twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజు గారి గది 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Raju Gari Gadhi Review And Rating || రాజు గారి గది 3 మూవీ రివ్యూ

    Rating:
    2.0/5
    Star Cast: అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, బ్రహ్మాజీ, ఊర్వశి తదితరులు
    Director: ఓంకార్

    కేరళకు చెందిన మాయ (అవికా గోర్) డాక్టర్. ఆమెను ఎవరైనా ఐ లవ్ యూ అంటే ఏదో ఓ శక్తి వారిపై దాడి చేస్తుంటుంది. అలా దాడికి గురైన వారిలో డాక్టర్ (బ్రహ్మాజీ)తో పాటు హీరో అశ్విన్ (అశ్విన్ బాబు) కూడా ఉంటారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా మాయ ప్రేమలో అశ్విన్ పడుతాడు. కానీ మాయ వెనుక అదృశ్య శక్తి కారణం ఆమె తండ్రి, కేరళ మాంత్రికుడు (అజయ్ ఘోష్) అని తెలుస్తుంది. తన మామను మెప్పించి మాయను పెళ్లి చేసుకొనేందుకు కేరళ వెళ్తాడు.

    రాజు గారి గది కథలో మలుపులు

    రాజు గారి గది కథలో మలుపులు

    కేరళలో మాంత్రిక మామను ఒప్పించడానికి అశ్విన్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? అశ్విన్‌ ప్రయాణంలో తన స్నేహితుడు (అలీ) ఎలా తోడుగా నిలిచారు. అశ్విన్, అలీ కలిసి తెర మీద ఎలాంటి హల్‌చల్ చేశారు. కేరళలో అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? మాయ వెనుక ఉన్న అదృశ్య శక్తి అక్షి కథ ఏమిటి? ఎందుకలా మాయను నీడలా వెంటాడింది. మాయ ప్రేమను సొంతం చేసుకోవడానికి అక్షిని ఏం చేశాడనే ప్రశ్నలకు సమాధానమే రాజు గారి గది 3 సినిమా కథ.

    ఫస్టాఫ్ విషయానికి వస్తే

    ఫస్టాఫ్ విషయానికి వస్తే

    ఇక రాజు గారి గది 3 ఫస్టాఫ్ విషయానికి వస్తే.. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో కాస్త నిదానంగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఇక నాసిరకమైన, ముతక కామెడీతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. రొటీన్ స్క్రీన్ ప్లేతో ఫస్టాఫ్‌ అలా సాగిపోతుంది. ఇక తొలి భాగంలో బ్రహ్మజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను లాంటి క్యారెక్టర్ల మధ్య హాస్యం ఆకట్టుకోలేకపోయింది.

    సెకండాఫ్ గురించి

    సెకండాఫ్ గురించి

    ఇక సెకండాఫ్ కథ.. కేరళకు చేరడంతో కొంత ఏదైనా ఆసక్తిగా ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక అజయ్ ఘోష్, ఊర్వశి ఎపిసోడ్స్‌తో టైంపాస్ దిశగా కథ సాగుతుంది. కాకపోతే రెండో భాగంలో అలీ, అజయ్ ఘోష్, అశ్విన్, ఊర్వశి మధ్య ఎపిసోడ్ కొంచెం నాటుగా ఉన్నప్పటికీ.. సినిమా మొత్తానికి ఊరట కలిగించే అంశంగా మారింది. ఇక క్లైమాక్స్ కూడా సాదాసీదా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేదనే ఫీలింగ్‌తో బయటకు పరిస్థితి ఉంటుంది.

    దర్శకుడు ఓంకార్ గురించి

    దర్శకుడు ఓంకార్ గురించి

    రాజు గారి గది సిరీస్ చిత్రాల విషయానికి వస్తే.. గత రెండు చిత్రాలను ఓ రేంజ్‌లో తెరకెక్కించిన దర్శకుడు ఓంకార్.. మూడో గది విషయానికి వస్తే తడబాటుకు గురైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కథపై కసరత్తు లేకుండా కథనంపై ఎలాంటి గ్రిప్ లేకుండా వినోదాన్ని బలంగా నమ్ముకొని ఈ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. పాత్రల చిత్రీకరణ, కామెడీ సన్నివేశాల్లో కొత్తదనం ఏమి కనిపించదు. ఓంకార్ అంటే డీసెంట్ కామెడీ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రాజు గారి గది2 సినిమా విషయానికి వస్తే కొన్ని ద్వందార్థాలు, అశ్లీలం కోటింగ్‌తో డైలాగ్స్ అక్కడక్కడా ఇబ్బంది కలిగించే రీతీలో ఉంటాయి. సాఫ్ట్ కామెడీకి బదులు నాటు హాస్యానికే పెద్ద పీట వేయడం ఈ సిరీస్ ఉండే ఫ్లేవర్‌ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తంగా రాజు గారి గది మాస్ ఆడియెన్స్ చేరవ చేసే సగటు చిత్రంగా మిగిలిందని చెప్పవచ్చు.

