక్ట్ అయిపోతుంది.

    విజువల్ ఎఫెక్ట్స్

    విజువల్ ఎఫెక్ట్స్

    సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... వంక పెట్టడానికి ఏమీ లేదు. చాలా క్వాలిటీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.

    డైరెక్టర్ ఓంకార్ గురించి

    డైరెక్టర్ ఓంకార్ గురించి

    దర్శకుడు ఓంకార్ గురించి మాట్లాడుకుంటే.... దర్శకత్వం పరంగా సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో స్క్రిప్టు ఇంకాస్త బలంగా ఉంటే సినిమా ఓ రేంజికి వెళ్లిపోయేది.

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్లస్, మైనస్ పాయింట్స్

    నాగార్జు, సమంత, సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ పార్ట్, థమన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ అని ఏమైనా చెప్పుకోవాల్సి వస్తే..... సినిమా ఆరంభంలో కాస్త బోర్ పీలవుతాం. అది కాస్త మైనస్.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కామెడీ, హారర్, సెంటిమెంటు కలగలిపిన ఈ చిత్రం రాజుగారి గది 2. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త గొప్ప అనుభూతి ఇస్తుందని చెప్పలేం కానీ.. ప్రేక్షకుడిని నిరాశ పరిచే చిత్రం అయితే కాదు.

    English summary
    Raju Gari Gadhi 2 Movie Review and Rating by Telugu Filmibeat. It is above average Horror comedy film, produced by Prasad V Potluri under PVP Cinema, Matinee Entertainments banner and OAK Entertainments. It is directed by Ohmkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X