Raju Weds Rambai First Review: రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ రివ్యూ

విరాటపర్వం ఫేమ్, యువ దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవీ నిర్మిస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరి రాజు వెడ్స్ రాంబాయి. మాన్‌సూన్ టేల్స్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డాక్టర్ నాగేశ్వరరావు సమర్పిస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ రూపొందించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫిని, సురేష్ బొబ్బిలి సంగీతం, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా ప్రియాంక వీరబోయిన, ఆర్తీ విన్నకోట, ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21వ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు రివ్యూ చేశారు. ఈ మూవీపై వారి ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ సినిమా కథ ఏమిటనే విషయంలోకి వెళితే..

Raju Weds Rambai Review by Censor Board

వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన యదార్ధ సంఘటన. ఆ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమా భావోద్వేగమైన ప్రేమ కథనే కాకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. రాజుగా అఖిల్, రాంబాయిగా తేజస్విని కీలక పాత్రల్లో నటించారు. రాంబాయి తండ్రి పాత్రలో చైతన్య జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తుంది. రూరల్ నేటివిటీతో సాగే ఎమోషనల్ స్టోరిలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ వెన్నుముకగా నిలిచాయి అనే అభిప్రాయం వ్యక్తమైంది. కథ చెప్పడంలో దర్శకుడు సాయి కంపాటి నిజాయితీ, ఇన్నోసెన్స్, ఫ్యూరిటీ ఈ సినిమా అందరికి చేరువయ్యేలా చేస్తుందని అని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రాజు వర్సెస్ రాంబాయి సినిమా పూర్తిస్థాయి కంటెంట్ ప్రధానంగ సాగే సినిమా. ఇందులోని పాత్రలను తెరపై సజీవంగా ఆవిష్కరించే ప్రయత్నంలో నిజాయితీ కనిపించింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను, అలాగే వెంకన్న పాత్రకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో స్వల్ప అభ్యంతరాలు సెన్సార్ నుంచి వ్యక్తమయ్యాయి. వాటిని పరిగణనలోకి తీసుకొన్న చిత్ర యూనిట్ స్వల్ప మార్పులు చేసేందుకు అంగీరించినట్టు తెలిసింది.

రాజు వర్సెస్ రాంబాయి మూవీని వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలు చూడటానికి అనుమతి ఉంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల సంరక్షణలో వీక్షించవచ్చు అని సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని కథకు ఎంత అవసరమో అంతే మొత్తంలో నిడివిని ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివిని 135 నిమిషాలు అంటే.. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథను ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలను పొందుపరిచారు. కథను డీవియేట్ చేసే అంశాలకు చోటు చేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X