    హీరో, హీరోయిన్లు, మిగితా పాత్రలు

    హీరో, హీరోయిన్లు, మిగితా పాత్రలు

    హీరోగా అశ్విన్, హీరోయిన్‌గా అవికా గోర్ పాత్రల్లో పెద్దగా ఫీల్ గుడ్ టచ్ కనిపించదు. వారిద్దరి పాత్రలు చాలా కాజువల్‌గా ఉండటంతో తేలిపోయాయి. పాత్రల తీరుతెన్నులు సరిగా లేకపోవడం వల్ల తెర మీద ఆ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారనే చెప్పవచ్చు. ఇక అలీ విషయానికి వస్తే రొటీన్ కామెడీతో పని కానిచ్చేశాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బాగున్నాయి. దాంతో కాస్త రిలీఫ్ కలిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. మిగితా పాత్రల్లో అజయ్ ఘోష్, ఊర్వశి పాత్రలు ఆకట్టుకొంటాయి. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమున్నట్టు కనిపించదు.

     సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథ, కథనాలు, సన్నివేశాలు బలంగా లేకపోవడం వల్ల డైలాగ్స్‌లో పెద్దగా పస కనిపించదు. బుర్రా సాయిమాధవ్ మార్కు డైలాగ్స్ ఎక్కడా వెతికినా వినిపించవు. ఇక ఈ సినిమా విషయంలో పాజిటివ్‌గా చెప్పాల్సింది సినిమాటోగ్రఫి. చోటా కే నాయుడు పేలవమైన సన్నివేశాలకు కూడా ఫీల్‌గుడ్‌గా మలిచాడని చెప్పవచ్చు. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తెరపైన బాగున్నాయి. ఇక ఈ సినిమాకు మరో ఆకర్షణ రీరికార్డింగ్.. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ చేసింది. రెండు గంటల నిడివిలో గౌతం రాజు కత్తెర పదును ఎక్కువగానే కనిపించింది. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    ఇక సినిమాను రిచ్‌గా చూపించడానికి చిత్ర యూనిట్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కేరళలోని కొన్ని ప్రదేశాలు, కొన్ని సెట్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ ఫీలింగ్ కలిగించేందుకు డిజైన్ చేసిన వాతావరణం యాప్ట్‌గా ఉంది. ఇలాంటి పాజిటివ్ అంశాలకు మంచి కథ, కథనాలు జోడైతే మూడో గది కూడా మంచి ఫలితాన్ని సొంతం చేసుకొనే పరిస్థితి ఉండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రాజు గారి గది సినిమా సిరీస్‌లకు ప్రేక్షకుల్లో మంచి ఓపీనియన్ ఉంది. ఓంకార్ చేసిన రెండు సినిమాలు ఏదో రకంగా ప్రేక్షకులను మెప్పించాయి. ఇక మూడో గది మాత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి. మొరటు హాస్యం, అశ్లీలతో కూడా ఐటెమ్ సాంగ్, బూతుతో కూడిన డైలాగ్స్ సినిమాకు ప్రతికూలంగా మారాయి. మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా చేరువైతే కమర్షియల్‌గా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సిరీస్‌లో ఏ రేంజ్ సక్సెస్‌ను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    సినిమాటోగ్రఫి
    రీరికార్డింగ్
    సెకండాఫ్‌లో కొంత భాగం

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్
    కథ, కథనాలు
    డైరెక్షన్
    పాత్రల చిత్రీకరణ
    నాసిరకమైన కామెడీ

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, బ్రహ్మాజీ, పోసాని, ధన్య బాలకృష్ణ, ఊర్వశి, అజయ్ ఘోష్, ప్రభాస్ శ్రీను, హరితేజ, ధన్ రాజ్ తదితరులు
    దర్శకత్వం: ఓంకార్
    నిర్మాత: కల్యాణ్ చక్రవర్తి
    మ్యూజిక్: షాబీర్
    సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
    ఎడిటింగ్: గౌతం రాజు
    ఆర్ట్: సాహి సురేష్
    స్పెషల్ ఎఫెక్ట్స్: రఘునాథ్
    స్టంట్స్: వెంకట్
    బ్యానర్: వరాహి చలన చిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్

    English summary
    Raju Gari Gadhi 3 movie review and rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X