Raju Yadav Review ఎమోషనల్ హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరి.. రాజు యాదవ్ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: గెటప్ శ్రీను, ఆనంద చక్రపాణి, అంకిత కరత్ తదితరులు
దర్శకత్వం: కృష్ణమాచార్య
సినిమాటోగ్రఫి: సాయిరాం ఉదయ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: రాజేశ్ కల్లెపల్లి, ప్రశాంత్ రెడ్డి
రిలీజ్ డేట్: 2024-05-24

మహబూబ్ నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన రాజు యాదవ్ డిగ్రీ ఫెయిల్ అయి జల్సాగా బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ముఖానికి గాయం కావడం.. డాక్టర్ చేసిన తప్పిదానికి ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపించేలా అవుతాడు. అయితే తండ్రి (ఆనంద చక్రపాణి) తన కొడుకు ఏమై పోతాడానే భయంతో నిత్యం సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. లోపల బాధపడుతూనే రాజు యాదవ్ ను ప్రతీ రోజు తిట్టకుండా ఉండడు. అలాంటి సమయంలో స్వీటి ( అంకిత కరత్) అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఓ సందర్భంలో వారిద్దరూ శారీరకంగా ఏకమౌతారు. ఊహించని విధంగా రాజును దూరంగా స్వీటి పెట్టడంతో అతడు షాక్ తింటాడు.

Raju Yadav Review in Telugu  Get up Srinu steal the show
రాజు యాదవ్‌కు దెబ్బ తగిలిన తర్వాత డాక్టర్ చేసిన తప్పేంటి? దాని వల్ల జీవితాంతం ఎలా బాధపడ్డాడు. రాజు బాధ్యతాయుతంగా ఉండాలని తండ్రి ఏం చేశాడు? తన వైద్యానికి కావాల్సి 4 లక్షలు రాజుకు తండ్రి ఎందుకు ఇవ్వనన్నాడు. వైద్యానికి తండ్రి డబ్బు ఇవ్వకపోవడంతో రాజు ఏం చేశాడు? స్వీటి కోసం రాజు అనుక్షణం ఎందుకు తిరిగిన.. పీకల్లోతు ప్రేమ ఉందని వ్యక్తం చేసినా ఎందుకు నిరాకరించింది. స్వీటి తన ప్రేమను నిరాకరించడంతో రాజు ఎలా స్పందించాడు? చివరకు రాజు తన ప్రేమను గెలుచుకొన్నాడా? లేదా ఏం చేశాడు? తండ్రి ఆశించినట్టు రాజు ప్రయోజకుడు అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రాజు యాదవ్ సినిమా కథ.

రాజు యాదవ్ తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ కథ. భావోద్వేగ సన్నివేశాలకు ఫన్ జోడించిన తీరు దర్శకుడు కృష్ణామాచర్య బాగుంది. అయితే ఇంకా బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే లవ్ స్టోరిలో కొత్తదనం లేకపోవడం, అంతా ఊహించినట్టే ఉండటం ఈ సినిమాకు కొంత మైనస్. కాకపోతే చివర్లో తండ్రి క్యారెక్టర్ ద్వారా సినిమాను హార్ట్ టచింగ్ మలచిని తీరుతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారనిచెప్పవచ్చు.

Raju Yadav Review in Telugu  Get up Srinu steal the show
చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే.. ఓ పెక్యులర్ ఫేస్‌తో రాజు యాదవ్‌గా గెటప్ శ్రీను కనిపించి మెప్పించాడు. ఇక ప్రేమికుడిగా, తనలోని లోపాలను అధిగమించే యువకుడిగా గెటప్ శ్రీను అలరించాడు. ఇక ముఖ్యంగా తండ్రి పాత్రలో ఆనంద చక్రపాణి చివరి 20 నిమిషాలు సినిమాను నిలబెట్టాడు. మల్లేశం, అనుకోకుండా ఓ అతిథి చిత్రంలో కంటే మించి నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలో నటించిన మిగితా వారందరూ అనిపించారు.

ఈ చిత్రంలో సాంకేతిక విషయాలు వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి,మ్యూజిక్ ప్లాస్ పాయింట్స్. సాయిరాం ఉదయ్ సన్నివేశాలను ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కించారు. సురేష్ బొబ్బిలి, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం బాగుంది. పాటలు సినిమాకు ప్లస్ పాయింట్. ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి సినిమాను ఫీల్ గుడ్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. చాలా షార్ప్‌గా సన్నివేశాలను పరిగెత్తించేలా చేశారు. సెకండాఫ్‌లో చాలా సీన్లు ల్యాగ్‌గా ఉన్నాయనిపిస్తుంది. నిర్మాతలు రాజేష్ కల్లెపల్లి, ప్రశాంత్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X