Raju Weds Rambai Movie Review: రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ

Rating:
3.0/5

నటీనటులు: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు
రచన, దర్శకత్వం: సాయిలు కంపాటి
నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
సహ నిర్మాతలు: ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: నరేష్ అడుపా
ప్రొడక్షన్: ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్: వంశీ నందిపాటి (వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
కాస్ట్యూమ్ డిజైనర్స్: ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్: ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధన గోపి
రిలీజ్ డేట్: 2025-11-21

ఇల్లందుకు సమీపంలోని ఓ గూడెంలో తన తల్లిదండ్రులు (శివాజీ రాజా, అనిత చౌదరీ)తో కలిసి తన కులవృత్తి బ్యాండ్ మేళం ట్రూప్‌ను రాజు (అఖిల్ రాజ్) నిర్వహించుకొంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. అదే గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేసే వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) కూతురు రాంబాయి (తేజస్వినీ)తో రాజు ప్రేమలో పడుతాడు. ఇద్దరూ ప్రేమించుకొంటూ లైఫ్‌ను కలర్‌ఫుల్‌గా ఊహించుకొంటున్న సమయంలో తన తండ్రి వెంకన్నకు కూతురు ప్రేమ విషయం తెలుస్తుంది. ప్రాణం కంటే మిన్నగా పరువును భావించే వెంకన్న.. రాజుతో తన కూతురు ప్రేమను నిరాకరిస్తాడు. ఈ గొడవల్లో రాజు కుటుంబంపై భారీ దెబ్బ పడుతుంది.

Raju Weds Rambai Movie Review

రాజును రాంబాయి ఎందుకు అమితంగా ఇష్టపడుతుంది? రాజుతో కూతురు ప్రేమను వెంకన్న ఎందుకు నిరాకరించాడు? తన కూతురు కోసం కాబోయే భర్త ఎలా ఉండాలని వెంకన్న కోరుకొన్నాడు? వెంకన్న ఫ్యామిలీకి, రాజు ఫ్యామిలీకి జరిగిన గొడవల్లో ఏం జరిగింది? రాజుకు జరిగిన నష్టం ఏమిటి? చివరకు రాజు, రాంబాయి పెళ్లి విషయంలో వెంకన్న తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం ఏమిటి? పరువు కోసం వెంకన్న నీచంగా ఎలాంటి పనికి దిగజారాడు అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే రాజు వెడ్స్ రాంబాబు సినిమా కథ.

మానుకోట, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని తొలి చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి రాసుకొన్న కథ, కథనాల్లో సహజత్వం, నిజాయితీ, ఓ బలమైన నమ్మకం కనిపిస్తుంది. మూల కథను సన్నివేశాలను బలంగా విస్తరించే క్రమంలో కొంత తడబాటు కనిపించింది. కాకపోతే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా, సరదాగా, చిన్న పిరియాడిక్ టచ్‌తో కథను ముందుకు లాక్కెల్లడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఎమోషనల్ లవ్ స్టోరికి ముగింపు ఇచ్చేందుకు అనుసరించిన ట్రావెల్ విషయంలో సాగదీత ఉండటంతో ఎలివేట్ కావాల్సిన ఆడియెన్స్‌ ఫీలింగ్స్, ఎమోషన్స్‌‌పై కొంత ప్రభావం చూపించాయి. కాకపోతే అత్యంత భావోద్వేగంతో కూడిన క్లైమాక్స్ ఎపిసోడ్‌తో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చి పూర్తిగా తన వంతు న్యాయం చేయడమే కాకుండా ప్రేక్షకుడిని ఓ ఫీలింగ్‌లో ముంచెత్తడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కొంత జాగ్రత్త పడి ఉంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరి అయి ఉండేదనే ఫీలింగ్ కలిగింది.

రాజుగా అఖిల్, రాంబాయిగా తేజస్విని నటనకు కొత్తవారైనా.. ఎక్కడా కూడా బెరుకు లేకుండా అనుభవం ఉన్న యాక్టర్ల మాదిరిగా తమ పెర్ఫార్మెన్స్‌ను డెలివరీ చేశారు. నటించారనే కంటే.. తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ఎంతో డెప్త్ ఉన్న పాత్రలను చాలా సున్నితంగా, సహజంగా పోషించారు. వారు చూపించిన నటనతో మంచి భవిష్యత్ ఉందని తమకు తాము నిరూపించుకొన్నారు. ఈ కథకు కావాల్సిన అదనపు బలాన్ని చైతన్య, శివాజీ రాజా, అనితా చౌదరీ, స్నేహితుల బృందం అందించారు. చైతన్య కొత్త రకమైన విలనిజాన్ని ప్రదర్శించి ఆకట్టుకొన్నాడు.

ఈ సినిమా సాంకేతిక బలాల విషయానికి వస్తే.. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫి, సురేష్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు హైలెట్. అచ్చ తెలుగు గ్రామీణ కథకు కావాల్సిన విజువల్స్, పల్లె వాతావరణం ఈ సినిమాకు బ్యూటీగా మార్చేలా చేశాడు వాజిద్. పొలాలు, చెలకలు, బావులు, చెట్టుపుట్టలను చాలా సహజత్వంగా చూపించారు. ఇక గ్రామీణ ప్రేమ కథకు కావాల్సిన పాటలను, బ్యాక్ గ్రౌండ్ స్కోరును చక్కగా అందించాడు సురేష్ బొబ్బిలి. సెకండాఫ్‌లో కొంత ల్యాగ్ అనిపించడంపై ఎడిటర్ మరింత దృష్టిపెట్టాల్సింది. సినిమా మంచి అభురిచి ఉన్న దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి తన టేస్ట్‌కు తగినట్టు నిర్మాణ విలువలను పాటించారు. రాహుల్ మోపిదేవీ, ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

పరువు హత్యలతో కూడిన ప్రేమ కథలు తెలుగు తెరపైన చాలానే చూసి ఉంటాం. కానీ రాజు వెడ్స్ రాంబాయి ఓ డిఫరెంట్ ఫీల్ ఉన్న కథ. నిజాయితీ, ఇన్నోసెన్స్, ఫ్యూరిటీతో సాగే ప్రేమ కథ. సెకండాఫ్‌లో కంటెంట్ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. ఆ కంప్లయింట్ తప్పా.. మంచి ఎమోషన్స్ సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌ హృదయాన్ని టచ్ చేసే సీన్లు ఉంటాయి. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన క్లైమాక్స్ ఎపిసోడ్ వెంటాడుతూనే ఉంటుంది. ఈ వారం మీరు థియేటర్‌లో చూడాలనుకొన్న సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయిని నిస్పందేహంగా చేర్చుకోవచ్చు. ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X